- Home
- Entertainment
- Sanjay Dutt: ఇద్దరి మధ్య 20ఏళ్లు తేడా, అయినా తగ్గని సంజయ్ దత్.. మూడో పెళ్లి వెనుక షాకిచ్చే నిజాలు
Sanjay Dutt: ఇద్దరి మధ్య 20ఏళ్లు తేడా, అయినా తగ్గని సంజయ్ దత్.. మూడో పెళ్లి వెనుక షాకిచ్చే నిజాలు
సంజయ్ దత్, మాన్యతల వివాహానికి 17 ఏళ్ళు నిండాయి. గోవాలో జరిగిన వారి ప్రైవేట్ వేడుక నుండి సంజయ్ సోదరీమణుల అసంతృప్తి వరకు, వారి క్రేజీ ప్రేమకథ గురించి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
- GNFollow Us

సంజయ్, మాన్యతల వివాహ వార్షికోత్సవం
సంజయ్ దత్, మాన్యతల వివాహానికి 17 ఏళ్ళు నిండాయి. ఈ జంట 2008లో గోవాలో ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. వివాహానికి అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే, ఈ వివాహానికి సంజయ్ సోదరీమణులు కూడా రాలేదు. ఇదే అందరికి షాకిచ్చే విషయం. మరి వివాదం ఏంటి? సంజయ్ దత్ ఏం చేశాడనేది చూస్తే.
సంజయ్, మాన్యతల తొలి పరిచయం
సంజయ్ దత్తు, మాన్యతలు మొదటిసారి ఓ అవార్డుల ప్రదానోత్సవంలో కలుసుకున్నారు. మాన్యతను చూడగానే సంజయ్ ఆమెతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డాడు . సంజయ్ దత్ గత ప్రేమ అనుభవాలకు సంబంధించిన బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ తో బాధలో ఉన్న క్రమంలో మాన్యత పరిచయం ఆయనకు రిలీఫ్‌నిచ్చింది. దీంతో ఇద్దరు బాగా కలిసిపోయారు. పెళ్లి చేసుకున్నారు.
సంజయ్, మాన్యతల డేటింగ్
తొలిసారి కలుసుకున్న తర్వాత సంజయ్ దత్, మాన్యతలు డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, సంజయ్ ఈ పెళ్లి చేసుకోవడం ఆయన సోదరీమణులు ప్రియా, నమ్రతలకు నచ్చలేదు. వారు తమ సోదరుడు మూడో పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. దీంతో పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇది బాలీవుడ్‌లో చాలా రోజులు చర్చనీయాంశంగా మారింది.
సంజయ్, మాన్యతల పిల్లలు
మూడో పెళ్లి సమయంలో సంజయ్ దత్ వయసు 50 ఏళ్ళు, మాన్యత వయసు 29 ఏళ్ళు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు - కుమారుడు శహ్రాన్, కుమార్తె ఇక్రా. మాన్యత ప్రస్తుతం సంజయ్ దత్ ప్రొడక్షన్స్ కి CEO గా ఉన్నారు.
మాన్యత అసలు పేరు దిల్నావాజ్
సంజయ్ దత్తు మూడో భార్య ముస్లిం కుటుంబానికి చెందినది. ఆమె అసలు పేరు దిల్నావాజ్ షేక్. సినిమాల కోసం ఆమె తన పేరును దిల్నావాజ్ నుండి మాన్యతగా మార్చుకుంది.
మాన్యత నటించిన బి-గ్రేడ్ సినిమాలు
పెళ్లికి ముందు మాన్యత కొన్ని బి-గ్రేడ్ సినిమాల్లో నటించింది. మాన్యత నటించిన సినిమాలు కూడా నచ్చలేదు. దీంతో ఆమె నటించిన సినిమాలను హక్కులను కొనుగోలు చేసి విడుదల కాకుండా చూసుకున్నారు.
సంజయ్, మాన్యతల బంగ్లా
సంజయ్ దత్తు, మాన్యతలు ముంబైలోని పాలీ హిల్స్‌లో 40 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. బంగ్లా లోపలి ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మాన్యత తన ఇంటి లోపలి ఫోటోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది.
read more: Thandel Movie Review: `తండేల్` మూవీ రివ్యూ, రేటింగ్