'బ్రో' లో ఆ ఏపీ మంత్రి పై పవన్ ఘాటు సెటైర్? పొలిటికల్ డైలాగు?
మై డియర్ మార్కండేయ...' పాటలో శ్యాంబాబుగా పృథ్వీరాజ్ గెటప్ చూస్తే... ఓ ఏపీ మంత్రి గతంలో చేసిన డ్యాన్స్ ఎవరికైనా గుర్తుకు వస్తుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా బ్రో మూవీ కబుర్లే. ఈ సినిమా చూసిన అభిమానులు వింటేజ్ పవన్ కల్యాణ్ ని చూసామని మురిసిపోతున్నారు. పవన్ యాక్టింగ్ అద్భుతం అంటున్నారు. బ్రో.. బ్రో అంటూ స్లోగన్స్ తో ధియేటర్లలో హంగామా చేస్తున్నారు. అయితే బ్రో మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఇది పక్కా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మూవీ అని కొందరు అంటుంటే.. ఫీల్ గుడ్ మూవీ అని.. సెంటిమెంట్ తో కన్నీళ్లు తెప్పించారని మరికొందరు చెప్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఇలాంటి క్యారెక్టర్లలో చూడలేదని.. అంటున్నారు. అయితే ఇదే సమయంలో సినిమాలో పొలిటికల్ అంశాలు, సెటైర్స్ ఏమన్నా ఉన్నాయా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో నడుస్తోంది.
ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఒక సీన్ లో అయితే ఏపీ మంత్రి ఒకరు చేసిన నృత్యంపై పరోక్షంగా ఘాటైన సెటైర్లు వేయటం మాత్రం వైరల్ అవుతోంది. 'బ్రో' సినిమాలో స్పెషల్ సాంగ్ గా 'మై డియర్ మార్కండేయ' పాటలో ఊర్వశి రౌతేలా హాట్ హాట్ స్టెప్పులు వేశారు. ఆ పాటలో శ్యాంబాబు అంటూ ఆ మంత్రి మీద సెటైర్లు పడ్డాయి. ఈ శ్యాంబాబు క్యారెక్టర్ చేసింది '30' ఇయర్స్ పృథ్వీ.
'మై డియర్ మార్కండేయ...' పాటలో శ్యాంబాబుగా పృథ్వీరాజ్ గెటప్ చూస్తే... ఓ ఏపీ మంత్రి గతంలో చేసిన డ్యాన్స్ ఎవరికైనా గుర్తుకు వస్తుంది. ట్రాక్ ప్యాంటు & టీ షర్టులో మాత్రమే ఉంటూ రెండు చేతులు ముందుకు పెట్టి ఓ స్టెప్ వేస్తారు. అప్పుడు పాటను ఆపి ''శ్యాంబాబు వస్తున్న టెంపో ఏంటి? నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి?'' అని పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకుంటారు. సంక్రాంతి సంబరాల్లో అంబటి ఎలాగైతే డాన్స్ చేశారో, ఎలాంటి దుస్తులు ధరించారో అదే మేకోవర్‌తో పృథ్వీ ఈ చిత్రంలో కనిపించారు.
పబ్‌లో ఓ హుషారైన పాటకు డాన్స్ చేస్తున్న పృథ్వీని పవన్‌కల్యాణ్ ఆపి ‘శ్యాంబాబు ఆ డాన్స్ ఏంటి? వస్తున్న టెంపో ఏంటి? నువ్వు చేస్తున్న స్టెప్ ఏంటి? తకిటతకిటత 68, తకదిమితకదిమిత 24 అంటూ చేసిన సన్నివేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావాలనే సినిమాలో పృథ్వీ పేరు శ్యాంబాబు పెట్టారని... ఏపీలో మంత్రిని ఉద్దేశించి ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశారనేది సోషల్ మీడియా జనం అంటున్నారు. మ్యూజిక్ గురించి శ్యాంబాబుకు చెప్పే సీన్ ఒకటి ఉంటుంది. అప్పుడు 'నెక్స్ట్ ఏంటి?' అని పవన్ అడిగితే... 'సె...' అని శ్యాంబాబు చెబుతాడు.
మీ టైపులో అందరూ ఎప్పుడూ దాని గురించి మాత్రమే ఆలోచించరని పవన్ చెబుతారు. అంతే కాదు... లలితకళల్ని వదిలేయమని ఘాటుగా చెప్పడం గమనార్హం. శ్యాంబాబు అంటే అంబటి రాంబాబు ? అని డౌటానుమానం జనం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా ట్విట్టర్ లో అంబరి రాంబాబు డాన్స్ కు సంభందించిన వీడియో వైరల్ చేస్తున్నారు.
Bro Movie Review
అదే విధంగా మరో చోట ఓ పొలిటికల్ డైలాగు పడింది. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వస్తువులు ఉపయోగించినప్పటికీ, మళ్ళీ మన ఇంటికి వచ్చేటప్పుడు వాటిని అక్కడే వదిలేసి వస్తామని... బంధువుల ఇంట్లో మనం అతిథి అవుతామని, ఆ విధంగా భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ గెస్ట్ అని మార్కండేయులు పాత్రతో పవన్ కళ్యాణ్ చెబుతారు. దానికి లింక్ ఎక్కడ పెట్టారంటే..
Bro Movie Review
అతిథిగా ఉండాలి తప్ప మా సొంతం, దోపీడీలు, దౌర్జన్యాలు చేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన బలంగా చెబుతారు. ఆ సంభాషణలు రాజకీయ ప్రయాణానికి, ఓ తెలుగు రాష్ట్రంలో అధికార ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి అని సోషల్ మీడియా జనం అంటున్నారు. ఈ శ్యాంబాబు క్యారెక్టర్, ఆ సీన్ మీద ఏపీ మంత్రి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో అంటోంది ఓ వర్గం మీడియా.
Bro Movie Review
ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ -నటన కూడా చాలా బాగుందనే టాక్ నడుస్తుంది. ఎక్కువ అంచనాలతో సినిమాకు వెళ్లొద్దని.. బ్రో మంచి సినిమా అంటోంది చిత్ర యూనిట్. వర్షాలు తగ్గిన తర్వాత.. అన్ని ధియేటర్లలో కలెక్షన్స్ పెరుగుతాయనే అంచనాలో ఉన్నారు నిర్మాతలు.