Sai Pallavi: సాయి పల్లవికి ఎందుకు అంత క్రేజ్ ? ఆమె సూపర్ హిట్ చిత్రాల లిస్ట్ ఇదే
Sai Pallavi birthday: మలయాళం లో ప్రేమమ్ చిత్రంతో మాయ చేసిన సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో కూడా సాయి పల్లవికి ఫ్యాన్స్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. నేడు సాయి పల్లవి తన 33 వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Sai Pallavi
Sai Pallavi birthday: మలయాళం లో ప్రేమమ్ చిత్రంతో మాయ చేసిన సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో కూడా సాయి పల్లవికి ఫ్యాన్స్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. నేడు సాయి పల్లవి తన 33 వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో నటించిన సూపర్ హిట్ చిత్రాలు ఏంటి, ఆమెకి యువతలో ఉన్న క్రేజ్ కి కారణం ఏంటి ? ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం.
సాయి పల్లవి కి ఎందుకు అంత క్రేజ్?
సాయి పల్లవి ఇతర హీరోయిన్లతో పోలిస్తే చాలా ప్రత్యేకమైన నటి. సహజ సిద్ధమైన అందం, చలాకీతనం, అద్భుతమైన నటన ఆమె ప్రధాన బలాలు అని చెప్పొచ్చు. గ్లామర్ షో కి దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకుంటూ అభిమానుల మనసు దోచుకుంది. సాయి పల్లవిలో ఫ్యాన్స్ కి నచ్చే మరో అంశం ఆమె డాన్స్. ఇండియన్ సినిమాలో అద్భుతంగా డాన్స్ చేసే హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు.
Sai Pallavi
ఫిదా
టాలీవుడ్ లో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఫిదా. ఈ చిత్రంతో సాయి పల్లవి నిజంగానే తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
ఎంసీఏ
ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో సాయి పల్లవి నేచురల్ స్టార్ నానికి జంటగా నటించింది. ఈ మూవీలో సాయి పల్లవి నానితో కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.
love story movie
లవ్ స్టోరీ
సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన చిత్రం ఇది. ఈ మూవీలో నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించారు. ఎమోషనల్ ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
Thandel
తండేల్
ఈ చిత్రంలో మళ్లీ నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు. దేశభక్తి, ప్రేమ కథ అంశాలతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో చైతు, సాయి పల్లవి కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సాయి పల్లవి నటించిన ఇతర చిత్రాలు
సాయి పల్లవి తెలుగులో పడిపడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం లాంటి చిత్రాల్లో కూడా నటించింది. కాకపోతే అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. తమిళంలో ఆమె మారి 2, అమరన్ లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది.