Nayanatara:ప్రియుడు విగ్నేష్ శివన్ కౌగిలిలో ఒదిగిపోయిన నయనతార... బర్త్ డే వేడుకలలో రెచ్చిపోయిన జంట!
ముద్దుల ప్రేయసి నయనతార బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాడు విగ్నేష్ శివన్ (Vignesh shivan). భారీ కేక్ తీసుకువచ్చి, బాణాసంచా కాంతులలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. అర్థరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు నయనతార కేక్ కట్ చేశారు.
నవంబర్ 18న జన్మించిన నయనతార (Nayanatara birthday) నేడు 37వ ఏట అడుగుపెట్టారు. లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ని ఏలేస్తున్న ఈ బ్యూటీ బర్త్ డే వేడుకలను ఫ్యాన్స్ ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. చిత్ర ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.
ఇక నయనతార జన్మదినం ప్రియుడు విగ్నేష్ శివన్ కి ఎంతో ప్రత్యేకం. దీనితో దగ్గరుండి ఆమె బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. పన్నెండు గంటలు కాగానే... ఆకాశంలో భారీగా తారాజువ్వల కాంతి కమ్ముకుంది. కేక్ కట్ చేసిన నయనతార.. ముందుగా విగ్నేష్ శివన్ కి తినిపించారు.
ప్రతి ఏడాది ఈ జంట బర్త్ డే వేడుకల కోసం గోవా లాంటి రొమాంటిక్ ప్రదేశానికి చెక్కేస్తారు. ఈ సారి మాత్రం చెన్నైలోనే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇద్దరిలో ఎవరి బర్త్ డే అయినా... ఏకాంతంగా సుదూర ప్రాంతానికి వెళ్లి జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది.
దాదాపు ఆరేళ్లుగా నయనతార-విగ్నేష్ డేటింగ్ చేస్తున్నారు. ఈ మధ్య నిశితార్థం కూడా జరుపుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం విగ్నేష్ దర్శకత్వంలో ఓ తమిళ్ చిత్రాన్ని నయనతార చేస్తున్నారు. ఈ మూవీలో సమంత, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు.
ఇక షారుక్ ఖాన్ (Shahrukh khan)- అట్లీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుంది నయనతార. వీరి కాంబినేషన్ తెరకెక్కుతున్న లయన్ మూవీలో నయనతార హీరోయిన్. షూటింగ్ కూడా మొదలు కాగా.. నయనతార ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
అలాగే చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ (Godfather)మూవీలో సైతం నయనతార హీరోయిన్ గా ఎంపికయ్యారు. చిత్ర యూనిట్ నేడు దీనిపై స్పష్టత ఇచ్చారు.
మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన రజినీకాంత్ (Rajinikanth)అన్నాత్తే చిత్రంతో మరో సూపర్ హిట్ కొట్టింది.
Also read Sreemukhi: కాసుకో అనసూయ శ్రీముఖి వచ్చేస్తుంది... ఉత్కంఠ రేసులో గెలుపెవరిదో?
Also read RRR vs Bheemla nayak: పవన్ ధీమా అదే... అందుకే ఆర్ ఆర్ ఆర్ తో ఢీ!