Devatha: సూపర్ ట్విస్ట్.. దేవుడమ్మ ముందు రుక్మిణి గుట్టు బయట పెట్టిన సూరి!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నువ్వు కారు ఎక్కక పోవడం వల్ల దేవి (Devi) కి లేనిపోని అనుమానాలు వస్తాయి అని మాధవ (Madhava) చెప్పి రాధను కారు ఎక్కించుకుంటాడు. మరోవైపు డాక్టర్ సత్యకు పిల్లలు పుట్టే యోగం లేదు ఆమెకు గర్భసంచిలో లోపం ఉందని చెబుతుంది. ఆ మాటతో దేవుడమ్మ సత్య లు కుమిలిపోతారు.
ఆ తర్వాత దేవుడమ్మ (Devudamma) వెంటనే నువ్వు ఇంటికి రా అని ఆదిత్య (Adithya) కు కాల్ చేస్తుంది. ఇక మాధవ మన కుటుంబం అని రాధ దగ్గర మెన్షన్ చేస్తాడు. దాంతో రాధ తప్పు సారు.. మేము మీరిచ్చిన నీడలో ఉంటున్నాం కానీ మీరు మేము ఒకటి కాదు అని అంటుంది. ఇక మీ పరువు పోతుందని మంది ఏమనుకున్నా నేను మాట్లాడలేదు అని అంటుంది.
ఇక నీ బిడ్డకు పాలిచ్చి నా బిడ్డ గా చూసుకున్న.. కానీ నువ్వు నా బిడ్డకు ఏమని నూరి పోస్తున్నావ్ అని కడిగిపారేస్తుంది. ఇక సత్య (Satya) దేవుడమ్మ (Devudamma) లు దీనంగా ఇంటికి వస్తారు. ఇంట్లో వాళ్ళు ఏమైంది అని అడగగా.. ఏం కాలేదు ముందు తనకి పళ్లరసం ఇవ్వండి అని దేవుడమ్మ అంటుంది.
ఇక సత్య (Satya) ఎందుకు నాకు ఈ జ్యూస్ లు టానిక్ లు అంటుంది. అంతే కాకుండా పిల్లలు పుట్టలేదు అన్న విషయం లో తన భర్త తన కోసం తపన పడ్డాడో తెలుపుతుంది. ఇక నా భర్తలో లోపం ఉందని మీరు అందరూ అనుకుంటున్నారు.. లోపం ఆదిత్య (Adithya) ది కాదు నాది అంటూ ఏడుస్తుంది.
నాకు పిల్లలు పుట్టే యోగం లేదు.. నాకా రాత లేదు అని డాక్టర్ గారు చెప్పే సార్ అంటూ సత్య (Satya) కుమిలి పోతూ కింద పడి ఏడుస్తోంది. ఇక సత్య ఒంటరిగా గదిలో కూర్చుని అదేపనిగా బాధపడుతుంది. ఈ క్రమంలో ఆదిత్య (Adithya) గదిలోకి రాగా ఏడ్చుకుంటూ తనకి దండం పెట్టేస్తుంది.
ఇక తరువాయి భాగంలో సూరి (Soori) ఈరోజు మీ ఎవ్వరికి తెలియని నిజం ఒకటి చెప్పాలి అని అంటాడు. రుక్మిణి (Rukmini) ఇంటి నుంచి బయటకు వెళ్లే అప్పటికి తను గర్భవతి అని అంటాడు. ఆ మాటతో దేవుడమ్మ ఏంటి సూరి నువ్వు చెప్పేది అని అడుగుతుంది. నిజం అని సూరి అంటాడు.