- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తులసికి బ్లాంక్ చెక్ ఇచ్చిన సామ్రాట్.. ప్రేమ్‌కు సూపర్ షాకిచ్చిన శృతి!
Intinti Gruhalakshmi: తులసికి బ్లాంక్ చెక్ ఇచ్చిన సామ్రాట్.. ప్రేమ్‌కు సూపర్ షాకిచ్చిన శృతి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 21 ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్(samrat) తులసిని అన్న మాటలను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసీని తప్పుగా అపార్థం చేసుకున్నావు నువ్వు అని తులసి(tulasi )గొప్పతనం గురించి కూడా చెబుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ చేసిన విషయాలన్నీ గురించి చెప్పడంతో సామ్రాట్ బాధపడుతూ ఉంటాడు.
అంతేకాకుండా హనీ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ లో అమ్మస్థానంలో తులసి(tulasi)పేరు రాయించింది అనడంతో సామ్రాట్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు హనీ చెప్పిన మాటలు అన్నీ కూడా సామ్రాట్ కి చెబుతాడు వాళ్ళ బాబాయ్. అప్పుడు తన కోరుకున్నంత డబ్బు ఇస్తాను అని అనడంతో తులసి డబ్బు మనిషి కాదు అని చెబుతాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. మరొకవైపు అంకిత(ankitha) ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది.
అప్పుడు తులసి(tulasi) పండుగకి అభిని పిలుద్దాం అనుకున్నాను అని అంటుంది. అప్పుడు అంకిత ఏం మాట్లాడకపోవడంతో ఏంటి అంకిత సైలెంట్ గా ఉన్నావు అని అడగగా ఏం మాట్లాడాలి ఆంటీ మీ అబ్బాయి మీ ఇల్లు మీ ఇష్టం అని అంటుంది. అప్పుడు అంకిత అభి(abhi)ఇంటికి రావడం ఇష్టం లేదు అన్న విధంగా మాట్లాడుతుంది. అప్పుడు తులసీ తన మాటలతో నచ్చ చెబుతుంది.
అభిని మాత్రమే కాదు ప్రేమ్(pream),శృతి వాళ్ళను కూడా ఇంటికి రమ్మని పిలుస్తున్నాను అనడంతో అంకిత సంతోషపడుతుంది. మరొకవైపు తన అత్త ఇంటికి చేరుకున్న శృతి(shruthi)జరిగింది మొత్తం తన అత్తకు వివరించి బాధపడుతూ ఉంటుంది. గొడవ పెడితే ఇలా అర్థరాత్రి సమయంలో ఎలా వచ్చావు అని అడుగుతూ ఉండగా అత్తయ్య గొడవపడితే సర్దుకోగలను తిడితే భరించగలను కొట్టితే సహించగలను అని అనగా వాళ్ళ అత్తయ్య నీ ఓర్పు సహనం గురించి నాకు తెలుసు కదా అని అంటుంది.
అప్పుడు తులసి(tulasi) గురించి మాట్లాడగా తులసి ఆంటీ ని ఏమనద్దు అత్తయ్య అని అంటుంది. మరొకవైపు ప్రేమ్ నిద్ర లేచి సరికి శృతి కనిపించకపోవడంతో ఆలోచనలో పడతాడు. నైట్ జరిగింది మొత్తం తలచుకొని శృతి(shruthi)ని అనరాన్ని మాటలు అన్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే శృతి కోసం వెతుకుతూ ఉండగా శృతి రాసిన లెటర్ ని చదివి చాలా బాధపడతాడు.
అప్పుడు శృతిని(shruthi)తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే తులసి ప్రేమ్ కి ఫోన్ చేసి ఏం ప్రేమ్ ఈ అమ్మని మరిచిపోయారా అంటూ తమాషాగా మాట్లాడి శృతికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటుంది. అప్పుడు ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత నువ్వు ఆనందపడే విషయం చెప్పడానికి ఫోన్ చేశాను ఇకపై నువ్వు శృతి మా ఇంటికి వచ్చేసేయండి అనడంతో ప్రేమ్(pream) లో లోపల సంతోషపడుతూ సరే వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
ఆ తర్వాత శృతి కనిపించకపోయేసరికి వెతుకులాడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత తులసి ఇంటికి సామ్రాట్(samrat) ఇంటి నుంచి ఒక చెక్కు వస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు చెక్కు గురించి ఇంట్లో వాళ్ళు ఆడుకుంటూ ఉండగా తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో తులసి(tulasi)సామ్రాట్ ఇంటికి వెళ్లి హనీ నీ ముద్దాడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తో చూసావా తులసి కి డబ్బు ఇవ్వగానే ఎలా మారిపోయిందో అని అనగా వెంటనే తులసి సామ్రాట్ కి చెక్కును ఇచ్చి తీసుకోండి అంటూ సామ్రాట్ కీ షాక్ ఇస్తుంది.