- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: పాపను వదిలెయ్యమని తులసిని వేడుకున్న సామ్రాట్.. ప్రమాదంలో హాసిని?
Intinti Gruhalakshmi: పాపను వదిలెయ్యమని తులసిని వేడుకున్న సామ్రాట్.. ప్రమాదంలో హాసిని?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 18 ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి(tulasi) డాన్స్ స్కూల్ పెట్టడానికి అద్దెకు రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని అనగా వెంటనే పరంధామయ్య ఫోన్ చేసి అడిగి వెళ్ళమ్మా అని అనడంతో తులసి వాళ్లకు ఫోన్ చేయగా నిన్న వస్తానని చెప్పి రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు మా మేనేజ్మెంట్ కి యాటిట్యూడ్ నచ్చలేదు సారీ వద్దు అని చెబుతుంది. అప్పుడు తులసి బాధపడుతూ ఉండగా వెంటనే అనసూయ హనీ(hani) నీ తిడుతూ ఉంటుంది. ఇంతలోనే హనీ అక్కడికి వస్తుంది. అప్పుడు హనీ సారీ చెప్పగా తులసి పర్లేదు నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటుంది.
అప్పుడు ఎందుకు ఆంటీ నన్ను వెళ్ళమని చెబుతున్నారు అని అనడంతో ఏమి లేదమ్మా మీ వాళ్ళు మళ్ళీ టెన్షన్ పడతారు అని హనీకి నచ్చచెప్పి అక్కడినుంచి పంపిస్తుంది తులసి(tulasi). ఆ తర్వాత హనీ అక్కడి నుంచి వెళుతూ గులాబీ పువ్వు తీసుకుంటూ ఉండగా అనుకోకుండా తన బంగారు చైన్ అక్కడ పడిపోతుంది. ఒకవైపు సామ్రాట్(samrat)తన బాబాయ్ కి ఫోన్ చేసి తులసి విషయంలో కోపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సామ్రాట్ కూతురుతో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు.
ఆ తర్వాత హనీ మెడలో గోల్డ్ చైన్ కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటాడు సామ్రాట్. ఆ తర్వాత హని తులసి(tulasi) ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లాను అని చెప్పడంతో సామ్రాట్ కూతురిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. మరొకవైపు తులసి వాళ్ళందరూ ఆనందంగా నవ్వుతూ భోజనం చేస్తూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ అక్కడికి వస్తాడు. అప్పుడు సామ్రాట్ (samrat)తులసి గురించి నిజం తెలియకుండా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు.
నువ్వు మా పాప గోల్డ్ చైన్ దొంగతనం చేశావు అని అనడంతో వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు తులసి(tulasi) ఎంతచెప్పినా కూడా వినిపించుకోకుండా సామ్రాట్ తులసి మీద కోపడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ పని మనుషులని పెట్టి ఇల్లు మొత్తం వెతకమని చెప్పగా తులసి అడ్డుపడడంతో సామ్రాట్ కోప్పడతాడు. అప్పుడు అంకిత(ankitha) గోల్డ్ చైన్ వ్యాల్యూ ఎంత అడగండి ముఖాన కొట్టేద్దాం అని అనగా వెంటనే సామ్రాట్ షటాఫ్ అని గట్టిగా అరుస్తాడు.
మీలాంటి వాళ్ళని 100 మంది నిలబెట్టుకుని నా కూతురుతో ఎడమ చేతితో గోల్డ్ చైన్ దానం చేయించే రేంజ్ నాది అని అంటాడు. ఆ తర్వాత వాళ్లు ఎంతైనా చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇల్లు మొత్తం వెతికిస్తాడు. గోల్డ్ చైన్ కనిపించకపోయేసరికి ఇంకొక గంట సేపు ప్రేమిస్తున్నాను గోల్డ్ చైన్ నా చేతిలో ఉండాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు సామ్రాట్. మరొకవైపు నందు,లాస్య (lasya)యాక్సిడెంట్ విషయం గురించి గొడవ పడుతూ ఉంటారు.
అప్పుడు లాస్య నందు(nandu)కి ధైర్యం చెబుతూ ఉంటుంది. కానీ నందు మాత్రం సామ్రాట్ దగ్గర ఉద్యోగం చేయడానికి ఇష్టపడడు. అప్పుడు లాస్య మాటలకు ముందు సరే అని అనడంతో లాస్య సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత తులసి వాళ్లు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. మరోవైపు దివ్య(divya) మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా దివ్య కు ఆ గోల్డ్ చైన్ దొరుకుతుంది. తులసి ఆ చైన్ ఇవ్వడానికి వెళ్తాను అని అనగా అనసూయ దంపతులు వద్దు అని చెబుతారు. రేపటి ఎపిసోడ్ లో హని లిఫ్ట్ లో స్ట్రక్ అవుతుంది. అది తులసి కారణంగా జరిగింది అనుకున్న సామ్రాట్ నా కూతుర్ని వదిలే అని దండం పెడతాడు.