MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rajinikanth Controversy: నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్‌పై రజినీకాంత్ ఫైర్

Rajinikanth Controversy: నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్‌పై రజినీకాంత్ ఫైర్

ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయనపై రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ట్రోల్స్‌పై సూపర్ స్టార్ స్పందించారు. ఈ పుకార్లకు చెక్ పెడుతూ, అసలు విషయం ఏంటో స్పష్టం చేశారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 25 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధర్మన్ టైటిల్‌ ఈవెంట్ లో రజినీ కామెంట్స్..
Image Credit : Instagram, X

ధర్మన్ టైటిల్‌ ఈవెంట్ లో రజినీ కామెంట్స్..

రజినీకాంత్ తన కొత్త సినిమా 'ధర్మన్' టైటిల్‌ను బుధవారం ప్రకటించారు. కమల్ హాసన్, అశ్వత్ మరిముత్తు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజినీ మాట్లాడుతూ.. తాను ఏం మాట్లాడినా, మౌనంగా ఉన్నా విమర్శలు వస్తున్నాయని, అందుకే పబ్లిక్‌గా మాట్లాడాలంటే కాస్త సంకోచిస్తున్నానని అన్నారు. మే నెలలో విజయ్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మాట్లాడాలంటే భయమేస్తుంది..
Image Credit : X

మాట్లాడాలంటే భయమేస్తుంది..

"నన్ను మాట్లాడమని ఎవరైనా పిలిస్తేనే కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడితే అది మీకో, నాకో సమస్య అవుతుంది. ఒకవేళ మౌనంగా ఉంటే.. నోట్లో స్వీట్ పెట్టుకున్నావా? ఎందుకు మాట్లాడట్లేదు? అని ఎగతాళి చేస్తారు" అని రజినీకాంత్ తమిళంలో అన్నారు.

Related Articles

Related image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Related image2
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
35
విసిగిపోయిన సూపర్ స్టార్..
Image Credit : X

విసిగిపోయిన సూపర్ స్టార్..

"నేను మాట్లాడితే, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు అంటారు. కొందరేమో అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అంటారు. ఇన్నేళ్ల తర్వాత నాకో విషయం అర్థమైంది. మనల్ని ఇష్టపడని వాళ్లు మనం ఏం చేసినా ఇష్టపడరు. అలాగే మనల్ని ఇష్టపడేవాళ్లు మనం చేసే ప్రతీదాన్ని ఇష్టపడతారనుకోవడం మూర్ఖత్వం. అందుకే జాగ్రత్తగా ఉండాలి" అని రజినీకాంత్ అన్నారు.
45
రజినీకాంత్ సంతోషంగా లేరని పుకార్లు..
Image Credit : instagram

రజినీకాంత్ సంతోషంగా లేరని పుకార్లు..

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచినప్పటి నుంచి, ఆ ఫలితాలతో రజినీకాంత్ సంతోషంగా లేరని పుకార్లు వచ్చాయి. ఈ వదంతులకు చెక్ పెట్టేందుకు, రజినీకాంత్ చెన్నైలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఎన్నికల తర్వాత మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిశానని, తామిద్దరం స్నేహితులమని స్పష్టం చేశారు.

55
మేం మాట్లాడుకున్నాం.. మీకేంటి సమస్య
Image Credit : Trish/ Instagram

మేం మాట్లాడుకున్నాం.. మీకేంటి సమస్య

"అనవసరంగా మాట్లాడటానికి రజినీ అంత చీప్ వ్యక్తి కాదు. విజయ్ సీఎం అయ్యాడని విని షాక్ అయ్యాను. గెలవగానే ఆయన్ని అభినందించాను. నేను రాజకీయాల్లోనే లేను, విజయ్‌పై నాకెందుకు అసూయ? బహుశా కమల్ సీఎం అయితే నాకు అసూయ కలగొచ్చు. నాకూ, విజయ్‌కీ 25 ఏళ్ల జనరేషన్ గ్యాప్ ఉంది. మేం పోటీ పడితే బాగోదు" అని రజినీ అన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షల గురించి అడగ్గా, తాము మాట్లాడుకున్నామని,  కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదని చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
త్రిష
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image2
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved