MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sardar 2 OTT: థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్, ఓటీటీలో మాత్రం ర్యాంపేజ్.. నెంబర్ 1 ప్లేస్ లో కార్తీ సినిమా

Sardar 2 OTT: థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్, ఓటీటీలో మాత్రం ర్యాంపేజ్.. నెంబర్ 1 ప్లేస్ లో కార్తీ సినిమా

Sardar 2 OTT: కార్తీ నటించిన సర్దార్ 2 థియేటర్లలో ఆశించిన స్పందన పొందకపోయినా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచి మరోసారి వార్తల్లోకి వచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 04 2026, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
థియేటర్లలో నిరాశపరిచిన సర్దార్ 2
Image Credit : Asianet News

థియేటర్లలో నిరాశపరిచిన సర్దార్ 2

కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ 2 తాజాగా ఓటీటీలో కొత్తగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. నెగెటివ్ రెస్పాన్స్ కారణంగా థియేట్రికల్ రన్‌లో నిరాశ ఎదురైనప్పటికీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ వన్
Image Credit : Asianet News

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ వన్

సర్దార్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఓటీటీలో ఈ స్థాయిలో స్పందన రావడంతో సినిమా మరోసారి చర్చలోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రానికి డిజిటల్ విడుదల తర్వాత కొత్త ప్రేక్షకులు దొరుకుతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ద్వారా మరింత విస్తృతమైన ప్రేక్షకులకు సినిమా చేరుకునే అవకాశం లభించింది.

35
సినిమాకు రెండో అవకాశం
Image Credit : X/@Prince_Pictures

సినిమాకు రెండో అవకాశం

థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో వస్తున్న స్పందన సర్దార్ 2 చిత్ర బృందానికి ఊరట కలిగించే పరిణామంగా మారింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం వల్ల సినిమాకు మరోసారి ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశం లభించింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా వ్యూయర్‌షిప్ సంఖ్యలు ఎలా కొనసాగుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓటీటీలో వచ్చిన ఈ ఆదరణ సినిమా మొత్తం స్థాయిలో ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

45
భారీ తారాగణంతో సర్దార్ 2
Image Credit : X/@Prince_Pictures

భారీ తారాగణంతో సర్దార్ 2

సర్దార్ 2లో మాళవిక మోహనన్, ఎస్ జే సూర్యతో పాటు ఆశికా రంగనాథ్, రాశీ ఖన్నా, యోగిబాబు, నాజర్, ఆశిష్ విద్యార్థి, అచ్యుత్ కుమార్, బాబు ఆంటోనీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. కార్తీ, పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌కు థియేటర్లలో వచ్చిన స్పందనకు భిన్నంగా ఓటీటీలో ప్రస్తుతం మంచి ట్రెండింగ్ లభిస్తోంది.

55
కార్తీ చేతిలో మరిన్ని సినిమాలు
Image Credit : Sony Music South

కార్తీ చేతిలో మరిన్ని సినిమాలు

ప్రస్తుతం కార్తీ పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఖైదీ 2 సినిమాపై అధికారికంగా స్పందించి, ఆ చిత్రం వస్తుందని తెలిపారు. అలాగే మార్షల్, కార్తీ 30 వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తెలుగులో హిట్ 4 సినిమాతోనూ కార్తీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Bollywood Actresses: రూ.8 వేల కోట్ల ఆస్తితో టాప్‌లో జూహీ చావ్లా.. అత్యంత ధనిక హీరోయిన్లు వీళ్లే!
Recommended image2
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Recommended image3
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Related Stories
Recommended image1
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image2
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved