MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti gruhalakshmi: సామ్రాట్ మంచోడు కాదు.. తులసి ట్రిప్ క్యాన్సిల్ చెయ్యండి.. తల్లికి నందు కంప్లైంట్స్!

Intinti gruhalakshmi: సామ్రాట్ మంచోడు కాదు.. తులసి ట్రిప్ క్యాన్సిల్ చెయ్యండి.. తల్లికి నందు కంప్లైంట్స్!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Aug 09 2022, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... తులసి,సామ్రాట్  ఒకటైపోతున్నారు అని నందు కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య,నీకు విడాకులు అయిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నావు కదా నీ మార్గంలోనే తులసి కూడా వెళ్తే నువ్వు ఎందుకలా కుళ్ళుకుంటున్నావు?అని అంటుంది.ఇప్పుడు నాకు ఉపదేశాలు ఇవ్వడం మానేసి తులసి వైజాగ్ వెళ్లకుండా ఉండడానికి ప్లాన్ ఏదైనా వేయు అని అంటాడు.అంటట్లో నందు,అనసూయ కి ఫోన్ చేసి "సామ్రాట్,అంత మంచోడు కాదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తులసిని జాగ్రత్తగా ఉంచాలి" అని అనగా అనసూయ, "పాతికేల్లు ఒక వెదవతో కాపురం చేసి దాని గుండే రాయి చేసుకుంది. దాని గురించే బాధపడాల్సిన అవసరం లేదు" అని తిరిగి ఎటకారిస్తూ సమాధానం ఇస్తుంది. లాస్య  ఆ మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు నందు "రేపు సామ్రాట్ తులసి తో వైజాగ్ వెళ్లడానికి ప్లాన్ వేశాడు.తులసి మిమ్మల్ని అడిగితే మొఖం మీద వద్దని చెప్పేయండి" అని అంటాడు. ఆలోచనలలో పడ్డ అనసూయ ఆ మాట పూర్తవక ముందే ఫోన్ పెట్టేస్తుంది. నందు చిరాగ్గా ఫోన్ విసిరి కొడతాడు.
 

37

ఆ తర్వాత సీన్లో తులసి ఇంట్లో వాళ్లకి వైజాగ్ వెళ్లడం విషయం గురించి అడగడానికి ఆలోచిస్తూ ఉంటుంది.ఏదైతే అది అయింది వెళ్లి అడుగుదాం అనుకుంటుంది.అత్తమావల దగ్గరికి వెళ్లిన తులసి మాట్లాడడానికి సంకోచిస్తూ ఉండగా అనసూయ, తప్పు చేస్తేనే అలాగా భయపడతారు.దివ్య కూడా ఇలాగే తప్పు చేసినప్పుడు నిలదీస్తే ఇలాగే మొఖం పెడుతుంది అని చాలా కోపంగా ఆంటుంది.తులసి భయపడుతుంది.ఏమైంది అని  పరంధామయ్య అడగగా ఒకేసారి అనసూయ నవ్వుతూ వైజాగ్ వెళ్లాలనుకుంటున్నావు కదా?.
 

47

 నీకు అది సరైన పని అనిపిస్తే వెళ్ళు. ఎవరు ఏమి అనరు అని అంటుంది.ఆ తర్వాత సీన్లో హనీ రాత్రి అయినా పడుకోకుండా చదువుతూ ఉంటుంది.సామ్రాట్ అక్కడికి వచ్చి ఇది చదువుకునే సమయం కాదు పడుకో అని అంటాడు. హనీ, ఏదో పడుకోవాలి అని పడుకోవడం తప్ప ప్రశాంతంగా నాకు నిద్ర రావడం లేదు.ప్రశాంతంగా నిద్ర రావాలంటే అమ్మ చేతి గోరుముద్దలు తిని,అమ్మ ఒడిలో పడుకొని ,అమ్మ చెప్పే కథలు వింటూ అలా పడుకోవడం అని మా మేడం నాకు చెప్పింది అంటుంది హనీ. ఆ మాటలు విన్న సామ్రాట్ హనీ ని ఒళ్ళో కూర్చోబెట్టి జో కొడతాడు.

57

 అప్పుడు హనీ,"ఒకరోజు తులసి ఆంటి తింటున్నప్పుడు నాకు కూడా ఆకలేస్తే ఆంటీ నాకు ఇలాగే గోరు ముద్దలు తినిపిస్తూ ఒళ్ళో పడుకోబెట్టుకొని ఎన్నో కథలు చెప్పారు అంటుంది హనీ. తులసి ఆంటీ నీ అమ్మ అని పిలవాలి అనిపిస్తుంది. కానీ భయంగా ఉంది అని అంటుంది. సామ్రాట్ ఏడుస్తూ ఉంటాడు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు పడుకుండిపోతారు. ఈ లోగ సామ్రాట్ కి తులసి పాట పాడుతున్నట్టు కల వస్తుంది. వెంటనే లేచి నా మనసు ఎందుకు ఇలాంటి భ్రమలోకి వెళ్ళింది అని ఆలోచించుకుంటూ ఉంటాడు.ఆ తర్వాత సీన్లో తులసి వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

67

 అభి కి అది నచ్చదు మొఖం మాడ్చేస్తాడు.ఎందుకలా ఉన్నావు అభి అని అంకిత అడగా నేను మీ ఆంటీ లాగా లోపల ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడను అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అభి తో మాట్లాడి ఆఖరికి వైజాగ్ వెళ్లడానికి అభి ని ఒప్పిస్తారు. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ జోకులేసుకుంటూ ఉంటారు.ఆ తర్వాత సీన్లో నందు కోపంతో ఉడికిపోతూ ఉంటాడు.భోజనం చేద్దాం రా అని లాస్య అడగగా నన్ను విసిగించొద్దు లాస్య అని అంటాడు.
 

77

 నాకు మాత్రం సామ్రాట్ తులసి తో పాటు అక్కడికి వెళ్ళడం ఇష్టం అనుకుంటున్నావా. మనం వాళ్ళ ఆపలేము అని అంటుంది లాస్య. ఈ లోగా నందు, అమ్మకు చెప్పాను కదా అమ్మ ఆపుతుంది ఇలాంటివి అమ్మకి కూడా నచ్చవు అని అనగా అత్తయ్యకు ఇది నచ్చదు కానీ అత్తయ్యకి తులసి నచ్చుతుంది కదా అని కావాలని నందుని రెచ్చగొడుతూ ఉంటుంది లాస్య. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో
Recommended image2
Chiranjeevi: వివాదానికి తాత్కాలికంగా తెర, పెద్దికి లైన్ క్లియర్.. 2 మీటింగులతో తెగ్గొట్టేసిన చిరంజీవి
Recommended image3
NTR Sentiment: ఎన్టీఆర్‌లో ఉన్న వింత సెంటిమెంట్స్ ఏంటో తెలుసా? ప్రతి రోజూ అవి కచ్చితంగా పాటించాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved