- Home
- Entertainment
- Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Sanjana Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే లో.. టాప్ 5 కంటెస్టెంట్స్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది సంజన. బిగ్ బాస్ హౌస్ లో ఆమె 15 వారాలు కంప్లీట్ గా ఉంది. అందుకుగాను సంజన అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్స్
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. గత సీజన్ల కంటే కూడా ఈ సీజన్ కు ఎక్కువ రెస్పాన్స్ వచ్చించి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు లేకపోయినా.. ఎందుకో బిగ్ బాస్ సీజన్ 9 కు ఎక్కువగా క్రేజ్ ఏర్పడింది. ఇక దాదాపు 100 రోజులకు పైగా బిగ్‌బాస్ హౌస్‌లో గడిపి, అనేక టాస్కులు, గేమ్స్, సవాళ్లను ఎదుర్కొని ఐదుగురు కంటెస్టెంట్లు టాప్ 5లో నిలిచారు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో టాప్ 5 నుంచి చివరి స్థానంలో ఉన్న సంజన మొదటగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ హౌస్ లో 15 వారాలు కంప్లీట్ చేసుకున్న ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది?
టాప్ 5 నుంచి ఫస్ట్ ఎలిమినేషన్
బిగ్ బాస్ ఫైనల్స్ జరుగుతున్న వేళ.. అసలు టాప్ 5 కంటెస్టెంట్లకు ఎంత పారితోషికం అందిందన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా టాప్ 5లో ఉన్న వారిలో మొదటగా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్ సీనియర్ హీరోయిన్ సంజన గల్రానీ. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 నుంచి తొలి ఎలిమినేషన్ గా..సంజన బయటకు వచ్చింది. ఫైనల్ ఓటింగ్‌లో ఇతరులతో పోలిస్తే ఆమెకు చాలా తక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమెను ముందుగా ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. ఈ ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో నలుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వారిలో మరొకరు కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది.
సంజన గల్రానీ రెమ్యునరేషన్ ?
సంజన గల్రానీ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఈ కాలంలో ఆమెకు అందిన పారితోషికంపై ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం సంజనకు రోజుకు 40 వేల వరకూ పారితోషికం అందించారట. వారానికి ఆమెకు దగ్గరగా 2.80 లక్షల పైన చెల్లించారన్న సమాచారం ఉంది. అలా 15 వారాలు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందకు సుమారుగా 42 లక్షల వరకూ పారితోషికాన్ని సంజనకు చెల్లించినట్లు తెలుస్తోంది. అంటే విన్నర్ కు ఇచ్చే ప్రైజ్ మనీ కంటే కాస్త తక్కువ అంతే. ఒకవేళ సంజన గల్రానీ బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో విజేతగా నిలిచి ఉంటే, 50 లక్షల ప్రైజ్ మనీతో కలిపి దాదాపు కోటి రూపాయల వరకు ఆమెకు వచ్చేదని విశ్లేషకులు అంటున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో సంజన పోరాటం
హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సంజన గల్రానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫన్ జనరేట్ చేయాలనే ఉద్దేశంతో అందరితో కలిసిపోవడానికి ప్రయత్నించారు. కొంతకాలం పాటు ఇతర కంటెస్టెంట్ల టార్గెటింగ్ కారణంగా ప్రేక్షకుల్లో ఆమెపై సింపతీ కూడా పెరిగింది. అయినప్పటికీ మధ్యలో ఆమె ప్రభావం కొంత తగ్గినట్లు కనిపించింది. పవన్ కళ్యాణ్, డీమన్ పవన్, తనూజ వంటి కంటెస్టెంట్ల హవా మధ్య ఆమె కొంత సైడ్ అయింది. అయినా చివరివరకు పోరాడి టాప్ 5లో చోటు దక్కించుకుని ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. కానీ ఫైనల్ రేస్ నుంచి మొదటగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

