MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రికెటర్‌తో పెళ్లికి సిద్ధమే, కానీ.. శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌ వార్తలపై సారా అలీ ఖాన్‌ షాకింగ్‌ రియాక్షన్‌

క్రికెటర్‌తో పెళ్లికి సిద్ధమే, కానీ.. శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌ వార్తలపై సారా అలీ ఖాన్‌ షాకింగ్‌ రియాక్షన్‌

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ,  సైఫ్‌ అలీ ఖాన్‌ తనయ సారా అలీ ఖాన్‌.. కొంత కాలంగా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌ చేస్తున్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించి సారా.. ఆమె రియాక్షన్‌ ఆశ్చర్యపరిచేలా ఉండటం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 08 2023, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలీవుడ్‌లో హీరో,హీరోయిన్లు డేటింగ్‌ వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అక్కడ సినిమా వార్తలకంటే ఈ డేటింగ్‌ న్యూసే హాట్‌ కేక్‌. అయితే సెలబ్రిటీలు కూడా ఇలా డేటింగ్‌లతో బిజీగా గడుపుతుంటారు. అందులో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌ కూడా ఇలాంటి విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. ఆమె ప్రముఖ టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతన్నాయి. 
 

25

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె డేటింగ్‌ వార్తలపై స్పందించింది. తనకు క్రికెటర్‌ని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే తాను పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన లక్షణాలేంటో కూడా వెల్లడించింది. ఆ కండీషన్స్ అప్లై అయితేనే మ్యారేజ్‌కి రెడీ అని పేర్కొంది. 
 

35

సారా అలీ ఖాన్‌.. తాజాగా విక్కీ కౌశల్‌తో `జర హట్‌ కే జర బచ్‌ కే` చిత్రంలో నటించింది. ఇది గతశుక్రవారం విడుదలైంది. దీనికి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఈనేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌ వార్తలపై రియాక్ట్ అయ్యింది. తన జీవిత భాగస్వామిని తానింకా కలవలేదని పేర్కొంది. కలిశానని కూడా అనుకోవడం లేదని, ఇది పూర్తి భరోసాతో, నమ్మకంతో చెబుతున్నానని పేర్కొంది. 

45

సారా నానమ్మ షర్మిలా ఠాకూర్‌ క్రికెటర్‌ మన్సూర్‌ని పెళ్ళి చేసుకున్న నేపథ్యంలో కాబోయే భర్త ఎలా ఉండాలనే ప్రశ్నకి సారా అలీ ఖాన్‌ రియాక్ట్ అవుతూ, `నా మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు కచ్చితంగా అతడితో జీవితాన్ని ప్రారంభిస్తానని పేర్కొంది. అయితే అతను ఏ రంగానికి చెందిన వాడనేది పెద్దగా పట్టించుకోనని, క్రికెటర్‌ అయినా, నటుడైనా, వ్యాపారవేత్త అయినా ఏ రంగంలో ఉన్నా నాకు అభ్యంతరం లేదని, నా విలువలను గౌరవిస్తే చాలని పేర్కొందీ హాట్‌ బ్యూటీ. 
 

55

సోషల్‌ మీడియాలో అందాలతో ఆరబోతతో విరుచుపడే ఈ బ్యూటీ వెండితెరపై మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తుంది. పద్ధతైన పాత్రలే చేస్తుంది. `కేథార్నాథ్‌` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది సారా అలీ ఖాన్‌. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆ తర్వాత `సింబా`తో బంపర్‌ హిట్‌ని అందుకుంది. `లవ్‌ ఆజ్‌ కల్`, `కూలీ నెం.1`, `అట్రాంగి రే`, `గ్యాస్‌లైట్‌`, `జారా హట్కే జరా బచ్కే` చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయి.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు రామలింగయ్య వల్లే మెగాస్టార్ అయ్యారా ? చిరంజీవి సమాధానం.. సురేఖతో పెళ్లి, అస్సలు ఒప్పుకోనన్న నిర్మాత
Recommended image2
Nilakanta Movie Review: `నీలకంఠ` మూవీ రివ్యూ, రేటింగ్.. మాస్టర్ మహేంద్రన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
చెమటలు పట్టించే హారర్ థ్రిల్లర్, ఉత్కంఠ రేపే సస్పెన్స్, ఫస్ట్ లుక్ తోనే భయపెట్టిస్తున్న సినిమా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved