- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తులసికి ధైర్యం చెప్పిన సామ్రాట్.. తులసి మీద కోపంతో రగిలిపోతున్న నందు..?
Intinti Gruhalakshmi: తులసికి ధైర్యం చెప్పిన సామ్రాట్.. తులసి మీద కోపంతో రగిలిపోతున్న నందు..?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన తల్లి ఇంటికి వెళ్లి అమ్మ అని ప్రేమగా పిలిచి వాళ్ళ అమ్మను హత్తుకుంటుంది. తులసి రావడంతో ఆమె తల్లి, దీపక్ ఇద్దురు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు తిరిగినంత ప్రేమ్ చెప్పాడు అమ్మ అని అంటుంది. అప్పుడు తులసి జరిగిన విషయం గురించి తలుచుకొని బాధపడుతూ ఇక ఈ విషయం గురించి మనం మాట్లాడుకోకూడదమ్మా అని అంటుంది. అప్పుడు తులసి వాళ్ళ అమ్మ శభాష్.. నువ్వు మొదట ఆ కోడలిగా వెళ్ళావు. ఆ తర్వాత కూతురివి అయ్యావు. కానీ ఆ ఇల్లు కూతురు పరువును నిలబెట్టే లేక పోయింది అని అంటుంది.
ఈరోజు నా కూతురు చూపించిన ధైర్యానికి శభాష్ అంటున్నాను తులసి అని అంటుంది. ఎవరి ముందు అయిన తలదించడం అంటే పర్లేదు అర్థం చేసుకోవచ్చు. కానీ వివాహం చంపుకొని పూర్తిగా లొంగిపోయి బతకడం అంటే చాలా పెద్ద తప్పు అని అంటుంది. మరొకవైపు ప్రేమ్ సామ్రాట్ ఎంత వద్దన్నా కూడా లోపలికి పిలుచుకుని వెళ్తాడు. బ్రతిమలాడి అక్కడికి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు పరంధామయ్య తినకపోవడంతో శృతి తినండి తాతయ్య అని అడుగుతూ ఉంటుంది. ఇంతకుముందు బ్రతకాలని ఉండేది అమ్మ కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయింది అని ఎమోషనల్ గా మాట్లాడడంతో వెంటనే శ్రుతి మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా తాతయ్య అని అంటుంది.
పరంధామయ్య తులసి గురించి ఎమోషనల్ గా మాట్లాడడంతో శృతి కూడా ఎమోషనల్ అవుతుంది. పక్కనే ఉన్న నందు లాస్య లు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు లాస్య ఈయనకు శాపనార్ధాలు పెట్టడం ఎక్కువ అయింది అని అనుకుంటూ ఉంటుంది. నందు దివ్య అని పిలిచి ఎలా అయినా ఎన్ని తినమని చెప్పమ్మా అని అనడంతో దివ్య అక్కడికి వెళ్లి పరందామయ్యను బ్రతిమలాడడంతో పరంధామయ్య తినడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత తులసి మీకు కూడా నామీద అనుమానాలు ఉంటే చెప్పండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది.
అప్పుడు తులసి వాళ్ళ అమ్మ నా కూతురు ఎప్పటికీ తప్పు చేయదు.. కూతురి విషయంలో కూడా ఈ తల్లి తప్పు చేయదు అంటూ తులసి బాధను పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సామ్రాట్, ప్రేమ్ రావడంతో అది చూసి తులసి ఆశ్చర్య పోతుంది. ఇప్పుడు ప్రేమ్ నేనే సామ్రాట్ గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను అమ్మ ఆయన మీతో మాట్లాడడానికి మొహమాటపడుతున్నాడు అంటాడు ప్రేమ్. అప్పుడు సామ్రాట్ లోపలికి వచ్చి సారి తులసి గారు ఇదంతా నా వల్లే జరిగింది అని బాధపడుతుంటాడు.
ఇదంతా మీ తప్పు కాదు కొందరి ఆలోచన విధానం తప్పుగా ఉండటం వల్ల వాళ్ళు అపార్థం చేసుకున్నారు అని అంటుంది తులసి. అప్పుడు సామ్రాట్ బాధపడుతూ మాట్లాడడంతో తులసి ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు మంచితనంగా ఉన్న దానికి చూశారు కదా ఈ రోజు నేను ఏమి అనుభవిస్తున్నానో అని బాధపడుతూ మాట్లాడుతుంది తులసి. అప్పుడు తులసి అతిథులు తలుచుకొని ఎమోషనల్ అవుతుంది. తులసి ఓటమిని ఒప్పుకోను యుద్ధం చేస్తాను అని ధైర్యంగా మాట్లాడుతుంది. మరొకవైపు నందు ఆలోచిస్తూ బయటకు వచ్చి ఏదో ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య వస్తుంది.
అప్పుడు పరంధామయ్య అన్నమాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటారు నందు. అప్పుడు లాస్య అక్కడికి వచ్చి నందుని ఓదారుస్తూ నందు మనసుని తన మాటలతో ఇంకా చెడగొడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య తులసి సామ్రాట్ల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నందు ఈ రోజు నుంచి మనం ఇక్కడే మా వాళ్లతో కలిసి ఉంటున్నాం. ఈ ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు నందు లాస్యలు ఎలా అయినా జాబ్ వెతకాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నందు బయటకు వెళ్లి తులసి పేరు ఉన్న బోర్డుని విసిరి పారేస్తాడు.
పై తులసి పేరే కాదు తులసి జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో కనిపించకూడదు అని అంటాడు. తులసికి ఇక ఇంట్లోనే కాదు నా ఫ్యామిలీలో కూడా స్థానం లేదు అని అంటాడు నందు. నందు మాటలకు లాస్య సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు తులసి వాళ్ల అమ్మ సామ్రాట్ ని పొగుడుతూ ఉంటుంది. దీపక్ కూడా సామ్రాట్ ని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి కి సామ్రాట్ ధైర్యం చెప్పడంతో తులసి ధైర్యంగా మాట్లాడడం చూసి వాళ్ళందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుతూ ప్రేమ్ సంతోష పడుతూ ఉంటాడు. తల్లి ఎన్ని మాటలు అన్న దూరం పెట్టిన తల్లిని మాత్రం ఒంటరిగా విడిచిపెట్టడు ఈ ప్రేమ్ అని సంతోష పడుతూ ఉంటుంది తులసి...