సావిత్రి నుండి ఛార్మి వరకు... నిర్మాతలుగా మారి దివాళా తీసిన హీరోయిన్స్
మనకు తెలియని పనిలో వేలుపెడితే రిజల్ట్స్ దారుణంగా ఉంటుంది. అనుభవం లేకుండా పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. నటులు నిర్మాతలుగా మారడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం.
Charmi
అసలు సినిమా నిర్మాణమే జూదం లాంటిది. రామానాయుడు లాంటి లెజెండరీ నిర్మాతలను చూసి తాము కూడా గొప్ప గొప్ప సినిమాలు తెరకెక్కించాలని పరిశ్రమకు వచ్చి, చేతులు కాల్చుకొని సర్వం కోల్పోయిన ఔత్సాహికులు వందల్లో ఉంటారు. పది సినిమాల్లో వచ్చింది, ఒక్క సినిమాతో పోవచ్చు. అంత రిస్క్ తో కూడుకుంది సినిమా నిర్మాణం.
కొమ్ములు తిరిగిన వాళ్లనే మోసం చేసే మాయగాళ్లు పరిశ్రమలో ఎందరో ఉంటారు. ఇక హీరోయిన్స్ నిర్మాతలుగా మారి దివాళా తీసినవారు లేకపోలేదు. అందుకు మహానటి సావిత్రి జీవితం గొప్ప ఉదాహరణ. నిర్మాణంపై ఏమాత్రం అనుభవం లేని సావిత్రి లక్షలు కోల్పోయారు. ఉన్నవన్నీ పోగొట్టుకొని పేదరికంలో మరణించారు. ఒకప్పుడు ఇండియాలోనే రిచ్ హీరోయిన్స్ లో ఒకరిగా ఆమె రికార్డులకు ఎక్కారు.
అలాగే సహజనటి జయసుధ సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. ఆమె బ్యానర్ లో ఆరు చిత్రాల వరకు తెరకెక్కాయి. 1999లో విడుదలైన హాండ్స్ అప్ ఆమె చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేసింది. హ్యాండ్స్ అప్ అట్టర్ ప్లాప్ కాగా ఒక్క రూపాయి వెనక్కి రాలేదు. ఈ మూవీలో నాగబాబు కీలక రోల్ చేయడం విశేషం.
ఖుషి, సింహాద్రి, ఒక్కడు వంటి ఇండస్ట్రీ హిట్స్ లో నటించిన భూమిక సంపాదించిన డబ్బులతో తకిట తకిట అనే చిత్రం చేశారు. 2010 లో విడుదలైన ఈ మూవీ ఆమె తలను శుభ్రంగా అంటింది. హీరోయిన్ గా కూడా ఫేడ్ అవుట్ అయిన దశలో తగిలిన ఆ దెబ్బకు ఆమెకు చుక్కలు కనిపించాయి. తకిట తకిట ప్లాప్ ఖాతాలో చేరింది.
ఇక లేటెస్ట్ ఎగ్జామ్ఫుల్ ఛార్మి. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న దశలోనే నిర్మాతగా మారింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తో చేతులు కలిపి పూరి కనెక్ట్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసింది. మొదటి చిత్రంగా ఆమె ప్రధాన పాత్రలో జ్యోతిలక్ష్మీ చేశారు. పూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అయితే లో బడ్జెట్ మూవీ కావడంతో పెద్దగా నష్టం జరగలేదు.
అనంతరం పూరి కనెక్ట్స్ బ్యానర్ లో వరుసగా రోగ్, పైసా వసూల్, మెహబూబ్ తెరకెక్కాయి. ఒక్క చిత్రం కూడా ఆడలేదు. చివరకు 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ అందుకున్నారు. ఆమె రూ. 22 కోట్ల వరకు లాభాలు తెచ్చాయి. పోగొట్టుకుంది తిరిగి రాబట్టారు. అయితే లైగర్ వాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ మూవీతో ఛార్మి మొత్తం పోగొట్టుకున్నారు.