Intinti Gruhalakshmi: లక్కీని కొడుకుగా స్వీకరించని నందు.. తులసితో గొడవ పడిన లాస్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు మే 6 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దివ్య (Divya) అనసూయ (Anasuya) దంపతులకు దగ్గరికి వచ్చి మీ కోడలు సంగతేంటి? ఈమధ్య చెప్పాపెట్టకుండా షికార్లు చేస్తుంది. నువ్వు అడగవా? అని అంటుంది. అంతేకాకుండా ఈ రోజు మదర్స్ డే అమ్మని విష్ చేద్దాం అంటే కనబడటం లేదు అని అంటుంది.
మరోవైపు తులసి (Tulasi) వాళ్ళ అమ్మ ను కలిసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతుంది. ఆ క్రమంలో తల్లి కూతుర్లు ఒకరిమీద ఒకరు ఎంతో ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. ఇక సరస్వతి (Saraswathi) ఇలాంటి సంతోషం నాకు మళ్లీ దొరుకుతుందో లేదో అని తన కూతురితో అంటుంది.
ఒకవైపు లాస్య (Lasya) కొడుకు నందును చూసి భయపడుతూ ఉంటాడు. ఇక అక్కడ కు లాస్య వచ్చి ఏంట్రా పరాయి వాడిలా చూస్తున్నావ్.. మీ డాడీ నే కదా అని అంటుంది. ఆ మాట ఆయనను చెప్పమను మమ్మీ అని తన కొడుకు అంటాడు. ఇక నందు (Nandu) నాకు కొంచెం టైం కావాలి అని అంటాడు.
ఇక మరోవైపు తులసి (Tulasi) ఇంటికి రాగానే దివ్య (Divya) హ్యాపీ మదర్స్ డే అమ్మ అని తన తల్లిని కౌగిలించుకొని మరి చెప్తుంది. ఆ తర్వాత గుడ్ న్యూస్ గా మదర్స్ డే సందర్భంగా మదర్ తెరిస్సా ఫౌండేషన్ వాళ్ళు బెస్ట్ మదర్ అవార్డ్ ఇస్తారు. దాంట్లో పాల్గొనమని తులసికి ఇన్విటేషన్ ఇస్తారు. దానికి దివ్య, ప్రవళికలు తులసి ను పాటిస్పేట్ చేయమని ప్రోత్సహిస్తారు.
ఆ తర్వాత తులసి (Tulasi) తన ఫ్యామిలీతో మదర్ తెరిసా ఫౌండేషన్ కు వెళుతుంది. అక్కడ వాళ్ళ కోసం ప్రవళిక వస్తుంది. ఇక అదే ఈవెంట్ కు లాస్య దంపతుల తో సహా తన కొడుకు కూడా వస్తాడు. ఇక తులసి ను చుసిన లక్కీ (Lucky) ఆంటీ అంటూ.. పరిగెత్తుకుంటూ వెళ్ళి హాగ్ చేసుకుంటాడు.
ఇక దివ్య (Divya) స్టేజి మీద తన అన్నదమ్ములతో అమ్మగా నువ్వు గెలిచావు పిల్లలుగా మేము ఓడిపోయాము.. మామ్ అని ఎమోషనల్ గా చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత తులసి (Tulasi) స్టేజ్ పైకి ఎక్కి తన పిల్లల గురించి ప్రౌడ్ గా చెప్పి వాళ్ళను కౌగిలించుకుంటుంది.