#Spirit:'స్పిరిట్' కు సందీప్ వంగా రెమ్యునరేషన్ షాకింగ్..
ఈ చిత్రం నిమిత్తం సందీప్ వంగాకు ఎంత పే చెయ్యబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) - ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’ (Spirit) రాబోతున్న సినిమా పై అందరి దృష్టి పడింది. డ్రగ్స్ నేపథ్యంలో.. అలాగే ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో సందీప్ కచ్చితంగా రూ2000 కోట్లు వసూళ్లు చేస్తారని అంటున్నారు. ఈ సినిమాతో రాజమౌళి ఫిక్స్ చేసిన టార్గెట్ ను రీచ్ అయ్యే పనిలో నిమగ్నమయ్యారు.
Spirit
యానిమల్ మూవీ తో పెద్ద హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ అయ్యారు సందీప్ రెడ్డి వంగా. సందీప్ వంగా చేస్తున్న నెక్స్ట్ మూవీ స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇయర్ ఎండ్ కి స్టార్ట్ అవుతుందని దర్శకుడు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ‘స్పిరిట్’(Spirit) లో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో అలరించనున్నాడు. యానిమల్ చిత్రం బీబత్సమైన వసూళ్లు సాధించటంతో నిర్మాతలకు సైతం భారీగా లాభాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నిమిత్తం సందీప్ వంగాకు ఎంత పే చెయ్యబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సందీప్ వంగాకు 125-150 కోట్లు దాకా ముడుతుందని సమాచారం. అయితే దాన్ని పెట్టుబడిలో తమ షేర్ గా పెట్టబోతున్నారని, లాభాలు వచ్చాక అందుకుంటారని చెప్తున్నారు. అదే విధంగా యానిమల్ చిత్రానికి 100 కోట్లుదాకా ముట్టిందని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఇదే పద్దతి స్పిరిట్ చిత్రానికి కూడా అవలంబించబోతున్నారట.
ఇక ఈ చిత్రం నిమిత్తం ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అంటే.. ఈ సినిమా రెమ్యునరేషన్ గా ప్రభాస్ ...తెలుగు రైట్స్ తీసుకున్నారట. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ ఎప్పుడో పూర్తయ్యాయని వినికిడి. తెలుగు రాష్ట్రాల్లో సలార్ తర్వాత థియేటర్ బిజినెస్ బాగా పెరిగింది. దాదాపు 150 కోట్లు దాకా పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ సొంతంగా రిలీజ్ చేసుకుంటే..సినిమా హిట్టైతే మరో యాభై కోట్లు ఖచ్చితంగా వస్తాయి. అంటే 200 కోట్లు పై చిలుకు స్పిరిట్ తో పాకెట్ లో వేసుకోబోతున్నారు ప్రభాస్.
యానిమల్ సూపర్ సక్సెస్ తో సందీప్ వంగాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చేసింది. అది ఖచ్చితంగా స్పిరిట్ ఓపినింగ్స్, బిజినెస్ పై కనిపిస్తుందనటంలో సందేహం లేదు. యానిమల్ సినిమాతో సందీప్ వంగా తనలోని ఇంటెన్స్ యాంగిల్ ను చూపించడమే స్పిరిట్ మూవీ హై లెవెల్ బిజినెస్కి ప్రధానమైన కారణం.. . సినిమా షూటింగ్ 2024లో ప్రారంభమై 2025 లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. స్పిరిట్ మూవీని టీసిరీస్ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.
స్పిరిట్ చిత్రాన్ని 2025 క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. సెప్టెంబరు 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని, ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ, ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ప్రకటించాడు సందీప్.
Prabhas
ఓ బాలీవుడ్ సినిమా టీజర్ లాంచ్‌లో పాల్గొన్న సందీప్ స్పిరిట్ స్టోరీ లైన్ ఏంటో చెప్పేశాడు. ‘ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ పనుల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి వెళ్లనుంది. అందరూ అనుకున్నట్లుగా ఇది హారర్ మూవీ కాదు. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ.తెరపై సరికొత్త ప్రభాస్‌ని చూస్తారు’అని చెప్పారు.
నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ...‘‘ ‘స్పిరిట్’చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అని భూషణ్ కుమార్ చెప్పారు
ప్రభాస్ ప్రస్తుతం అటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె', దర్శకుడు మారుతి తో మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ ను పోలీస్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే 'స్పిరిట్' చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? ప్రభాస్ ను ఎప్పుడు ఖాకీ డ్రెస్ లో చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.