నాగచైతన్య కోసం మేనేజర్‌ని మార్చేసిన సమంత.. అసలు రీజన్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!
సమంత, నాగచైతన్య గతేడాది విడాకుల ప్రకటన చేసి పెద్ద షాకిచ్చారు. అయితే ఆయన జ్ఞాపకాలు అన్నింటిని దూరం పెడుతుంది సమంత. తాజాగా ఆమె తీసుకున్న ఓ పెద్ద నిర్ణయం వెనకాల కూడా అదే కోణం ఉందని టాక్.
నాగ చైతన్యతో సమంత ఏడేళ్ల ప్రేమ, నాలుగేండ్ల వైవాహిక జీవితానికి గతేడాది అక్టోబర్ 2తో ఫుల్‌స్టాప్ పెట్టింది. నాగచైతన్య, సమంత కలిసి తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించారు. టాలీవుడ్‌ని షాక్‌కి గురి చేశారు. ఆ తర్వాత చైతన్యని మర్చిపోయేందుకు, తను మళ్లీ మామూలు వ్యక్తిగా మారేందుకు చాలా స్ట్రగుల్ పడింది సమంత. లోలోపల ఎంతో మానసిక వేదన అనుభవించింది. బయటకు నవ్వుతూ కనిపించినా, ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు తనతో తను ఓ యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
నెమ్మదిగా బయటపడుతున్న సమంత తన పాత జ్ఞాపకాలను దూరం పెడుతుంది. మళ్లీ ఆ రోజులు గుర్తొచ్చి బాధ పడేకంటే దూరంగా ఉంచడమే బెటర్ అని ఫీలవుతుందట. అందులో భాగంగానే నాగచైతన్య తాలుకూ విషయాలను కనిపించకుండా చేసుకుంటుంది. ఇంట్లోని చైతూకి సంబంధించిన వస్తువులన్నీ ఆయనకు తిరిగి పంపించేసినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. పెళ్లిలో కట్టుకున్న శారీ సైతం పంపించినట్టు టాక్.
ఇదిలా ఉంటే తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా మేనేజర్‌నే మార్చేసిందట. టాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీలకు ఓ వ్యక్తి మేనేజర్‌గా ఉన్నాడు. సమంతకి కూడా ప్రారంభం నుంచీ అతనే మేనేజర్. అయితే అతనే నాగచైతన్యకి కూడా మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ విషయంలోనూ దూరంగా ఉండాలనుకుందట సమంత. అందుకే లేటెస్ట్ మేనేజర్‌ని మార్చేసినట్టు తెలుస్తుంది.
అయితే సమంత మేనేజర్‌ని మార్చేయడం వెనకాల మరో కారణం కూడా ఉందని టాక్. ప్రస్తుతం సమంత బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. తెలుగులో భారీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ హిందీలో చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ నార్త్ లో సమంతకి మంచి గుర్తింపు వచ్చింది. పాన్ ఇండియా ఇమేజ్‌ని తీసుకొచ్చింది. అంతేకాదు తన మకాం కూడా ముంబయికి మార్చబోతుంది. అక్కడ కొత్తగా ఓ ఫ్లాట్ కొనబోతుంది సమంత. దాదాపు మూడు కోట్లతో సీ లొకేషన్ ఫ్లాట్‌ని బుక్ చేసినట్టు సమాచారం.
అదే సమయంలో ముంబయికి చెందిన మేనేజర్‌ని అపాయింట్ చేసుకుందట. హిందీలో పలు సినిమాలకు టాక్స్ జరుగుతున్నాయని, దీంతో ముంబయి మేనేజర్ అయితే బాలీవుడ్‌లో ఈజీ అవుతుందని భావించిందట. అందుకే పాత మేనేజర్‌ని మార్చేసి కొత్తగా ముంబయి మేనేజర్‌ని నియమించుకుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడీ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది.
సమంత ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం`, `యశోద` చిత్రాల్లో నటిస్తుంది. మరో బైలింగ్వల్ సినిమా చేయబోతుంది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి `కాతు వాకుల రెండు కాదల్` చిత్రం, ఓ ఇంటర్నేషనల్ మూవీ చేస్తుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ సినిమాలో నటిస్తుందని టాక్. దీంతోపాటు మరోసారి చైతూతో సినిమాకి ప్లాన్ జరుగుతున్నట్టు భోగట్టా.