- Home
- Entertainment
- కత్తి లాంటి పరువాలతో కవ్విస్తున్న భీమ్లా నాయక్ బ్యూటీ.. ఇది నా వెర్షన్ RRR అంటూ కామెంట్స్
కత్తి లాంటి పరువాలతో కవ్విస్తున్న భీమ్లా నాయక్ బ్యూటీ.. ఇది నా వెర్షన్ RRR అంటూ కామెంట్స్
భీమ్లా నాయక్ లాంటి క్రేజీ ఆఫర్స్ కోసం సంయుక్త ఎదురుచూస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో కథకు తగ్గట్లుగా సంయుక్త హోమ్లీగా నటిస్తూ రానా వైఫ్ గా మెప్పించింది.

మల్టీస్టారర్ గా వచ్చిన భీమ్లా నాయక్ చిత్రం మంచి విజయం సాధించింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళీ ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్స్ గా నటించారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అందరిని ఆకర్షించేసింది సంయుక్త మీనన్. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ తన స్పీచ్ తో సంయుక్త అందరినీ కట్టి పడేసింది. హైదరాబాద్ తన హోమ్ టౌన్ కావాలని, ఇక్కడ ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయట పెట్టింది.
అలాగే 'ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢాంధకారం' అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో పలికే మాటలతో సంయుక్త ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిత్యామీనన్ హాజరు కాలేదు. దీనితో సంయుక్త అందరి దృష్టిని ఆకర్షించింది. సంయుక్త మీనన్ ఆశించినట్లుగానే భీమ్లా నాయక్ చిత్రం మంచి విజయం సాధించింది.
భీమ్లా నాయక్ లాంటి క్రేజీ ఆఫర్స్ కోసం సంయుక్త ఎదురుచూస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో కథకు తగ్గట్లుగా సంయుక్త హోమ్లీగా నటిస్తూ రానా వైఫ్ గా మెప్పించింది. క్లయిమాక్స్ లో ఆమె నటన అదుర్స్ అనే చెప్పాలి. ఆమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలే అందుకు ఉదాహరణ. బికినీ ఫోజుల్లో సైతం కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది.
తాజాగా సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. సంయుక్త మీనన్ హోమ్లీగా కనిపిస్తూనే గ్లామరస్ లుక్ లో అదరగొడుతోంది.
ప్రస్తుతం సంయుక్త మీనన్.. కళ్యాణ్ రామ్ బింబిసారా చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంయుక్త తాజాగా తన గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేసింది.
బ్లాక్ టాప్, జీన్స్ ధరించిన సంయుక్త మీనన్ కళ్ళు చెదిరేలా క్లోజప్ ఫోజులో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ ఫోటోకి సంయుక్త ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. ఇది నా వర్షన్ ఆర్ఆర్ఆర్.. రిలాక్స్.. రిఫ్రెష్.. రీఛార్జ్ అంటూ కామెంట్స్ పెట్టింది.
అలాగే చీర కట్టులో కూడా నడుము అందాలు ఆరబోస్తూ సంయుక్త మీనన్ మెస్మరైజింగ్ ఫోజులు ఇచ్చింది. నిత్యామీనన్, అనుపమ, సాయి పల్లవి లాంటి మలయాళీ బ్యూటీలు తెలుగులో రాణిస్తున్నారు. అదే తరహాలో సంయుక్త మీనన్ కి కూడా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.