Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • సంక్రాంతి సూపర్ హిట్స్.. పదేళ్ల లిస్ట్ (2016- 2025), పొంగల్‌ విన్నర్స్ వీరే!

సంక్రాంతి సూపర్ హిట్స్.. పదేళ్ల లిస్ట్ (2016- 2025), పొంగల్‌ విన్నర్స్ వీరే!

గత పదేళ్లలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రాల గురించి ఈ కథనం వివరిస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా నుండి సంక్రాంతికి వస్తున్నాం వరకు విజయం సాధించిన సినిమాలను ఇందులో పొందుపరిచారు.

Surya Prakash | Published : Jan 16 2025, 07:16 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
Asianet Image

 సంక్రాంతి పండుగంటే రైతులదే కాదు,  సినిమా  అభిమానులదే అనేంతగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం  తెలుగు,తమిళ రాష్ట్రాల్లో కనపడుతూ వస్తోంది. ఈ సంక్రాంతి కూడా సినిమాలతో హంగామా గట్టిగా చేసింది. గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో థియేటర్స్ పండగ చేసుకున్నాయి.

కలెక్షన్స్ వర్షం కురిసింది. సినిమా ఓ మాదిరిగా ఉన్నా సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేయచ్చు.  ఈ విషయం తెలిసిన దర్శకు,నిర్మాతలు సంక్రాంతికే టార్గెట్ చేస్తూంటారు. ఆ క్రమంలో గత పదేళ్లుగా సంక్రాంతికి వచ్చి విన్ అయిన సినిమాలు లిస్ట్ చూద్దాం.

211
Asianet Image

గత పదేళ్లుగా సంక్రాంతికు విన్ అయిన సినిమాలు (2016- 2025) లిస్ట్ చూస్తే

1. సోగ్గాడే చిన్ని నాయినా- 2016

సోగ్గాడే చిన్నినాయనా నాగార్జున  హీరో గా నటించగా 2016 సంక్రాంతికి విడుదలైన చిత్రం. కళ్యాణ్ కృష్ణ కురసాలకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించింది
 

311
Asianet Image

2.ఖైధీ నెంబర్ 150 - 2017

చిరంజీవి, వివి వినాయిక్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం ఇది. లైకా ప్రొడక్షన్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించింది. తమిళ రమణ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. సినిమా రీ ఎంట్రి చిత్రం ఇది.

411
Asianet Image


3. జై సింహా -2018

తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొంది, సంక్రాంతికి విడుదల అయిన బాలయ్య సినిమా ‘జై సింహా’.ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ రేంజ్ లోనే సినిమాను పూర్తి చేశారు.  నిర్మాతలే స్వయంగా విడుదల చేసుకున్నారు. తక్కువ రేట్లతో వచ్చన ఈ సినిమా మార్కెట్లో బాగానే సొమ్ము చేసుకుంది. టాక్ యావరేజ్ గా ఉన్నా కమర్షియల్ గా వర్కవుట్ అయ్యిపోయింది.
 

511
Asianet Image


4.ఎఫ్ 2- 2019

 'ఎఫ్‌ 2'.. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది.  వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే వినోదాన్ని అందించింది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, గద్దె రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రధారులు.
 

611
Asianet Image


5.అల వైకుంఠపురములో -2020 

 స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠరములో.బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించిన ఈ సినిమాలో టబు, సుశాంత్‌, జయరామ్‌, నివేదా పేతురాజ్‌, సచిన్‌ కేడ్కర్‌, హర్షవర్ధన్‌లు కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి పండక్కి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తూ సత్తా చాటింది.

711
Asianet Image


6. క్రాక్ -2021

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించారు. 2021 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. ర‌వితేజ‌, శ్రుతీ హాస‌న్‌, డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనికి హిట్ అవ‌స‌రం అని అనుకుంటున్న స‌మ‌యంలో ద‌క్కిన విజ‌య‌మిది. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ శంక‌ర్ అనే పాత్ర‌ను పోషించారు. 

811
Asianet Image


7. బంగార్రాజు- 2022

'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వల్‌గా వచ్చిన 'బంగార్రాజు' మూవీ తెలుగు తెరపై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడం, పోటీలో ఏ పెద్ద సినిమా లేకపోవడంతో కలెక్షన్లు బాగా వచ్చాయి.
 

911
Asianet Image


8.వాల్తేరు వీరయ్య -2023

మెగాస్టార్ చిరంజీవి నటించిన   సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు చిరంజీవి సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది వాల్తేరు వీరయ్య.  200 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. 
 

1011
Asianet Image


9. హనుమాన్ -2024

2024  సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే 'హనుమాన్' మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.  దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన  చిత్రం హనుమాన్. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ సినిమాగా వచ్చింది. ఇక ఈ సినిమాలో క్యాస్ట్ చిన్నగా ఉన్నా.. సినిమా పెద్ద హిట్ అయ్యి ఊహించని స్దాయిలో కలెక్షన్స్ తెచ్చి పెట్టింది.

1111
Asianet Image


10 . సంక్రాంతికి  వస్తున్నాం -2025

హిస్టరీలో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొట్టిన ‘విక్టరీ వెంకటేష్’తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటే హిట్ పక్కా అని ముందే ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్.అప్పట్లో.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఇప్పుడు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’అంటున్నారు. ఈ సంక్రాంతికి ఇంకా కలెక్షన్స్ వైజ్ గా ఫలానా సినిమానే విజేత అని ట్రేడ్ తేల్చలేదు కానీ ఇప్పటికైతే ఈ సినిమానే సంక్రాంతి విజేత అని మీడియా అంటోంది. 

read more: సంక్రాంతికి వస్తున్నాం: ఏ OTT లో...ఎప్పటి నుంచి?

alsoread: పవన్‌ కళ్యాణ్‌ కి ఫస్ట్ టైమ్‌ చిరంజీవి వార్నింగ్‌, ఆ రోజు నుంచి ఇంకెప్పుడు ఆ పనిచేయలేదు
 

Surya Prakash
About the Author
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా. Read More...
 
Recommended Stories
Top Stories