MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'శాకుంతలం' ఎఫెక్ట్.. ఇక హిరణ్యకశ్యప పరిస్థితి ఏంటి.. రానా తెలివిగా తప్పించుకున్నాడా ?

'శాకుంతలం' ఎఫెక్ట్.. ఇక హిరణ్యకశ్యప పరిస్థితి ఏంటి.. రానా తెలివిగా తప్పించుకున్నాడా ?

పౌరాణిక చిత్రాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఈ సమయంలో పౌరాణిక చిత్రాలు తెరకెక్కించి మెప్పించడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే ఆ చిత్రాలు భారీగా విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అవుతాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 15 2023, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పౌరాణిక చిత్రాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఈ సమయంలో పౌరాణిక చిత్రాలు తెరకెక్కించి మెప్పించడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే ఆ చిత్రాలు భారీగా విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అవుతాయి. ప్రొడక్షన్ కాస్ట్ తారా స్థాయికి చేరుతుంది. పౌరాణిక పాత్రల్లో సెట్ అయ్యే నటీనటులు కూడా కావాలి. 

26

కానీ గుణశేఖర్ సాహసం చేస్తూ సమంతతో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని 'శాకుంతలం' గా తెరకెక్కించారు. కాళిదాసు రచించిన అభిఙ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రన్ని రూపొందించారు. గుణశేఖర్ ఎక్కువ సమయం తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అవుట్పుట్ బావుంటుందని అంతా ఆశించారు. 

36

పైగా సమంత ప్రధాన పాత్రలో నటించడంతో ఆసక్తి ఇంకా పెరిగింది. సమంత నటనతో ఈ చిత్రం మరో స్థాయికి చేరుతుందని అంతా భావించారు. కానీ గుణశేఖర్ టివి సీరియల్ లాంటి స్క్రీన్ ప్లే తో మొత్తం నీరుగార్చారు అంటూ విమర్శలు వినిపిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి పూర్తిగా శాకుంతలం చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అనే అంచనాలు మొదలయ్యాయి. 

46

ఈ నేపథ్యంలో గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ హిరణ్య కశ్యప పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. గుణశేఖర్ ఎంతో ఆశపడి తెరకెక్కించాలనుకున్న మరో పౌరాణిక చిత్రం ఇది. రాక్షస చక్రవర్తి అయిన హిరణ్య కశ్యపని ప్రధాన పాత్రగా హైలైట్ చేయాలని గుణశేఖర్ భావించారు. చాలా ఏళ్లుగా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు.  

56

రానా దగ్గుబాటిని హిరణ్య కశ్యప పాత్రలో ఎంపిక కూడా చేశారు. సురేష్ బాబు నిర్మాతగా ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ వర్క్ కూడా మొదలైంది. కానీ ఏమైందో ఏమో కానీ ఈ చిత్రం నుంచి రానా తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ గుణశేఖర్ మాత్రం ఈ చిత్రం తప్పకుండా ఉంటుంది అని.. హీరో ఎవరనేది తర్వాత డిసైడ్ అవుతుందని చెబుతూ వచ్చారు. 

66

కానీ శాకుంతలం రిజల్ట్ చూశాక హిరణ్య కశ్యప ప్రాజెక్టు ముందుకెళ్లడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శాకుంతలం చిత్రంపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ.. విజువల్ ఎఫెక్ట్స్. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కార్టూన్ వర్క్ లా ఉంది అంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ లో హిరణ్య కశ్యప చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ఇదే రకమైన అవుట్ పుట్ వస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూబ్యూట్ షేక్‌
Recommended image2
55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
RB Choudary: దళపతి విజయ్‌ తో భారీ ప్లాన్, కోరిక తీరకుండానే ఆర్.బి.చౌదరి కన్నుమూత..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved