MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: తులసి కండిషన్ క్రిటికల్.. అంకితను మళ్లీ బాధపెట్టిన లాస్య ?

Intinti Gruhalakshmi: తులసి కండిషన్ క్రిటికల్.. అంకితను మళ్లీ బాధపెట్టిన లాస్య ?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 07 2023, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య నిన్ననే వచ్చావు కదా అప్పుడే బెంగ పెట్టుకున్నావా అనడంతో అవును అని అంటుంది తులసి. జోక్ బాగుంది నవ్వు రావడం లేదు అనడంతో నా మాట వినకపోతే నిజంగానే నవ్వుల పాలవుతారు అని అంటుంది తులసి. మేము ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము అనడంతో బెనర్జీ ప్రపోజల్ గురించి మాట్లాడుకుంటున్నారా అంటుంది తులసి. అప్పుడు లాస్య చూసావా నందు మనల్ని ఎంతగా టార్గెట్ చేస్తూ ఉందో నెక్స్ట్ ఏమంటుందో తెలుసా ఆ బెనర్జీ మోసగాడు ఆ ప్రాజెక్టు వదులుకోండి అనడంతో నువ్వు తమాషాకి అన్న అది నిజమే లాస్య అనగా నీ మాయమాటలు నా దగ్గర చెప్పకు అని అంటుంది లాస్య.

27

ఇప్పుడు తులసి నందగోపాల్ గారు లాస్య గురించి పక్కన పెట్టండి కనీసం మీరైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి అని అంటుంది. ఆల్రెడీ మా దగ్గరకు వచ్చాడు మేము ప్రాజెక్టు వద్దనే సరికి మీ దగ్గరికి వచ్చాడు అనగా చూసావా నందు తులసి తన ఫ్రెండు సామ్రాట్ తో పాటు నువ్వు కూడా ఎదగడం ఇష్టం లేక ఇలాంటి మాటలు చెబుతోంది అంటూ నందుకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొడుతూ ఉంటుంది. నాకు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు లేవు అని చెప్పేది విను నేను చెప్పేది నిజం అనడంతో లాస్య, నందు తులసి చెప్పే మాటలు నమ్మరు. బెనర్జీతో మీ కాంట్రాక్ట్ తప్పుడు నిర్ణయంతో అసలు నీతో పెళ్లి ఒక తప్పుడు నిర్ణయం అని అంటాడు నందు.

37

దాంతో తులసి షాక్ అవుతుంది. జీవితంలో అంతకంటే మరొక తప్పుడు నిర్ణయం లేదు అంటూ తులసిని అవమానించే విధంగా మాట్లాడుతాడు నందు. నేను చెప్పదలుచుకున్నది అయిపోయింది ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని అంటాడు నందు. తర్వాత ఇంటికి వెళ్లిన తులసి జరిగిన విషయాలు తలుచుకుని ఆలోచిస్తూ ఎందుకు నందగోపాల్ గారు ఇలా ఆలోచిస్తున్నారు చెప్తే వినడం లేదు అని తనలో తానే అనుకుంటూ ఉండగా ఇంతలో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడంతో వెళ్లి నీళ్లు తాగడానికి ప్రయత్నించగా నీళ్లు కూడా తాగలేక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.
 

47

అప్పుడు మొబైల్ ఫోన్ తీసుకొని ఫోన్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్ చేయలేక పడిపోతుంది. వరకు వైపు ప్రేమ్, అభి దంపతులు కలసి సరదాగా క్యారం ఆడుతూ ఉంటారు.  అప్పుడు వారు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ క్యారం బోర్డు ఆడుతూ ఉంటారు. అభి కి ఫోన్ రావడంతో అభి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అంకిత అందరి దగ్గర మొబైల్స్ తీసుకొని సైలెంట్ లో పెట్టి పక్కన పెట్టేస్తుంది. అప్పుడు ప్రేమ్ అభివాళ్లకు ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు గేమ్ లో పడి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు.
 

57

ఆ తర్వాత తులసి సామ్రాట్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో తులసి గారు అని అంటున్న కళ్ళు తిరిగి పడిపోయి ఉండడంతో మాట్లాడలేక పోతుంది. అప్పుడు ఏం జరిగిందో అని టెన్షన్ పడుతున్న సామ్రాట్ పరుగు పరుగున తులసి ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు డోర్ దగ్గర తులసి గారు అని పిలిచినా పలకకు పోవడంతో పక్కనే ఉన్న వెళ్లి కిటికీ లోకి వెళ్ళి తొంగి చూస్తాడు. అప్పుడు తులసి కిందపడిపోయి ఉండడం చూసిన సామ్రాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు తలుపు బద్దలుకొట్టుకొని లోపలికి వెళ్తాడు.
 

67

 తులసి ఎంత లేపినా లేవకపోవడంతో తులసిని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్తాడు సామ్రాట్. తులసికి డాక్టర్లు చెక్ చేస్తూ ఉండగా సామ్రాట్ ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ బయటికి వచ్చి ఆమె బీపీ పడిపోయింది హెల్త్ ఏమంత బాగోలేదు అని అంటుంది. పల్స్ రేటు కూడా డౌన్ అయింది. వెంటనే ట్రీట్మెంట్ చేయాలి లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ ఫిల్ అప్ చేయమని చెబుతుంది డాక్టర్.. అప్పుడు హాస్పిటల్లో వాళ్ళు సామ్రాట్ తులసి హస్బెండ్ అనుకుంటారు. అప్పుడు సామ్రాట్ ఎం చేయాలి సంతకం పెట్టకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు.
 

77

అప్పుడు సామ్రాట్ చేసేదేమీ లేక తులసి హస్బెండ్ గా సైన్ చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు సామ్రాట్. అప్పుడు తులసి మొబైల్ కి దీపక్ ఫోన్ చేయడంతో సామ్రాట్ జరిగింది మొత్తం వివరించగా దీపక్ షాక్ అవుతాడు. మరొకవైపు తులసికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలసి క్యారం బోర్డు ఆడుతూ ఉండగా ఇంతలో నందు లాస్య అక్కడికి వచ్చి అందర్నీ అక్కడికి రమ్మని పిలుస్తారు. అప్పుడు నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అనడంతో ఇప్పుడు అవసరం లేదు కదా ఆంటీ అని అంకిత అనగా ఒకసారి ప్రెగ్నెంట్ పోయిందని మళ్లీ తల్లి కాకుండా ఉంటావా అని అంకితను బాధ పెట్టే విధంగా మాట్లాడుతుంది లాస్య.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved