- Home
- Entertainment
- రచ్చ రచ్చ చేస్తున్న ఇనయా, ఆది- గీతు మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్, హోరా హోరీగా కెప్టెన్సీ టాస్క్
రచ్చ రచ్చ చేస్తున్న ఇనయా, ఆది- గీతు మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్, హోరా హోరీగా కెప్టెన్సీ టాస్క్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో రచ్చ కొనసాగుతుంది. లాస్ట్ వీక్ నుంచి కెప్టెన్సీ టాస్క్ ను సీరియస్ గా తీసుకున్న కంటెస్టెంట్స్ కొట్లాడుతున్నారు. ఇదే అదునుగా ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇక ఎప్పటిలాగానే బిగ్ బాస్ హౌస్ లో ఇనయా రెహ్మన్ రచ్చ కొనసాగుతూనే ఉంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో రచ్చ కొనసాగుతుంది. లాస్ట్ వీక్ నాగార్జున ఇచ్చిన వార్నింగ్ తో చాలా వరకూ సెట్ అయ్యారు కంటెస్టెంట్స్. కాని తిట్లు, కొట్లాటలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు పోరాడుతున్నారు కెప్టెన్సీ టాస్క్ లో. ప్రాణ స్నేహితులు కూడా బద్ద శత్రువులుగా మారుతున్నా. ఈ క్రమంలోనే కొంత మంది టంగ్ స్లిప్ అవుతున్నారు. వారికి ఈవారం నాగ్ చేతిలో క్లాస్ తప్పేట్లు లేదు.
ముఖ్యంగా ఇనయా అన్న మాట హౌస్ లో వేడి రగిల్చింది. శ్రీహాన్ - శ్రీసత్యల మీద వల్గర్ కామెంట్లు చేసి.. మళ్లీ మాట మార్చడంతో రచ్చ రచ్చ అవుతుంది ఇంట్లో. ఈ మధ్యలో గేమ్ లో కూడా ఒకరిని మరొకరు గాయపర్చుకుంటూ.. తిట్టుకుంటూ రచ్చ చేస్తున్నారు. అటు ఇనయా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన సూర్యను తలుచుకుంటూ.. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. సూర్య ప్లేట్ లో తింటున్నాను. నా ప్లేట్ కనిపించకుండా పోయింది అంటూ హౌస్ లో కొత్త గొడవకు తెరలేపింది ఇనయా.
తానే తినను ని చెప్పి.. తరువాత తనను తినకుండా చేశాను అంటూ అబద్దాలాడుతుంది ఇనయా. ఈ మధ్యలో జరిగిన వ్యవహారంలో ఫైమా నిజం చెప్పి తన బండారం బయట పెట్టడంతో.. ఫైమాను తన ఫ్రెండ్ కాదంటూ.. బాధపెట్టింది ఇనయా. అటు కీర్తి, మెరినాలు మాత్రం ఇనయాను పాంపరింగ్ చేస్తూ..బ్రతిమలాడి తినిపిస్తున్నారు.
తను సూర్య ప్లేట్ లో తింటున్నా అని కావాలనే ఆ ప్లేట్ దాచారంటూ ఫైర్ అయ్యింది. ఇనయా. ఈ విషయంలో శ్రీహాన్ ఆమెతో వాదనకు దిగి ఫైర్ అయ్యాడు. అటు రేవంత్ కూడా తన వర్షన్ వినిపించాడు. గేమ్ విషయంలో అందరూ ఫైర్ తో ఆడుతున్నారు. ఎవరూ ఎక్కడా తగ్గడంలేదు.
అటు గేమ్ చాలా సీరియస్ గా నడుస్తుంది. రోహిత్-ఇయనాలతో రేవంత్ మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. రేవంత్ ను త్వరగా మాన్యూప్లేట్ చేయవచ్చు అన్న ఐడియాతో బ్లూటీమ్ వాళ్ళు.. రెడ్ టీమ్ లో ఉన్న రేవంత్ నురెచ్చగోడుతున్నారు. గేమ్ లోవాదోపవాడాలతో పాటు చిన్న చిన్న గాయాలు కూడా అవుతున్నాయి.
అటు ఆది రెడ్డి -గీతు మద్య కూడా శత్రుత్వం వచ్చేలా ఉంది. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రేట్ టాస్క్ తో ఆదిరెడ్డి రెచ్చిపోతున్నాడు. అటు గీతూను ఓడించి చంపేశారు బ్లూటీమ్. అయినా కూడా ఆదిరెడ్డి డ్రెస్ దాచి గేమ్ లో ఫైర్ పెంచింది గీతు. అందరూ ఎవరు దాచారు అని ఆలోచిస్తూ.. గీతూ మీదనే ఫైర్ అవుతున్నారు. ఆదిరెడ్డి మాత్రం గీతూనే తీసి ఉంటుంది అని ఫిక్స్ అయ్యి ఉన్నాడు.
అటు గీతూ టీమ్ నుంచి రెండు గ్రానెట్ లు తీసి దాచింది ఇనయా. కాని అది కనిపెట్టిన గీతూ.. మళ్లీ వాటిని సాధించింది. అటు ఎవరికి వారు గేమ్ ప్లానింగ్ లో ఉండగా... కొంటె పనులు చేసేవారు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఆదిరెడ్డి తన వర్షన్ చెప్పగా.. మా టీషర్ట్ కూడా చించేశారు అంటూ శ్రీహాన్, గీతూ ఆదిరెడ్డికి క్లారిటీ ఇచ్చారు. రెండు టీమ్ ల్లో నుంచి దొంగలు ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు.