MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Nithiin: నాని, నితిన్ కాంబినేషన్ టైటిల్ గ్లింప్స్.. ఇది అతడి భార్య కథ, వరుస ఫ్లాపుల తర్వాత రియలైజైన హీరో

Nithiin: నాని, నితిన్ కాంబినేషన్ టైటిల్ గ్లింప్స్.. ఇది అతడి భార్య కథ, వరుస ఫ్లాపుల తర్వాత రియలైజైన హీరో

నాని నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న రెండో చిత్రంగా ‘అలియాస్ రుక్మిణి’ని ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 03 2026, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అలియాస్ రుక్మిణి
Image Credit : Asianet News

అలియాస్ రుక్మిణి

నేచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించనుండగా, చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ధండోరా’ చిత్రంతో గుర్తింపు పొందిన మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టైటిల్ గ్లింప్స్
Image Credit : Asianet News

టైటిల్ గ్లింప్స్

టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను ఆసక్తికరంగా రూపొందించారు. ఇందులో దర్శకుడు మురళీకాంత్ దేవసోత్, పదో తరగతి గణిత ఉపాధ్యాయుడు కృష్ణ కథను వివరిస్తూ కనిపిస్తారు. ఆ పాత్రలో నితిన్ నటిస్తున్నారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ రుక్మిణి అనే కలం పేరుతో రాసిన నవలల ఆధారంగా సాగే పాత్రలను కలల ప్రపంచాన్ని తలపించేలా చూపించారు. దీంతో సినిమా కథ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని గ్లింప్స్ మరింత పెంచింది.

35
రుక్మిణి ఎవరు?
Image Credit : Asianet News

రుక్మిణి ఎవరు?

వీడియోలో మరో ఆసక్తికరమైన మలుపు కూడా ఉంది. కథ చెబుతున్న సమయంలో నాని మధ్యలో కలగజేసుకుని "రుక్మిణి ఎవరు?" అని ప్రశ్నిస్తారు. అందుకు కృష్ణ స్పందిస్తూ "రుక్మిణి నా భార్య" అని చెప్పడం విశేషం. ఆ సన్నివేశానికి జత చేసిన మధురమైన నేపథ్య సంగీతం సినిమా భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉంది. అలాగే వ్రతం వెంకన్న, గరం గోపాల్, ఆమెకు ఆమె అంటే ఇష్టం వంటి కల్పిత నవలల పేర్లను చూపిస్తూ రుక్మిణి పాత్ర స్వభావం, కథనం తీరు గురించి చిన్న చిన్న సంకేతాలను మేకర్స్ అందించారు.వరుస పరాజయాల తర్వాత నితిన్ రూటు మార్చారు. ఇక ఫార్ములా కథలు వర్కౌట్ కావని రియలైజ్ అయిన నితిన్..ఇలా వైవిధ్యమైన కథాంశం ఉన్న చిత్రంతో రాబోతున్నారు.

45
రొమాంటిక్ డ్రామా
Image Credit : facebook.com/ActorNaniOfficial

రొమాంటిక్ డ్రామా

దీప్తి గంట నిర్మిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. భావోద్వేగాలతో పాటు బోల్డ్ అంశాలు కూడా ఈ చిత్రంలో ఉండనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను సోమవారం సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

55
రియలైజైన హీరో
Image Credit : Asianet News

రియలైజైన హీరో

ఈ చిత్రానికి జోమోన్ టి. జాన్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నాని నిర్మాణంలో, కొత్త తరహా కథలతో గుర్తింపు పొందిన దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నితిన్‌కు బలమైన కమ్‌బ్యాక్ మూవీగా నిలుస్తుందనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

Naa BHARYA..my WIFE ❤️ #AliasRukmini Title Reveal Glimpse Out Now.
▶️ https://t.co/AZMe2CkVax

You will talk a lot about this film 🌹

Written & Directed by @Afilmby_Murali @NameisNani 🤗🤗🤗@DeepthiGanta1 @dopjomon @VijaiBulganin @UnanimousProds pic.twitter.com/2e6Nis0HFi

— nithiin (@actor_nithiin) August 3, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Related Stories
Recommended image1
Keerthy Suresh: ఫోక్ సాంగ్ తరహాలో ఉండే ఐటెం సాంగ్.. 4 నిమిషాలకు కోటి రూపాయలు లాగేసుకున్న కీర్తి, నిజమెంత ?
Recommended image2
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved