సమంత , రాజ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డేట్? పికిల్‌బాల్ ఆడుతూ కనిపించిన కొత్త జంట
సమంత రూత్ ప్రభు తన భర్త రాజ్ నిడిమోరుతో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆస్వాదిస్తోంది. చెట్టాపట్టాలేసుకుని కొత్తజంట హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా సమంత, రాజ్ నగరంలో పికిల్‌బాల్ ఆడుతూ కనిపించారు.

చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కొత్త జంట..
సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నచ్చిన ప్రదేశాలకు వెళ్తు..నచ్చిన ఆటలు ఆడుతూ.. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తాజాగా సమంత తన భర్త రాజ్ తో కలిసి రొమాంటిక్ స్పోర్ట్స్ డేట్ చేసింది. ఈ వీడియోలో సమంత, రాజ్ డబుల్స్ ఆడుతూ కనిపించారు. కొన్ని షాట్లు మిస్ అయినా, వాళ్ళ సమన్వయం ఈ వీడియోకి హైలైట్. ఈ జంటను చూసి చాలా మంది అభిమానులు హార్ట్ ఎమోజీలతో స్పందించారు.
Samantha Ruth Prabhu & Raj Nidimoru serving couple goals with smiles, comfort, and calm love. ❤️✨#SamanthaRuthPrabhu#RajNidimoru#CoupleGoals#CelebrityLovepic.twitter.com/gSnTx2Zowd
— Thegossipgully.com (@thegossipgully) January 17, 2026
భర్తతో కలిసి మొదటి సంక్రాంతి..
భర్త రాజ్ నిడిమోరుతో తన మొదటి సంక్రాంతి పండుగ ఫొటోను సమంత అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో, స్టార్ హీరోయిన్ ఫన్నీ ఫేస్ పెట్టగా, రాజ్ నవ్వును దాచుకున్నాడు. ఈ చూడముచ్చటైన ఫోటోకు అభిమానుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.
సమంత - రాజ్ ల పెళ్లి విశేషాలు..
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్ట్‌లలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు. వీరు డిసెంబర్ 1, 2025న కేవలం 30 మంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి పిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.
నాగచైతన్యతో గతంలో పెళ్లి , విడాకులు
సమంతకు గతంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యతో వివాహం జరిగింది. దాదాపు 7 ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. 2017 లో పెళ్లి చేసుకుని.. మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. చైతన్య తర్వాత నటి శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నారు. రాజ్ నిడిమోరుకు గతంలో శ్యామలి దేతో వివాహమైంది. వీరు కూడా విడాకులు తీసుకున్నారు.
మా ఇంటి బంగారం టీజర్
సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ టీజర్ విడుదలైంది. ఇది డ్రామా, హై-ఆక్టేన్ యాక్షన్‌తో కూడిన కథ. ఇందులో సమంత ఒక సంక్లిష్టమైన పాత్రలో కఠినంగా కనిపిస్తుంది. ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తోంది. సినిమాలతో పాటు పలు వ్యాపారాల ద్వారా కూడా ఆమె సంపాదిస్తోంది.

