Samantha Ruth Prabhu : సామ్ స్టైలిష్ లుక్ కు ఇంటర్నెట్ షేక్... ఆ స్టిల్స్ చూశారా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) లేటేస్ట్ లుక్ కు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ఉన్నట్టుండి సామ్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. సినిమాసినిమాతో మరింత ఎత్తుకు ఎదుగుతోంది. అదే సమయంలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటోంది.
దక్షిణాదిలో సామ్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ‘ఫ్యామిలీ మెన్‘ త్వరలో సిటాడెట్ (citadel) వంటి క్రేజీ సీరిస్ తో రాబోతోంది.
ఈ ప్రాజెక్ట్స్ తో సమంత బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే అక్కడ వరుసగా ఆఫర్లు అందుకుంటున్న క్రమంలోనే సామ్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే.
మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకునేందుకు సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా నయా లుక్స్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది.
అదిరిపోయే అవుట్ ఫిట్లలో సామ్ ఆకట్టుకుంటోంది. నయా ఫ్యాషన్ ను తన అభిమానులకు పరిచయం చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసి మంత్రముగ్ధులను చేసింది.
వైట్ బ్లేజర్ సూట్ లో దగదగ మెరిసిపోయింది. ట్రెండీ లుక్ తో స్టైలిష్ స్టిల్స్ తో వింటేజ్ సామ్ ను గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మరాయి.