MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Subham Review : సమంత 'శుభం' మూవీ రివ్యూ

Subham Review : సమంత 'శుభం' మూవీ రివ్యూ

సమంత తొలిసారి నిర్మాతగా రూపొందించిన చిత్రం శుభం. దీనితో ప్రకటనతోనే ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాక వైవిధ్యమైన వినోదాత్మక చిత్రం రాబోతోంది అంటూ అంచనాలు మరింత పెరిగాయి. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

3 Min read
Author : Tirumala Dornala
Published : May 09 2025, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Subham Review

Subham Review

సమంత తొలిసారి నిర్మాతగా రూపొందించిన చిత్రం శుభం. దీనితో ప్రకటనతోనే ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాక వైవిధ్యమైన వినోదాత్మక చిత్రం రాబోతోంది అంటూ అంచనాలు మరింత పెరిగాయి. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. సమంత కూడా గెస్ట్ రోల్ లో నటించారు. మే 9న నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సమంత తొలి ప్రయత్నంలో నిర్మాతగా సక్సెస్ అయ్యారా ? శుభం చిత్రం  మెప్పించే విధంగా ఉందా ? అనేది రివ్యూలో చూద్దాం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Subham Movie

Subham Movie

కథ 

అప్పుడప్పుడే కేబుల్ టీవీలకు బదులుగా జనాలు డిటిహెచ్ లకు అలవాటు పడుతున్న రోజులవి. భీమునిపట్నంలో శ్రీను (హర్షిత్ రెడ్డి) కేబుల్ టీవీ నెట్ నడుపుతుంటాడు. కేబుల్ నెట్ వర్క్ చూసుకుంటూ తన స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. అలాంటి సమయంలో డిష్ కుమార్ అనే వ్యక్తి శ్రీనుకి పోటీగా జనాలకు డిటిహెచ్ లని అలవాటు చేస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీనుకి శ్రీవల్లి (శ్రియ కొంతం) అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. 

సంతోషంగా ఫస్ట్ నైట్ కి రెడీ అయిన శ్రీనుకి భయంకర అనుభవం తన భార్య వల్ల ఎదురవుతుంది. రాత్రి 9 గంటలకు జన్మజన్మల బంధం అనే టీవీ సీరియల్  ప్రారంభం కాగానే శ్రీవల్లి వింతగా ప్రవర్తిస్తుంది. సీరియల్ పూర్తయ్యే వరకు తనని ఏదో ఆత్మ ఆవహించినట్లు శ్రీవల్లి ప్రవర్తిస్తుంది. శ్రీను స్నేహితుల ఇళ్లల్లో కూడా ఇదే పరిస్థితి. ఆడవారి వల్ల భయపడ్డాం అని ఊర్లో తెలిస్తే పరువుపోతుందని బయటకి చెప్పుకోరు. టివి సీరియల్ వస్తున్నంతసేపు తమ భర్తలపై భార్యలు దాడులు చేస్తుంటారు. 

ఊరు మొత్తం ఇదే పరిస్థితి ఉందని తెలిసి శ్రీను అతని స్నేహితులు షాక్ అవుతారు. అసలు ఆ ఊరిలో భార్యలని ఆత్మలు ఎందుకు ఆవహిస్తున్నాయి. అది కూడా జన్మజన్మల సంబంధం టీవీ సీరియల్ సమయంలోనే. టీవీ సీరియల్ కి, ఆత్మలకు సంబంధం ఏంటి ? చివరికి సమంత శ్రీను అతని స్నేహితులకు ఎలా సాయం చేసింది ? లాంటి విషయాలు మూవీ చూసి తెలుసుకోవాలి. 

 

37
Subham Movie

Subham Movie

విశ్లేషణ 

హారర్ కామెడీ చిత్రాలు చాలా వచ్చాయి కానీ.. టీవీ సీరియల్ తో ముడిపడిన  హారర్ కామెడీ కథాంశం శుభం చిత్రంలో చాలా వైవిధ్యంగా ఉంటుంది.  హారర్ కామెడీ చిత్రం అయినప్పటికీ  హారర్ అంశాలు అంతగా ఉండవు. టీవీ సీరియల్ నేపథ్యంతో ఉన్న కథ ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు ప్రవీణ్ స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. ట్విస్ట్ లు ఉన్నప్పటికీ కథనం స్లోగా సాగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన కాన్సెప్ట్ కి మంచి స్క్రీన్ ప్లే తోడై ఉంటే మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉండేది. 

