MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: చిన్మయి కోసం ఆలోచిస్తావా.. రుక్మిణిని నిలదీసిన భాగ్యమ్మ!

Devatha: చిన్మయి కోసం ఆలోచిస్తావా.. రుక్మిణిని నిలదీసిన భాగ్యమ్మ!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

2 Min read
Author : Navya G
Published : Aug 05 2022, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... నాయన గురించి నాకు నువ్వు ఏమీ చెప్పవు అని కోపంతో దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భాగ్యమా,రుక్మిణి తో ఆ మాధవ్ గాడు ఈ పసి మనసుని అంత పాడు చేశాడు అని అంటుంది. నేను దేవికి ,వాళ్ళ నాన్న రాక్షసుడు కాదు, దేవుడు లాంటోడు అని ఎలా చెప్పాలి? అని అనుకుంటుంది. తర్వాత సీన్లో ఆదిత్య ఫైల్స్ చూస్తూ ఉంటాడు. సత్య అక్కడికి వచ్చింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఆఫీస్ కి వెళ్లి ఆఫీస్ పని చేయమన్నాను కానీ ఇంట్లో కూడా ఆఫీస్ పని చేయమని అనలేదు. ఆఫీసులో ఆఫీస్ గురించి ఆలోచిస్తూ,బయట, బయట వాళ్ల గురించి ఆలోచిస్తూ ,ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తావు?, నవ్వుతూ, ఆఫీస్ కి వెళ్లి వస్తున్నాను అని మా అందరితో చెప్పి ఎన్ని రోజులైందో గుర్తు తెచ్చుకో ఆదిత్య, ఎంతో ఆశతో అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వెళ్దాము అంటే వద్దు అన్నావు.
 

37

వారం తర్వాత వెళ్దాము అన్నావు, ఇప్పటికి వచ్చి ఏమీ ఏర్పాటులు చేయలేదు. వద్దు అంటే ఇంక ఇక్కడితో వదిలేద్దాం. అని చెప్పి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సత్య. తర్వాత ఆదిత్య, కరాటే క్లాస్ లో ఉన్న దేవి దగ్గరికి వచ్చి ఏం చేస్తుందని చూశాడు. దేవి తన ఫోటోకి మీసం వేసుకుంటూ ఉంటుంది  ఎందుకు ఇలా చేస్తున్నావు? అని ఆదిత్యా అడగగా, నిన్న రాత్రి మా అమ్మని ,మా నాయన ఎలా ఉంటాడు అంటే నాలాగే ఉంటాడు అన్నది.
 

47

అందుకే నా ఫోటోకి మీసం వేశాను. ఈ ఫోటోని తీసుకువెళ్లి మీరు మా నాయనని వెతకండి.దొరికితే నేను మా నాయనకు బుద్ధి చెప్పాలి అని దేవి ఆదిత్యతో అనగా ఆదిత్య ఎంతో బాధపడతాడు. దాని తర్వాత సీన్లో రుక్మిణి లేటుగా లెగుస్తుంది. జ్వరం వచ్చినట్టుంది సమయం తెలియకుండా పడుకుండిపోయాను అనుకుంటుంది రుక్మిణి.అప్పుడే చిన్మయి అక్కడికి వచ్చి,రుక్మిణికి మందులు ఇచ్చి, టీ ఇస్తుంది.
 

57

అమ్మ, నీకు ఒంట్లో బాలేదు, అందుకే లేపలేదు అని చెప్తుంది. అప్పుడు రుక్మిణి ఇది నువ్వు పని చేయాల్సిన వయసు కాదు,చదువుకోవాల్సిన వయసు.వెళ్లి స్కూల్ కి రెడీ అవ్వు అని చిన్మయిని అక్కడ నుంచి పంపించేస్తుంది రుక్మిణి. ఇది నా మీద చాలా ఆశలు పెట్టుకుంది. దీన్ని వదిలి వెళ్ళడం ఎలాగని రుక్మిణి మనసులో బాధపడుతూ ఉంటుంది. తర్వాత సీన్లో దేవుడమ్మ వాళ్ళ భర్త తల కి రంగు వేస్తూ ఉంటుంది.సరదాగా మాట్లాడుకుంటారు ఇద్దరు.
 

67

సత్య అప్పుడే కాఫీ తెస్తుంది.సత్య ముసలి అయ్యాక ఆదిత్య కి రంగు వేసుకుంటున్నట్టు ఊహించుకుని మురిసిపోతుంది. వీలు ఉన్నంత ఆనందంగా పెద్ద అయ్యాక నేను, ఆదిత్య ఉండే అదృష్టం నాకు ఉందో లేదో? అని అనుకుంటుంది సత్య. తర్వాత సీన్లో రుక్మిణి భాగ్యమ్మతో వంట చేస్తూ చిన్మయి గురించి చెప్తూ ఉంటాది. అప్పుడు భాగ్యమ్మ చిన్మయి గురించి ఆలోచించొద్దు. నీ గురించి, దేవమ్మ గురించే నువ్వు ఆలోచించు అంటుంది.
 

77

అప్పుడు రుక్మిణి భాగ్యమ్మని తిడుతూ నాకు ఇద్దరు పిల్లలు ఒక్కటే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కొన్ని మంది వ్యక్తులు పార్క్ లోని మాధవ్ గురించి వెతుకుతూ ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఈలోగా మాధవ్ అక్కడికి వస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved