- Home
- Entertainment
- Samantha: సహనం నశిస్తుంది, మౌనం అంగీకారంగా తీసుకోకు... సమంత డైరెక్ట్ వార్నింగ్ ఇన్ డైరెక్ట్ గా వాళ్లకేనా!
Samantha: సహనం నశిస్తుంది, మౌనం అంగీకారంగా తీసుకోకు... సమంత డైరెక్ట్ వార్నింగ్ ఇన్ డైరెక్ట్ గా వాళ్లకేనా!
సమంత మాస్ వార్నింగ్ విసిరింది. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగింది. నాతో పెట్టుకోవద్దు, నాజోలికి రావద్దు, నా సహనం నశిస్తే మాములుగా ఉండదని ఫైర్ అయ్యింది. ప్రస్తుతం సమంత ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది.

Samantha
సమంత-నాగ చైతన్య (Naga Chaitanya)విడాకుల తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. సమంత ఫ్యాన్స్ నాగ చైతన్యను తప్పుబడితే, చైతూ ఫ్యాన్స్ సమంతను ఆడిపోసుకున్నారు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలదే తప్పున్నట్లు చూసే సమాజం సమంతను టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా అనేక పోస్ట్స్ వెలిశాయి. మీడియాలో అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి.
నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై సమంత చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెకు మిశ్రమ ఫలితాలొచ్చాయి.
మరోవైపు సమంత (Samantha)తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పరోక్షంగా నాగ చైతన్యను టార్గెట్ చేస్తూ పోస్ట్స్ పెట్టేవారు. ఆమె కొటేషన్స్, లైన్స్ నాగ చైతన్య తనకు ఏదో అన్యాయం చేశాడన్నట్లు ఉండేవి. డైరెక్ట్ గా ఎటువంటి ఆరోపణలు చేయని సమంత ఇన్ డైరెక్ట్ గా నాగ చైతన్యను ఉద్దేశిస్తూ విమర్శలు చేసేవారు. సమంత పోస్ట్స్ కి చైతూ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూ ఉండేవారు.
Samantha
నాగ చైతన్య మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఆయన సమంతను ఉద్దేశిస్తూ ఎన్నడూ సోషల్ మీడియా పోస్ట్స్ చేయలేదు. మరి మౌనంగా ఉంటూనే చైతన్య సమంతను ఇబ్బంది పెడుతున్నాడా? ఆమెను టార్గెట్ చేస్తున్నాడా?. ఈ విషయంలో క్లారిటీ లేదు. కొన్నాళ్లుగా సమంత పరోక్షంగా పోస్ట్స్ పెట్టడం కూడా మానేశారు. తాజాగా ఆమె మరలా స్టార్ట్ చేశారు.
Naga Chaitanya
ఇటీవల తన ఒంటిపై ఉన్న టాటూలను గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంటిపై టాటూలు వేయించుకోవడం పెద్ద మిస్టేక్ గా ఆమె అభివర్ణించారు. సమంత ఒంటిపై నాగ చైతన్య పేరు పచ్చబొట్టుగా ఉంది. చట్టబద్ధంగా విడిపోయినా నచ్చని వ్యక్తుల జ్ఞాపకాలు ఒంటిపై ఉన్నాయన్న అర్థంలో సమంత ఆ కామెంట్ చేశారు.
నేడు సడన్ గా ఏమైందో తెలియదు కానీ, ఓ సీరియస్ ట్వీట్ చేశారు. ''మౌనంగా ఉంటున్నానని పట్టించుకోవడం లేదనుకోకు, స్పందించడం లేదని అంగీకరిస్తానని అనుకోకు, నా దయా హృదయాన్ని బలహీనతగా తీసుకోకు... నా దయాగుణం నశించే రోజూ కూడా ఉంటుంది'' అంటూ ట్వీట్ చేసింది.
నువ్వేమి చేసినా చూస్తూ ఊరుకుంటానని అనుకోకు.. నేను నోరు విప్పిననాడు మాములుగా ఉండదు... ఇది షార్ట్ గా సమంత ఇచ్చిన వార్నింగ్. ఈ వార్నింగ్ సమంత ఎవరికి ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? అనేది స్పష్టంగా తెలియదు. నెటిజెన్స్ మాత్రం నాగార్జున ఫ్యామిలీకే అన్వయిస్తున్నారు. నాగ్ ఫ్యామిలీ పైనే సమంత ఫైర్ అయ్యారంటున్నారు. కాజల్ బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో సమంతను కొందరు విమర్శిస్తున్నారు. కాజల్ మంచి అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకొని పిల్లలు కన్నది, కొందరు మాత్రం విడాకులు తీసుకుంటారు.. అంటూ పరోక్ష విమర్శలు చేస్తున్నారు. మరి ఆ తాలూకు కోసం సమంత ఇలా చుపరేమో తెలియదు.