- Home
- Entertainment
- పిల్లల కోసం తపించిన సమంత.. చైతూతో విడాకులకు ముందు అసలు ప్లాన్ అదేనట.. షాకింగ్ విషయాలు వెల్లడి
పిల్లల కోసం తపించిన సమంత.. చైతూతో విడాకులకు ముందు అసలు ప్లాన్ అదేనట.. షాకింగ్ విషయాలు వెల్లడి
సమంత ఇప్పుడు ఎమోషనల్‌గా చాలా బ్యాడ్ పొజీషన్‌లో ఉంది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం ఆమె తీవ్ర స్థాయిలో మనో వేదన అనుభవిస్తుంది. అందుకు శుక్రవారం పంచుకున్న పోస్టే నిదర్శనమని చెప్పొచ్చు. అయితే సమంత మనసులో ఉన్న అసలైన సీక్రెట్ ప్లాన్ ఇప్పుడు బయటకు వచ్చింది.

సమంత-నాగచైతన్య విడాకుల ప్రకటన వారి అభిమానులను మాత్రమే కాదు, సాధారణ సినీ ప్రియులను సైతం కలచి వేసింది. జీర్ణించుకోలేని విధంగా చేసింది. ఇప్పటికీ వీరిద్దరు విడిపోయారంటే నమ్మకలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. చిలుకా గోరెంకలుగా, అన్యోన్య దంపతులుగా ఉండే వీరిద్దరు విడిపోవడం నిజంగా చాలా బాధాకరం.
`మనం ఒకటి అనుకుంటే, దేవుడు ఇంకోటి అనుకుంటాడు` అనే డైలాగ్ చాలా పాపులర్. ఇందులో నిజమెంతా అనేది పక్కన పెడితే, నాగచైతన్య, సమంతల విషయంలో అదే జరిగిందని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. నిజానికి సమంత, నాగచైతన్యల అసలు ప్లాన్ వేరే ఉందట. `శాకుంతలం` సినిమా షూటింగ్ తర్వాత వాళ్లు మరో ప్లాన్ చేసుకున్నారట. కానీ ఆగస్ట్ నెలలో ఏం జరిగిందనేది ఇప్పుడు సస్సెన్స్ గా మారింది. ఆ టైమ్‌లో వాళ్లిద్దరి మధ్య జరిగిన సంఘటనలే వారి విడాకులకు కారణమయ్యాయని అంటున్నారు `శాకుంతలం` సినిమా నిర్మాత, దర్శకుడు గుణశేఖర్ తనయ నీలిమ గుణ.
సమంత ప్రధాన పాత్రలో, గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతుంది. ఆమె `మాస్టర్ భరత` పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత నీలిమ గుణ ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఇందులో అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది.
Samantha
సమంత, చైతూ పిల్లలు కనేందుకు ప్లాన్ చేశారని తెలిపింది. ఆ సీక్రెట్ ప్లాన్‌లో భాగంగానే సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నారట. మొదట `శాకుంతలం` సినిమాని కూడా ఒప్పుకోలేదని, కానీ కథ విన్నాక, బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ తర్వాత పిల్లలు కనాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది నీలిమ గుణ.
naga chaitanya samantha
`శాకుంతలం` సినిమా కోసం గుణశేఖర్ సమంతని సంప్రదించినప్పుడు తాను సినిమాలు చేయడం లేదని, పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపిందని, అప్పటికే సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. కానీ `శాకుంతలం` కథ నచ్చి ఓకే చెప్పిందని, కాకపోతే షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనే కండీషన్ పెట్టిందట. ఆ కండీషన్ ప్రకారమే సినిమా షూటింగ్ పూర్తి చేశామని తెలిపింది నీలిమ గుణ.
`శాకుంతలం` తర్వాత గ్యాప్ తీసుకుని ప్రెగ్నెంట్ ప్లాన్‌కి రెడీ అయ్యారని, అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగస్ట్ నెలలో ఏం జరిగిందనేది సస్పెన్స్ గా మారిందని, ఆ టైమ్‌లో వారి మధ్య జరిగిన విషయాలే విడాకులకు కారణమని తెలిపింది. సమంత నెక్ట్స్ ప్లాన్ పిల్లలే అని, కానీ ఉన్నట్టుండి విడాకులు ప్రకటించడం ఇప్పుడు తనని సైతం షాక్‌కి గురి చేస్తుందని చెప్పింది నీలిమ. ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పింది.
2017అక్టోబర్ 6,7తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్య సరిగ్గా నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాక్‌కి గురి చేశారు. ఆ తర్వాత దీనిపై వీరిద్దరు సైలెంట్‌గా ఉన్నాయి. అయితే సమంతపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల స్పందించి ఫైర్ అయ్యింది. మీడియా కథనాలను టార్గెట్ చేస్తూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
తనని కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని, తన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని మండిపడింది. తనపై చూపిస్తున్న దయ, జాలికి ధన్యవాదాలని, ఇక వాటిని ఆపాలని తెలిపింది. తాను అబార్షన్స్ చేయించుకున్నానని, పిల్లల్ని కనేందుకు ఆసక్తిగా లేనని, అందుకే చైతూతో విడాకులు తీసుకున్నట్టు కథనాలు రాస్తున్నారని తెలిపింది సమంత. తనని ఒంటరిగా వదిలేయమని వేడుకొంది. విడాకులు తీసుకోవడం చాలా పెయిన్‌తో కూడిన విషయమని, ఇలాంటి క్లిష్ట సమయంలో తనపై ఈరకంగా దాడులు చేయడం దారుణమని, కానీ తనని ఎవరూ ఏం చేయలేరని స్పష్టం చేసింది సమంత.