- Home
- Entertainment
- సమంత పాత్రతోనే ఆడియెన్స్ ‘ఖుషీ’ అవుతారంట.. కథలో ఈ బ్యూటీదే కీలక పాత్ర.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..
సమంత పాత్రతోనే ఆడియెన్స్ ‘ఖుషీ’ అవుతారంట.. కథలో ఈ బ్యూటీదే కీలక పాత్ర.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫిల్మ్ ‘ఖుషి’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా సమంత రోల్ పై ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ రివీల్ అయ్యాయి.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న 11వ చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) విజయ్ సరసన నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా Kushi రూపొందుతోంది.
తొలిసారిగా విజయ్ - సమంత లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. గతంలో ‘మహానటి’లో వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. మళ్లీ అదే పేయిర్ ను ప్రేక్షకులు ఫుల్ లెంన్త్ లో చూడనున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ చిత్రం టైటిల్ తోనే సినిమా రాబోతోంది.
దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేయగా.. హైదరాబాద్ లో రెండో షెడ్యూల్.. వైజాగ్ లో మూడో షెడ్యూల్ పూర్తయ్యింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రివీల్ అయిన మూవీ టైటిల్, పోస్టర్స్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజయ్ - సామ్ ను ఈ రొమాంటిక్ ఫిల్మ్ లో చూసేందుకు ఫ్యాన్స్, ఆడియెన్స్ ను ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో సమంత రోల్ పైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ అయ్యింది.
కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందనమైన ప్రేమ కథలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సమంత పాత్రనే చాలా కీలకమని తెలుస్తోంది. సమంత క్యారెక్టర్ మునుపెన్నడూ చూడని విధంగా.. చాలా కొత్తగా అనిపిస్తుందని తెలుస్తోంది. సామ్ పాత్రతో రివీల్ అయ్యే ట్విస్ట్ కథకు బలన్ని చేకూర్చుతుందని టాక్.
అంతేకాకుండా సినిమా మొత్తాన్ని సమంత పాత్రనే హైలెట్ గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు శివ కొత్త జోడీతో లవ్ స్టోరీని సరికొత్తగా చూపించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి హీషమ్ సంగీతం అందిస్తున్నారు.