స్టార్ యాంకర్ సుమ బట్టలపై సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్.. ఈ వయసులో కూడా అవే బట్టలు అంటూ..
స్టార్ యాంకర్ గా మకుటం లేని మహారాణిగా దూసుకులుతున్న సుమకు సీనియర్ నటి రాజ్యలక్ష్మీ షాక్ ఇచ్చింది. ఈ వయసులో కూడా మేము వయసులో ఉన్నప్పుడు బట్టలు వేసుకుంటున్నావ్ అంటూ సంచలన కామెంట్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ప్రతివారం సెలబ్రిటీలను పిలిచి క్యాష్ షోను ఫుల్ ఎంతెర్తైనింగ్ గా నడుపుతారు సుమ. ఇక ఈ వారం ఎపిసోడ్ కోసం సీనియర్ నటులు గౌతమ్ రాజు, బాబు మోహన్, శివకుమారి రావడం జరిగింది.
ఈ సీనియర్ నటులతో సుమ క్యాష్ ఫుల్ జోష్ గా సాగింది. సీనియర్స్ అయినా కూడా సుమ పంచ్ లకు కౌంటర్లు వేస్తూ షోని ఎంటర్టైనింగ్ గా నడిపారు.
సుమ బాబు మోహన్ ని మీరు మొదటిసారి క్యాష్ కి వచ్చారని అనగా... లేదు గతంలో ఒకసారి వచ్చిన జ్ఞాపకం ఉందని బాబూమోహన్ అన్నారు. ఆ మాటలను అందుకుంటూ శివకుమారి, ఈ ప్రోగ్రాం లో వచ్చిన డబ్బులతోనే మీరు ఇల్లు కొనుక్కున్నారు అంటూ పంచ్ వేసింది.
అయితే వీరిని పరిచయం చేసేటప్పుడు సుమకు రాజ్యలక్ష్మి షాక్ ఇచ్చింది. రాజ్యలక్ష్మి పై పంచ్ వేద్దామనుకున్న సుమకు ఆమె రివర్స్ పంచ్ షాక్ ఇచ్చింది.
మీరు నాకు పోటీ ఇవ్వాలని గట్టిగా రెడీ అయ్యి వచ్చారు అని సుమ రాజ్యలక్ష్మి ని ఉద్దేసించి అన్నారు. ఆ మాటకు రాజ్యలక్ష్మి నిన్ను చూస్తే నాకు అసూయ కలుగుతుంది. దానికి కారణం.. ఎప్పుడో మేము చిన్నప్పుడు వేసుకున్న లంగా ఓణీలు నువ్వు ఏ వయసులో కూడా వేసుకుంటున్నావ్.. రాజ్యలక్ష్మి అని అన్నారు.
అంటే మీ అర్థం నా వయసు చాలా పెద్దది, అయినా ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అనేగా.. అంటూ ఫీల్ అయ్యింది. ఈ సన్నివేశం షోలో ఉన్న వారందరి మోముపై నవ్వులు పూయించింది.
వచ్చే వారం ప్రసారం కానున్న క్యాష్ ప్రోమో ఇలాంటి ఎంటర్టైనింగ్ విషయాలతో కలగలిపి ఉంది. మొత్తంగా వచ్చే వారం క్యాష్ మరింత ఆకట్టుకోనుందని అర్థం అవుతుంది.