MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్

Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్

సూపర్ స్టార్ కృష్ణని ఎంతగానో ప్రేమించిన హీరోయిన్ ఒకరున్నారు. కృష్ణపై ఆమె ప్రేమని తెలుసుకున్న విజయ నిర్మల ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 19 2026, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Super Star Krishna
Image Credit : Asianet News

Super Star Krishna

నటి కవిత టాలీవుడ్ లో హీరోయిన్ గా అప్పట్లో మంచి గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, కృష్ణ, చంద్రమోహన్, మురళీ మోహన్, శోభన్ బాబు లాంటి హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అదే విధంగా కీలక పాత్రల్లో కూడా కవిత నటించారు. సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్ గా ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. కృష్ణతో తాను వరుసగా 7 సినిమాల్లో హీరోయిన్ గా నటించినట్లు కవిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కృష్ణ అంటే పిచ్చి ప్రేమ నాకు
Image Credit : Asianet News

కృష్ణ అంటే పిచ్చి ప్రేమ నాకు

కవిత మాట్లాడుతూ కృష్ణపై తనకున్న ప్రేమ, క్రష్ గురించి ఓపెన్ గా బయటపెట్టారు. పెళ్లి చేసుకుంటే కృష్ణ లాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని అనుకునేదాన్ని. అంతలా కృష్ణ గారిపై నాకు క్రష్ ఉండేది. ఆయనంటే నాకు పిచ్చి. కానీ ఆయన దగ్గరుంటే మాత్రం భయంతో బిగుసుకుపోయేదాన్ని అని కవిత అన్నారు.

35
కృష్ణగారితో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్
Image Credit : Asianet News

కృష్ణగారితో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్

కృష్ణపై నాకున్న ఇష్టాన్ని చూసి ఆయన భార్య విజయనిర్మల గారే నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవారు. ఆమె నన్ను కపిత అని ఆటపట్టిస్తూ పిలిచేవారు. అంటే కోతిలా అల్లరి చేసేదాన్ని అని అర్థం. ఒక రోజు షూటింగ్ లో ఏ కపిత ఇలా రా అని విజయనిర్మల గారు పిలిచారు. ఆయనపై నీకు ప్రేమ ఉంది కదా.. ఈ రోజు ఆయనతో నీకు రొమాంటిక్ సీన్ ఉంది.. వెళ్లి దున్నేయ్ అని అనేశారు. నేను సిగ్గుతో చచ్చిపోయా.

45
ఆయన ముందు నిలబడాలంటే ధైర్యం సరిపోదు
Image Credit : Asianet News

ఆయన ముందు నిలబడాలంటే ధైర్యం సరిపోదు

అందరు హీరోలతో నేను చాలా సరదాగా ఉండేదాన్ని. కానీ నేను ప్రేమించి, ఎంతో అభిమానించిన కృష్ణ గారి ముందు నిలబడడానికి నాకు ధైర్యం సరిపోయేది కాదు. ఆ విధంగా కృష్ణ గారితో నాకు అద్భుతమైన మెమొరీస్ ఉన్నాయి అని కవిత అన్నారు.

55
నా కోసమే ఆ సినిమా క్రియేట్ చేశారు
Image Credit : Asianet News

నా కోసమే ఆ సినిమా క్రియేట్ చేశారు

డాక్టర్ సినీ యాక్టర్, చెప్పింది చేస్తా, ఇద్దరూ అసాధ్యులే లాంటి సినిమాల్లో కవిత కృష్ణతో నటించారు. నాకు కృష్ణ గారు అంటే పిచ్చి ఇష్టం అని తెలుసుకున్న తర్వాతే విజయ నిర్మల గారు డాక్టర్ సినీ యాక్టర్ కథని రాశారు. నా కోసమే ఆ కథ రాసినట్లు ఆమె తెలిపారని కవిత గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
కృష్ణ ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Recommended image2
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image3
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Related Stories
Recommended image1
మొన్న మెగాస్టార్ మూవీలో ఛాన్స్, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్..బిగ్‌బాస్ తెలుగు 10లోకి నందూస్ వరల్డ్ నందన..?
Recommended image2
Best Horror Films: టాలీవుడ్ లో దుమ్ములేపిన టాప్ 5 హారర్ మూవీస్..కష్టాల్లో ఉన్న హీరోకి అదిరిపోయే కంబ్యాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved