- Home
- Entertainment
- SVP Review: 'సర్కారు వారి పాట' ప్రీమియర్ షో టాక్.. పక్కా మాస్, మహేష్ ఆట పాట అదిరింది, కానీ
SVP Review: 'సర్కారు వారి పాట' ప్రీమియర్ షో టాక్.. పక్కా మాస్, మహేష్ ఆట పాట అదిరింది, కానీ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు మాస్ లుక్ లో.. కామెడీ టైమింగ్ అదరగొడుతూ కనిపిస్తున్న చిత్రం ఇదే.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు మాస్ లుక్ లో.. కామెడీ టైమింగ్ అదరగొడుతూ కనిపిస్తున్న చిత్రం ఇదే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోల హంగామా మొదలైపోయింది.
ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోందో తెలుసుకుందాం. కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. సముద్ర ఖని విలన్ గా నటిస్తున్నారు. మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో అదరగొడుతూ ఓ ఫైట్ సీన్ తో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత బాగా పాపులర్ అయిన పెన్నీ సాంగ్ వస్తుంది. లిరికల్ వీడియోలో చూపినట్లుగానే మహేష్ బాబు స్టైలిష్ గా కనిపిస్తూ కూల్ స్టెప్పులతో ఆకట్టుకుంటాడు.
ట్రైలర్ లో చూపినట్లుగానే కీర్తి సురేష్ అందంగా కనిపిస్తూ.. ఫన్నీ డైలాగులతో మెప్పిస్తుంది. మహేష్, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా.. హాస్యాన్ని పండిస్తున్నాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నారు. సినిమా ప్రారంభంలో చూపిన మహేష్ తండ్రి సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచే విధంగా ఉంటాయి.
ప్రీ ఇంటర్వెల్ నుంచి కథలో మలుపులు కనిపిస్తాయి. కొత్త క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. మహేష్ బాబు, సముద్రఖని మధ్య వచ్చే పోటాపోటీ సీన్స్ కథలో హీట్ పెంచుతాయి. ఇక బీచ్ ఫైట్ ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగుతుంది. మహేష్ ఇంట్రడక్షన్, కీర్తి సురేష్ తో వచ్చే సీన్స్, ప్రారంభంలోనే కథపై ఆసక్తిని పెంచడం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్త్ హాఫ్ లో హైలైట్స్.
ఇక సెకండ్ హాఫ్ లో బ్యాంక్ లు, రుణాలు, ఈఎంఐ లకు సంబందించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే 'మహేషా'సాంగ్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేసారు అనే చెప్పాలి. సాంగ్ ని అద్భుతంగా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్ లో దర్శకుడు పూర్తి కథని రివీల్ చేసే ప్రయత్నం చేశారు.
ఈక్రమంలో కొన్ని సీన్స్ సాగదీసినట్లుగా అనిపిస్తాయి. బ్యాంకు రుణాల విషయంలో మహేష్ బాబు ఇచ్చే స్పీచ్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో ఎలాంటి కంప్లైంట్ లేనప్పటికీ సెకండ్ హాఫ్ లో సన్నివేశాలపై దర్శకుడు ఇంకాస్త ద్రుష్టి పెట్టి ఉండాల్సింది.
ఓవరాల్ గా మహేష్ బాబు కామెడీ టైమింగ్, ఫైట్స్, మూడు సాంగ్స్ ఈ చిత్రంలో అభిమానులని ఆకట్టుకునే అంశాలు. ఫస్ట్ హాఫ్ సెట్ చేసిన ఫ్లాట్ ఫామ్ కి తగ్గట్లుగా సెకండ్ హాఫ్ లో బలమైన సీన్స్ పడలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే..మహేష్ కామెడీ టైమింగ్.. పాత్ర అభిమానులని బాగా ఆకట్టుకుంటాయి.