Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంతకు క్రయోథెరఫీ... ఏమిటీ ట్రీట్మెంట్? ఎందుకో తెలిస్తే షాక్!
సమంత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమెకు గత ఏడాది మయోసైటిస్ సోకింది. ఈ వ్యాధికి సుదీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఆమె క్రయోథెరఫీ చేయించుకున్నారు.
Samantha
సమంత అనతికాలంలో స్టార్ అయ్యారు. 2010లో ఏమాయ చేసావే మూవీతో సమంత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సమంతకు వరుస ఆఫర్స్ వచ్చాయి. బిగినింగ్ లోనే ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. 13 ఏళ్లకు పైగా సాగుతున్న కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు.
తన ఫస్ట్ మూవీ హీరో నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో గోవా వేదికగా సమంత-నాగ చైతన్యల వివాహం జరిగింది. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత-చైతన్య అనూహ్యంగా విడిపోయారు. 2021 అక్టోబర్ లో సమంత-చైతూ అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు.
Samantha
సమంత కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. విడాకులు సమంతను మానసిక వేదనకు గురి చేశాయి. ఆ బాధ నుండి బయటపడింది అనుకుంటే... మరో సమస్య ఆమెను వెంటాడుతుంది. సమంతకు అరుదైన మయోసైటిస్ వ్యాధి సోకింది. దీని వలన కండరాల వాపు, నొప్పి, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.
Samantha
2022 అక్టోబర్ లో సమంత తన అనారోగ్య సమస్య బయటపెట్టింది. ఇది ప్రాణాంతకం కాదు. నేను వెంటనే చనిపోవడం లేదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను ఈ వ్యాధితో పోరాటం చేయాల్సి ఉందని సమంత అన్నారు. కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైన సమంత చికిత్స తీసుకుంది.
తాజాగా ఆమె క్రయోథెరపీ చేయించుకున్నారట. క్రయోథెరఫీ అనగా గడ్డకట్టించే చల్లని నీళ్లతో శరీరాన్ని తడపాలి. అత్యంత కోల్డ్ వాటర్ ఉన్న టబ్ లో గొంతు మునిగి కొన్ని నిమిషాల పాటు ఉండాలి. శరీరాన్ని అత్యంత చల్లని నీటిలో ఉంచడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అలాగే కొన్ని సమస్యలు ఇది ట్రీట్మెంట్.
మయోసైటిస్ వ్యాధి వలన కండరాల నొప్పి, వాపు వంటి సమస్యలు ఏర్పడతాయి. క్రయోథెరపీ కండరాల నొప్పి, వాపు తగ్గిస్తుందట. అలాగే అసహజమైన, అనారోగ్య పూరితమైన కణజాలంను నాశనం చేస్తుందట. మయోసైటిస్ సోకిన వాళ్లకు క్రయోథెరఫీ గొప్ప ట్రీట్మెంట్ అని సమాచారం. అందుకే సమంత ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారట.
కాగా సమంత ఈ ఏడాది శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదల చేసింది. శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. ఖుషి ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సిటాడెల్ సిరీస్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది.