- Home
- Entertainment
- Devatha: ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్న రుక్మిణి.. షాక్ లో జానకమ్మ, మాధవ్!
Devatha: ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్న రుక్మిణి.. షాక్ లో జానకమ్మ, మాధవ్!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభం లోనే...జానకమ్మ,రాధ ఇంట్లో లేదని ఇల్లంతా వెతుకుతూ తన గదిలోకి వెళ్తుంది. అప్పటికే తన గదిలో తన వస్తువులన్నీ సర్దుకొని ఉంటాయి. అదేంటి ఇంట్లో లేదు వస్తువులన్నీ సర్దుకొనుంది. ఇల్లు కూడా కదలని రాదా ఈరోజు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటుంది. ఇంతలో రాధా భాగ్యమ్మ అక్కడికి వస్తారు. ఎక్కడికెళ్లారు అని జానకమ్మ అడగగా రాధ మౌనంగా ఉంటుంది. అప్పుడు భాగ్యమ్మ,రాధమ్మ దేవితో వేరే ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది, దానికోసం ఇల్లు వెతకడానికి వెళ్ళాము అని అంటాది.
దానికి జానకమ్మ ఆశ్చర్యపోయి నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోవడం ఏంటమ్మా?అసలు ఏం జరిగింది నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మాతో అన్నావు, నాకు ఏ రోజు నచ్చకపోయినా వెళ్ళిపోతాను అని. నేను ఆ మాటకి ఎప్పుడు అడ్డు చెప్పలేదు కానీ పదేళ్ల తర్వాత వెళ్ళిపోవాల్సిన అవసరం నీకు ఏం వచ్చిందమ్మా? ఇంట్లో ఎవరైనా లోటు చేస్తున్నారా? మేము ఎప్పుడు నుంచి అడుగుతూనే ఉన్నాను ఎవరైనా నిన్ను ఏమైనా అంటే మాకు చెప్పమని కానీ నువ్వు ఏనాడు నోరు తెరిచి నీ మనసులో బాధ మాకు చెప్పలేదు.
ఇప్పుడు కూడా చెప్పడం లేదు అని అనగా రాద, నాకు మనసులో బాధ ఏమీ లేదు నేను బానే ఉన్నాను నాకు వెళ్లిపోవాలని ఉంది అని చెప్పి అక్కడినుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య, దేవి చిన్మయి ని కారులో ఇంటికి దింపుతాడు.చిన్మయి మాత్రం ఆ ఫోటో గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. అంతలో మాధవ్ అక్కడికి వస్తాడు. దేవి,చిన్మయి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మాధవ్ ఎవరిని అడిగి నువ్వు నా పిల్లలు ఇద్దరిని తీసుకువెళ్లావు? అసలు నీకు ఏ హక్కు ఉన్నదని అంటాడు.
అప్పుడు, రుక్మిణి అక్కడికి వచ్చి నీకే హక్కు ఉన్నదని నువ్వు చెప్తున్నావు? ఆయన నా పెనిమిటి ఆయన పిల్లల్ని తీసుకెళ్లే హక్కు ఆయన కాకుంటే ఇంతవరకు ఉంటది. మీరైనా ఈయనకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు పెనిమిటి రేపటి నుంచి దేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంటికి వస్తుంది, మీకు తీసుకెళ్లడానికి వీలు అవ్వకపోతే నేను దింపుతాను అని చెప్పి అదిత్య ను పంపించేస్తుంది. అప్పుడు మాధవ్ రాధ వైపు కోపంగా చూస్తాడు రాధ కూడా కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ, దేవి తన కోసం గీసిన బొమ్మను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఎంత బాగా గీసింది అని వాళ్ళ భర్తతో చెప్తుంది. దేవికి ఇన్ని మంచి అలవాట్లు ఎలా వచ్చాయో? వాళ్ల తల్లిదండ్రులు దేవిని చాలా బాగా పెంచారు. నా మనవరాలు కూడా ఇంతే వయసు ఉంటుంది కదా రుక్మిణి తను వారసుడుతో ఎక్కడుంటుందో బహుశా ఆలోటు వల్లేనేమో దేవి అంటే నాకు ఇంత ఇష్టం అని అనుకుంటుంది దేవుడమ్మ. ఆ తర్వాత సీన్లో సత్య ఆలోచిస్తూ, అసలు అక్క ఎందుకు దేవిని ఇంటికి పంపుతుంది.
నా కోసమే కదా అక్క చనిపోయినట్టు ఇంట్లో నటించింది. అయినా అక్కకి మంచి భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సమాజంలో గౌరవం ఉన్నది కదా అయినా సరే మళ్లీ ఇటువైపు ఎందుకు వస్తుంది. ఆదిత్య కూడా ఎందుకు పదేపదే దేవి మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఆదిత్య ఇప్పుడు కొచ్చి అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేయలేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచించుకుంటూ ఉంటుంది.ఆ తర్వాత సీన్లో రుక్మిణి, మాధవ్ తన కాలు గురించి చెప్పిన విషయం గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.అంతలో చిన్మయి దేవి లు అక్కడికి వస్తారు.
దేవి అక్కడికి వచ్చి అమ్మ చూడు అవ్వ నా కోసం బట్టలు కుట్టింది నేను వెళ్లి నానమ్మ వాళ్లకి చూపిస్తాను అని వెళుతుంది. అప్పుడు చిన్మయి బాధగా ఉంటుంది. రాద, చిన్న దగ్గరికి వెళ్లి చిన్న ఎందుకు అలా ఉన్నావు అమ్మ? నేను నీకు ఒక విషయం చెప్తాను విను, రేపటి నుంచి నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. ఇంట్లో నువ్వు నీ బాధ్యతని నిర్వర్తించాలి అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!