MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Samantha: కన్నీటి కష్టాలని గుర్తు చేసుకున్న సమంత..పెంపుడు పిల్లికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా అదే

Samantha: కన్నీటి కష్టాలని గుర్తు చేసుకున్న సమంత..పెంపుడు పిల్లికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా అదే

ఆ సమయంలో నేను తినే ఆహారమే నా జబ్బును ట్రిగ్గర్ చేసేది. నా జీర్ణవ్యవస్థలో చిన్న తేడా వచ్చినా మయోసైటిస్ సమస్య పెరిగిపోయేది. అందుకే, నేను చాలా కఠినమైన డైట్ పాటించాల్సి వచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 19 2026, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సమంత
Image Credit : Instagram

సమంత

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్, కోట్ల హృదయాలను గెలుచుకున్న సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఈసారి తన సినిమాతో పాటు, తన ఆరోగ్యం గురించి పంచుకున్న బాధాకరమైన విషయాలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సమంత బాగా బరువు తగ్గడంతో అభిమానుల ఆందోళన
Image Credit : others

సమంత బాగా బరువు తగ్గడంతో అభిమానుల ఆందోళన

గత కొంతకాలంగా సమంత బాగా బరువు తగ్గడంతో అభిమానులు ఆందోళన చెందారు. "ఎందుకింత సన్నగా అయిపోయారు?" అనే ప్రశ్నకు సమంత ఇప్పుడు ఎమోషనల్‌గా సమాధానం ఇచ్చారు.
37
నేను తినలేకపోతున్నాను
Image Credit : Asianet News

నేను తినలేకపోతున్నాను

సమంత తన కొత్త సినిమా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) ప్రమోషన్లలో, తాను ఎదుర్కొంటున్న 'మయోసైటిస్' (Myositis) అనే ఆటోఇమ్యూన్ వ్యాధి తీవ్రత గురించి మాట్లాడారు. "నన్ను చూసినప్పుడల్లా, ఎందుకింత బరువు తగ్గారని అడుగుతున్నారు. కానీ ఒకరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నాకు తినాలని లేదు అని కాదు, నేను తినలేకపోతున్నాను" అని సమంత తన మనసులోని మాట చెప్పారు.
47
ఆ రెండేళ్లు సమంతకు నరకంలా గడిచాయి
Image Credit : stockPhoto

ఆ రెండేళ్లు సమంతకు నరకంలా గడిచాయి

సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆ రెండేళ్లు సమంతకు నరకంలా గడిచాయి. "ఆ సమయంలో నేను తినే ఆహారమే నా జబ్బును ట్రిగ్గర్ (Trigger) చేసేది. నా జీర్ణవ్యవస్థలో (Gut) చిన్న తేడా వచ్చినా నా మయోసైటిస్ సమస్య పెరిగిపోయేది" అని సమంత వివరించారు.
57
చాలా కఠినమైన డైట్
Image Credit : Instagram

చాలా కఠినమైన డైట్

"అందుకే, నేను చాలా కఠినమైన డైట్ పాటించాల్సి వచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు నేను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడూ పూటలా ఒకే రకమైన రుచి లేని, చప్పటి ఆహారం తినాల్సి వచ్చింది" అని తన కష్టాన్ని చెప్పుకొచ్చారు.
67
పెంపుడు పిల్లికి 'జెలాటో' అని పేరు
Image Credit : Instagram

పెంపుడు పిల్లికి 'జెలాటో' అని పేరు

సమంత తన పెంపుడు పిల్లికి 'జెలాటో' (Gelato) అని పేరు పెట్టారు. ఈ పేరు వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆహారంపై కఠినమైన ఆంక్షలు ఉన్న సమయంలో, డాక్టర్లు సమంతకు చక్కెర, పాలు లేని 'జెలాటో' ఐస్‌క్రీమ్ తినడానికి అనుమతి ఇచ్చారట. ఏళ్ల తర్వాత ఆమె తిన్న మొదటి రుచికరమైన ఆహారం అదే. ఆ క్షణం గుర్తుగా తన పిల్లికి జెలాటో అని పేరు పెట్టుకున్నారు.
77
సమంతకు కంబ్యాక్ మూవీ
Image Credit : Samantha\Instagram

సమంతకు కంబ్యాక్ మూవీ

2022లో 'యశోద' సినిమా ప్రమోషన్లప్పుడు తనకు మయోసైటిస్ ఉందని సమంత బయటపెట్టారు. అప్పటి నుంచి ఆమె ధైర్యంగా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఇప్పుడు ఆమె కోలుకుంటున్నారు.తాజాగా సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సమంతకు కంబ్యాక్ మూవీ అవుతుంది అని అంతా భావిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image3
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Related Stories
Recommended image1
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved