సంక్రాంతికి వస్తున్నాం: ఏ OTT లో...ఎప్పటి నుంచి?
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయ్యింది. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయం సాధించింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి సీజన్ చివరలో వచ్చి సూపర్ హిట్టైంది. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భార్య, మాజీ ప్రేయసి మధ్య నగిలిపోయే పాత్ర చేశారు వెంకీ.
ఈ సినిమాలో కామెడీ సీన్స్ జనం తెగ నవ్వుతున్నారు. పండగ ఫెరఫెక్ట్ సినిమా ఇదే అని తేల్చేసారు. రెండు యాక్షన్ సినిమాలు డాకూ మహారాజ్, గేమ్ ఛేంజర్ కన్నా ఈ సినిమాకే ఫ్యామిలీలు ఓటేస్తున్నాయని కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో చాలా మంది ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూపులు మొదలెట్టారు.
సూపర్ హిట్ సినిమాలు ఓటిటిలో కాస్తంత లేటుగానే వస్తాయనేది నిజం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రిలీజ్ కు ముందు అమేజాన్, నెట్ ప్లిక్స్ లతో మాట్లాడినా వర్కవుట్ కాలేదు. సంక్రాంతికి వస్తున్న సినిమా కావటంతో స్లాట్ ఇవ్వలేమని, దాంతో అంత రేటు ఇవ్వలేమని రెండు ఓటిటి సంస్దలు చెప్పేయటంతో..సినిమాపై నమ్మకంతో దిల్ రాజు ఓటిటి బిజినెస్ కాకుండానే అడుగు ముందుకేశాడు.
రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ వచ్చాక, ఓటిటి , శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. భారీ రేటు ఇచ్చి మరీ జీ5 ఓటీటీకి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత జీ5 ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేలా ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జీ తెలుగు టీవీ ఛానెల్‍కు శాటిలైట్ రైట్స్ దక్కాయి.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫిబ్రవరి నెల మధ్యలో అంటే ఇరవై తేదీ లోపు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో మిగతా రెండు సంక్రాంతి సినిమాలు కూడా ఓటీటీలో అడుగుపెట్టవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో పర్ఫార్మెన్స్, థియేట్రికల్ రన్‍ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు అవుతుంది.
ఈ సినిమాకు హిట్ టాక్ రావటంతో టీమ్ ఉత్సాహం మామూలుగా లేదు. ముందుగా ప్లాన్ చేసిన ప్రమోషన్స్ తో టీవిలు హోరెత్తిపోతున్నాయి. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్లలో ఫుల్ సందడి చేస్తున్నారు. వెంకీ చాలా ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
కొన్ని ఈవెంట్లలో డ్సాన్స్ కూడా చేశారు. ఈ చిత్రంలోని పాటలు మోత మోగుతున్నాయి. ఈ మూవీకి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు. శ్రీ వెంకేటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సాయికుమార్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, నరేశ్, వీటీవీ గణేశ్, శ్రీనివాస్ అవసరాల కూడా కీలకపాత్రలు పోషించారు.
read more: బాలకృష్ణ వంద కోట్ల సినిమాలు ఎన్నో తెలుసా? సీనియర్ హీరోల్లో బాలయ్య రేర్ ఫీట్
also read: `సంక్రాంతికి వస్తున్నాం` మొదటి రోజు కలెక్షన్లు, వెంకటేష్ సంచలనం, విక్టరీ ఈజ్ బ్యాక్?