భార్యలు భర్తలపై దాడి చేసే సన్నివేశాలు ప్రతి ఇంట్లో కామన్. దీనితో అవి రిపీట్ అయినట్లు అనిపిస్తాయి. మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతారు. హాస్యం పడించడం కోసం రాసుకున్న సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో కథ వేగం పుంజుకోవడానికి టైం పట్టింది. సినిమా స్లోగా ఉన్నప్పటికీ.. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ని సినిమా మొత్తం క్యారీ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. 

47
Subham Movie

Subham Movie

ఫస్ట్ హాఫ్ లో ఒక దశలో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఆ తర్వాత రిపీట్ సన్నివేశాల రావడం మైనస్ గా మారుతుంది. తిరిగి సెకండ్ హాఫ్ లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు పడ్డాయి. పేపర్ పై ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ దీనితో కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో స్పష్టంగా తడబాటు కనిపిస్తుంది. 

సినిమా మొత్తం ఒకే పాయింట్ పై సాగుతూ ఉండడంతో ప్రేక్షకులు అక్కడక్కడా బోర్ ఫీల్ అవుతారు. కానీ కొన్ని అద్భుతమైన కామెడీ సన్నివేశాలు ఈ చిత్రాన్ని నిలబెట్టాయి. క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే అంశాలు ఉండడం ఈ చిత్రానికి కలసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. 

 

57
Subham Movie

Subham Movie

నటీనటులు 

ఈ చిత్రంలో నటించిన వారంతా దాదాపుగా కొత్త తరం నటీనటులే. దీనితో వారి పెర్ఫార్మెన్స్ కథకి ప్రెష్ నెస్ తీసుకువస్తుంది. హర్షిత్, శ్రియ కొంతం మధ్య కెమిస్ట్రీ, ఇతర సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ ల కామెడీ టైమింగ్ కూడా బావుంది. షాలిని కొండెపూడి, శర్వాని లక్ష్మి కూడా భార్యల పాత్రల్లో నవ్వులు పూయించారు. వీరిద్దరి పాత్రలు కథకి చాలా బలాన్ని చేకూర్చాయి అని చెప్పొచ్చు. 

ఇక సమంత అతిథి పాత్రలో నటిస్తూ తన అనుభవం ప్రదర్శించింది. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగులని సమంత అద్భుతంగా చెప్పింది. అయితే సమంత పాత్ర ఇంకాస్త ప్రభావవంతంగా ఉంటే బాగుండేది. 

 

67
Subham Movie

Subham Movie

టెక్నీషియన్లు 

ముందుగా నిర్మాతగా సమంత తొలి ప్రయత్నం గురించి మాట్లాడుకుంటే.. ఈ చిత్రానికి అవసరమైనట్లుగా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఆ విషయంలో సమంతని అభినందించాల్సిందే. ఇక దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల హాస్యాన్ని, హర్రర్ అంశాలని మిక్స్ చేస్తూ ఈ కథని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. అక్కడక్కడా కథ గ్రిప్ కోల్పోయినప్పటికీ సస్పెన్స్, కామెడీ మైంటైన్ చేసిన విధానం ఆకట్టుకుంది. 

సినిమాటోగ్రఫీ అందించిన మృదుల్ సుజిత్ సేన్ కెమెరా పనితనం చూపించారు. మంచి విజువల్స్ రాబట్టారు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. వివేక్ సాగర్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుంది. 

77
Subham Movie

Subham Movie

ఫైనల్‌గా 

ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా హాస్యం, హారర్ కలగలిపిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలసి ఒకసారి చూడొచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
సినిమా సమీక్షలు
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image2
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Recommended image3
Oh Na Siddayya Song: భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పే పాట.. సోనూసూద్‌ ఆవిష్కరించిన ఓ నా సిద్ధయ్య
Related Stories
Recommended image1
Sai Pallavi: సాయి పల్లవికి ఎందుకు అంత క్రేజ్ ? ఆమె సూపర్ హిట్ చిత్రాల లిస్ట్ ఇదే
Recommended image2
ముసుగేసుకుని పడుకోవడమే.. సందీప్ రెడ్డి వంగా ప్రశ్నకు చిరంజీవి, రాఘవేంద్రరావు అదిరిపోయే ఆన్సర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved