- Home
- Entertainment
- పెళ్లి జీవితంపై నటి సంగీత షాకింగ్ కామెంట్స్.. ఆ లైఫ్‌ని వదిలేద్దామనుకున్నా అంటూ బాంబ్..
పెళ్లి జీవితంపై నటి సంగీత షాకింగ్ కామెంట్స్.. ఆ లైఫ్‌ని వదిలేద్దామనుకున్నా అంటూ బాంబ్..
నటి సంగీత తన పెళ్లి జీవితం గురించి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. తాను మ్యారేజ్ లైఫ్ నుంచి బయట పడాలని ప్రయత్నించానని, అంత దారుణంగా సాగిందని చెబుతూ షాకిచ్చింది.

నటి సంగీత.. `ఖడ్గం` సినిమాతో పాపులర్ అయ్యింది. ఆ సినిమా విజయంతో బిజీ హీరోయిన్ అయిపోయింది. వరుసగా సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సంగీత. అడపాదడపా సినిమాల్లో మెరుస్తుంది. ఇటీవల `ఆచార్య`లో ఓ పాటలో మెరిసింది. తాజాగా ఆమె తన మ్యారేజ్ లైఫ్‌కి సంబంధించిన పలు రహస్యాలను బయటపెట్టింది. పెళ్లి జీవితం ఎంత దుర్భరంగా సాగిందో తెలిపింది.
తాజాగా ఓ యూట్యూబ్(ప్రేమ) ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఆసక్తికర, షాకింగ్ విషయాలను వెల్లడించింది. తన పెళ్లి జీవితం గురించి ఓపెన్ అవుతూ, దాన్నుంచి బయటపడాలని అనుకున్నట్టు తెలిపింది. ప్రారంభంలో మ్యారేజ్ లైఫ్‌ని అసహ్యించుకున్నట్టు, దీన్నుంచి బయటకు రావాలని ప్రయత్నించినట్టు చెప్పింది. తొందరగా మ్యారేజ్ లైఫ్‌ని వదిలేయాలని అనుకుందట. అంత దారుణంగా సాగిందని చెబుతూ షాకిచ్చింది.
సంగీత తమిళ నటుడు, సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2009లో వీరి వివాహం జరిగింది. తిరువన్నమలై టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి పదేళ్ల పాప కూడా ఉంది. అయితే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. అటు తన భర్త ఫ్యామిలీ నుంచి ఇట తమ ఫ్యామిలీ నుంచి చాలా ఒత్తిడి, గొడవలు అయినట్టు చెప్పింది. దీంతో వారికి చాలా దూరమైపోయినట్టు చెప్పింది. ఆ సమయంలో అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్న భావన కలిగిందని తెలిపింది సంగీత.
`తెలిసో తెలియకో ఓ నిర్ణయం తీసుకున్నా. అది రైటా రాంగా? అనేది నాకు తెలియదు. కానీ దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది, సాధ్యమైతే దీన్ని సాల్వ్ చేసుకోవాలా?, లేదంటే దీన్నుంచి బయటపడాలా? అనే రెండు ఆప్షన్స్ మాత్రమే తన ముందు ఉన్నాయి, అయితే మా ఇద్దరి గురించి ఇద్దరికి అంతఎక్కువగా తెలియదు, ముందు మేం ఏంటనేది తెలుసుకోవాలని దానిపై వర్క్ చేశాం. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, బాగా నమ్మాం` అని వెల్లడిచింది సంగీత.
అయితే తాము డిఫరెంట్ రంగాలకు చెందిన వాళ్లం. ఆయన తన రంగంలో ఎక్స్ ట్రీమ్, నేను నా రంగంలో ఉన్నా. ఇద్దరి గురించి పెద్దగా తెలియదు, రంగాలు మాత్రమే కాదు, మనస్థత్వాలు భిన్నం, ఆలోచనలు భిన్నం, చేసే పనులు భిన్నమైనవి, ఆయనకు నచ్చేది తనకు నచ్చదని, తనకు నచ్చేది ఆయనకు నచ్చదని, దీంతో ఇద్దరి మధ్య సంఘర్షణ జరిగేదని సంగీత చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు ఓ పాయింట్ వద్ద ఇద్దరం కలవాలి, దీన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇద్దరం ఒక్కతాటిపైకి రావాలనేది తెలియదని, ఇలా చేయోచ్చా అనేది కూడా తనకు తెలియదని చెప్పింది. అది చేస్తే మాకు మంచిది. ఆ తర్వాత ఆ దిశగా వర్క్ చేసినట్టు తెలిపింది సంగీత.
క్రిష్ అమేజింగ్ పర్సన్ అని, తనని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేదని తెలిపింది. లైఫ్ చాలా చిన్నది, దాన్ని వదిలేసుకుని వెళితే అయిపోతుంది, తాను చాలా సార్లు వదిలేద్దామనుకున్నప్పుడు ఆయన వద్దు అలా చేయోద్దు, జీవితం చాలా చిన్నది, ఇష్టమైన వాళ్లుకొందరే ఉంటారు. వారిని వదులు కోవద్దని చెబుతూ మోటివేట్ చేసినట్టు తెలిపింది సంగీత. ఆయన తనని తాను కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తాడని తెలిపింది. నువ్వు ఊరికే అంటావ్ కాని, నువ్వే ఎక్కువగా ఇష్టపడతావని తనతో అనేవాడని చెప్పింది సంగీత. తాను ఒక రకమైన రాక్షసిని అని, కానీ అతను మాత్రం తనకోసం ఏమైనా చేస్తాడని, అదే తమ మ్యారేజ్ లైఫ్‌ని కంటిన్యూ చేసిందని చెప్పింది సంగీత. ఆయన తనని బాగా ప్రేమిస్తాడని, చాలా కమాండ్ ఉన్న పర్సన్ అని చెప్పుకొచ్చిందీ అందాల భామ.
సంగీత.. `ఖడ్గం` సినిమాకి ఫిల్మ్ ఫేర్ అవార్డుని అందుకుంది. ఆ తర్వాత `పెళ్లాం ఊరిళితే`, `ఈ అబ్బాయి చాలా మంచోడు`, `ఆయుధం`, `నేను పెళ్లికిరెడీ`, `ఖుషి ఖుషిగా`, `విజయేంద్ర వర్మ`, `సంక్రాంతి`, `నా ఊపిరి`, `బహుమతి`, `మా ఆయన చంటిపిల్లాడు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల రీఎంట్రీ ఇస్తూ `సరిలేరు నీకెవ్వరు`, `ఆచార్య` `మసూద`, `వారసుడు` వంటి చిత్రాల్లో నటించింది.