నయనతార బర్త్ డేః సమంత పవర్‌ఫుల్ పోస్ట్.. కలలు కన్నది, జయించింది.. `క్వీన్` అంటూ ప్రశంస.. వైరల్
నయనతార లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయన్ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే కేరాఫ్‌గా నిలుస్తుంది. స్టార్ హీరోలకు దీటుగా రాణిస్తుంది. తాజాగా ఆమెపై సమంత ప్రశంసలు కురిపించారు. ఎమోషన్ పోస్ట్ షేర్ చేశారు.
నయనతార(Nayanathara) నేడు గురువారం(నవంబర్ 18)న తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అనేక మంది సెలబ్రిటీలు ఆమెకి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అదే సమయంలో పుట్టిన రోజుని కూడా బాగానే సెలబ్రేట్ చేసుకుంది నయనతార. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `కాథు వాకుల రెండు కాధల్` చిత్ర సెట్‌లో నయనతార బర్త్ డే సెలబ్రేట్ చేసింది యూనిట్. ఆమె చేత భారీ కేక్‌ని కట్ చేయించారు. అయితే ఇందులో Nayanathara ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ కూడా ఉండటం విశేషం. nayanathara birthday celabration with samantha
ప్రియుడి సమక్షంలోనే నయనతార బర్త్ డే కేక్ కట్టింగ్ జరిగింది. విఘ్నేష్ స్వయంగా ఆ ఏర్పాట్లు చేయడం విశేషం. అంతేకాదు ఈ సినిమాకి తనే దర్శకుడు కూడా. అయితే ఇందులో విఘ్నేష్‌తోపాటు మరోనటుడు విజయ్ సేతుపతి, హీరోయిన్ సమంత కూడా ఉన్నారు. దగ్గరుండి మరీ వీరంతా నయనతార చేత కేక్ కట్ చేయించారు. ఆ పిక్స్ ని విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకుని కాబోయే భార్యకి విషెస్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా సమంత సైతం ఎమోషనల్ అయ్యింది. నయనతార జర్నీని ఒక్క మాటలో చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బర్త్ డే కేక్ కట్ చేస్తున్న సందర్బంగా నయనతారతో దిగిన ఫోటోలను పంచుకుంటూ ఆమెకి విషెస్ చెప్పడం విశేషమైతే. ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్‌గా మారింది. నయనతార జర్నీని వర్ణించిన తీరు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.
ఇందులో సమంత(Samantha) చెబుతూ, `ఆమె వచ్చింది.. ఆమె చూసింది..ఆమె ధైర్యం చేసింది.. ఆమె కలలు కన్నడి.. ఆమె ప్రదర్శించింది.. ఆమె జయించింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు నయన్` అని పేర్కొంది సమంత. అంతేకాదు ఇందులో నయనతారని ఆమె క్వీన్‌గా అభివర్ణించడం విశేషం. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
నయనతార.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇక నయనతార ప్రస్తుతం ప్రియుడి సినిమాతోపాటు జీఎస్ విక్నేష్ చిత్రం, అట్లీ రూపొందిస్తున్న బాలీవుడ్ ఫిల్మ్, మలయాళంలో `గోల్డ్`, తమిళంలో `కనెక్ట్ `చిత్రాలు చేస్తుంది. తెలుగులో చిరంజీవితో `గాడ్‌ఫాదర్` సినిమా చేస్తుంది. `సైరా` తర్వాత మరోసారి చిరుతో ఆడిపాడబోతుంది నయన్.
ఇటీవల చైతూకి విడాకులిస్తున్నట్టు ప్రకటించిన షాకిచ్చిన Samantha ఆ బాధ నుంచి బయటపడుతూ ముందుకు సాగుతుంది. రెట్టింపు ఉత్సాహంతో కొత్త ప్రాజెక్ట్ లతో రాబోతుంది. ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం` సినిమా చేసింది సమంత. వీటితోపాటు మరో రెండు బైలింగ్వల్ చిత్రాలను ప్రకటించింది.
also read: Nayanatara:ప్రియుడు విగ్నేష్ శివన్ కౌగిలిలో ఒదిగిపోయిన నయనతార... బర్త్ డే వేడుకలలో రెచ్చిపోయిన జంట!