సమంత శాకుంతలం గ్రాండ్ లాంఛ్... పాల్గొన్న టాలీవుడ్ ప్రముఖులు

First Published Mar 15, 2021, 12:50 PM IST

సమంత ప్రధాన పాత్రలతో తెరకెక్కనున్న చిత్రం శాకుంతలం. దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ శాకుంతలం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతకు జోడిగా మలయాళ యంగ్ హీరో మోహన్ దేవ్ నటిస్తున్నారు. చాలా కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. దర్శకుడు గుణశేఖర్, సమంత, మోహన్ దేవ్, దిల్ రాజు, అల్లు అరవింద్, మణిశర్మ మరియు రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...