Samantha Counter: డ్రెస్‌పై ట్రోల్స్.. చిర్రెత్తిపోయిన సమంత.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో.. పోస్ట్ ట్రెండింగ్
సమంత ఇటీవల తరచూ ట్రోల్స్‌కి గురవుతుంది. ముఖ్యంగా ఆమె ధరించే దుస్తులపై ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. దీంతో వారికి సరైన విధంగా బుద్ధి చెప్పింది సమంత. లాంగ్ నోట్‌తో గుబ గుయ్యిమనిపించింది.
సమంత(Samantha) నాగచైతన్యతో విడాకుల తర్వాత మరింత బలంగా మారుతుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. నటిగా, మహిళగా తనని తాను మరింత ప్రకాశవంతంగా చెక్కుకుంటుంది. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారిన సమంత వరుసగా తన గ్లామర్ లుక్‌లో మెరుస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. అందులో భాగంగా సమంత ఇటీవల హాట్ ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేశాయి.
సీసీఎఫ్ అవార్డు వేడుకలో సందడి చేసింది సమంత. ఇందులో గ్రీన్ కలర్ గౌన్‌లో మెరిసింది. డీప్ నెక్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ బ్లాక్ ఫ్లోర్‌లెన్త్ గౌన్ తో సమంత మరింత హాట్‌గా ఉంది. క్లీవేజ్ అందాలతో కనువిందు చేసింది. ఈ పిక్స్ నెటిజన్లని తెగ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సందర్భంగా స్టేజ్‌పైకి వస్తున్న క్రమంలో, అలాగే ఫోటో షూట్‌కి పోజులిస్తున్న సమయంలో డ్రెస్ కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ తనదైన స్టయిల్‌లో బోల్డ్ గా పోజులిచ్చి వాహ్ అనిపించింది సమంత.
ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి ఇంటర్నెట్‌ని షేక్ చేశాయి. నెటిజన్ల బాడీలో హీటు పెంచేశాయి. డైవర్స్ తర్వాత హాట్ షో విషయంలో సమంత రెచ్చిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆమె డ్రెస్‌పై కామెంట్లు చేస్తున్నారు. ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు. Samantha Trolls.
కొందరు సెలబ్రిటీలు కూడా సమంత డ్రెస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేహాశర్మ ఇదేం డ్రెస్ అని కామెంట్ చేస్తే మరొకరు బట్టలు పైన వేసుకోవాలి కాని చీపురులా నేల ఊడవటానికి కాదంటూ సెటైర్లు వేశారు. త్వరగా అవార్డ్ ఫంక్షన్‌కి రావాలన్న తొందరలో బెడ్రూంలోని దుప్పటి కూడా లాక్కొచ్చావా అంటూ సోనాల్‌శర్మ టీజ్ చేస్తున్నారు. విపరీతమైన ట్రోల్స్ చేస్తుండడంతో సమంత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
తనదైన స్టయిల్‌లో గుబ గుయ్‌మనిపించేలా కౌంటర్ ఇచ్చింది. ఓ పెద్ద పోస్ట్ తో నోళ్లు మూయించింది. ఇందులో ఆమె చెబుతూ, `ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షను చూపుతుంటారు. మహిళలు వేసుకునే బట్టల ఆధారంగా చాలా ఈజీగా వారిని జడ్జ్ చేస్తుంటారు. మనం 2022వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా? వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? ఎలా కనిపిస్తున్నారనేదాన్ని బట్టే స్త్రీలను అంచనా వేయడం మానేసి మనపై మనం దృష్టి సారించగలమా? మీ అభిప్రాయాలను రుద్దడం వల్ల ఎవరికీ మేలు జరగదు` అంటూ కౌంటర్ ఇచ్చింది సమంత.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ పోస్ట్ ని సమంత పంచుకోగా, ప్రస్తుతం ఈ పోస్ట్ ట్రెండ్ అవుతుంది. ఇటీవల తరచూ తన డ్రెస్‌పై, లుక్స్ పై కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో అన్నింటిని కలిపి కొట్టింది సమంత. ఫస్ట్ నీ పని నువ్వు చూసుకో అని గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయిపోయారు ట్రోలర్స్.
ప్రస్తుతం సమంత నటిగా ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో `శాకుంతలం`, పాన్ ఇండియా చిత్రం `యశోద`, డ్రీమ్ వారియర్స్ చిత్రం, విజయ్ దేవరకొండతో ఓ సినిమా, హిందీలో ఓ మూవీతోపాటు ఓ అంతర్జాతీయ చిత్రం చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని నటిగా నిలబడుతుంది. తనని తాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటుంది.