MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది

Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది

కమెడియన్ బ్రహ్మానందం తాను త్రిమూర్తులుగా భావించే ముగ్గురు లెజెండ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 04 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

కామెడియన్ బ్రహ్మానందం టాలీవుడ్ లో దశాబ్దాలుగా తన హాస్యంతో ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు. తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న బ్రహ్మానందం నెంబర్ 1 స్థానానికి ఎదిగారు. ఇటీవల కాలంలో కొత్త కమెడియన్ల రాక, వయసు ప్రభావం వల్ల బ్రహ్మికి ఆఫర్స్ తగ్గాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమాతో బ్రహ్మి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మానందం మొదట వెండితెరపై కనిపించిన సినిమా చంటబ్బాయి. కానీ మొదట నటించిన సినిమా మాత్రం సత్యాగ్రహం. జంధ్యాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది . ఈ మూవీ రిలీజ్ కి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీనితో ఆ మూవీ కంటే ముందుగానే చంటబ్బాయి రిలీజ్ అయింది. కానీ బ్రహ్మానందం ని ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది మాత్రం అహనా పెళ్ళంట మూవీనే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుత్తివేలు నటించాల్సిన సినిమా
Image Credit : youtube/@youwemedia

సుత్తివేలు నటించాల్సిన సినిమా

ట్విస్ట్ ఏంటంటే ఇది కూడా సత్యాగ్రహం తర్వాత చిత్రమే. దీనికి కూడా జంధ్యాలనే దర్శకుడు. అప్పటికి సత్యాగ్రహం సినిమా పూర్తయిపోయినప్పటికీ కొన్ని సమస్యల వల్ల రిలీజ్ కాలేదు. దీనితో లెజెండ్రీ నిర్మాత రామానాయుడు.. జంధ్యాలతోనే అహనా పెళ్ళంట సినిమాని ప్రారంభించారు. ఆ మూవీలో కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. వాస్తవానికి కోట అసిస్టెంట్ పాత్రలో సుత్తివేలు నటించాలి. ఆ రోజుల్లో ఆయన బిజీ కమెడియన్.

35
రామానాయుడి గారి నిర్మాణంతో జాతకం మారింది
Image Credit : Asianet News

రామానాయుడి గారి నిర్మాణంతో జాతకం మారింది

ఎలాగైనా సుత్తివేలుని ఈ సినిమాలో నటింపజేయాలి అని ప్రయత్నించారు. అన్ని సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకుని ఈ మూవీ షూటింగ్ కి తొలి రోజు హాజరు కావడం సుత్తివేలుకి కుదర్లేదు. అప్పటికే సత్యాగ్రహం షూటింగ్ లో రామానాయుడుగారు నన్ను చూశారు. సుత్తివేలు రాకపోవడంతో.. ఏవయ్యా సత్యాగ్రహంలో వాడెవడో గుండోడు బాగా చేశాడు కదా.. వాడిని పెట్టేయొచ్చు కదా అని అన్నారు. ఆయన అన్న ఆ మాటతో తన జీవితం మారిపోయింది అని బ్రహ్మి తెలిపారు. ఆ విధంగా అహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మికి అవకాశం రావడం.. ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం జరిగింది.

45
అహనా పెళ్ళంట షూటింగ్
Image Credit : instagram

అహనా పెళ్ళంట షూటింగ్

అహనా పెళ్ళంట షూటింగ్ జరుగుతున్నప్పుడే చిరంజీవి చంటబ్బాయి మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. అక్కడికి జంధ్యాల గారు నన్ను తీసుకుని వెళ్లి చిరంజీవి గారికి పరిచయం చేశారు. ఇతను బ్రహ్మానందం కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. సినిమాల్లో నటించడానికి వచ్చారు అని చెప్పి పరిచయం చేశారు. ఆ విధంగా చిరంజీవి గారితో పరిచయం జరిగింది. చంటబ్బాయి మూవీలో కూడా నటించాను.

55
చిరంజీవి గారితో పరిచయం
Image Credit : our own

చిరంజీవి గారితో పరిచయం

కొన్ని రోజులు చిరంజీవి గారితో సరదాగా మాట్లాడిన తర్వాత నా గురించి ఆయనకు బాగా అర్థం అయింది. విషయం ఉన్న నటుడు అని గ్రహించారు. ఒక రోజు నన్ను పిలిచి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వచ్చేయాలి. నాతో పాటు మద్రాసు వచ్చేయండి అని చిరంజీవి గారు నన్ను స్వయంగా ఫ్లైట్ లో తీసుకుని వెళ్లారు. నేను ఫ్లైట్ ఎక్కడ అదే తొలిసారి. ఆ విధంగా నా జర్నీ మొదలైంది. అందుకే చిరంజీవి, రామానాయుడు, జంధ్యాల గారిని నేను నా జీవితానికి త్రిమూర్తులుగా భావిస్తాను అని బ్రహ్మానందం అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image2
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Recommended image3
NTR మార్ఫింగ్ వీడియో వివాదం.. సెలబ్రిటీలదే తప్పు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image2
Hyper Aadi: హైపర్ ఆదికి ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన క్రేజీ హీరో, అసలు అతడు ఎవరో కూడా తెలియదన్న డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved