- Home
- Entertainment
- ఎల్లమ్మ కోసం దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ గా కంటే ఎక్కువా? తక్కువా..?
ఎల్లమ్మ కోసం దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ గా కంటే ఎక్కువా? తక్కువా..?
ఎల్లమ్మ సినిమాతో హీరో అవతారం ఎత్తాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. ఈసినిమాకు సబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇక ఈసినిమా కోసం ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?

హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగు వెలుగుతున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అద్భుతమైన సంగీతంతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ.. లెజెండరీ స్థాయిని సంపాదించుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. ఈమధ్య కాలంలో కూడా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలుగా మారి సక్సెస్ అయిన వారు ఉన్నారు.
ఈక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) నటుడిగా మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదల కావడంతో, ప్రేక్షకుల నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లింప్స్‌లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
ఎల్లమ్మ ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్..
‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీతం స్పెషల్ కాబోతోంది. ఈసినిమా టీజర్ మ్యూజిక్ అదరగొట్టింది. ఇక సినిమా సంగీతం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే.. ఈసినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతం అందిస్తున్నారు. ‘బలగం’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఒకే సినిమాలో హీరోగా నటిస్తూ, సంగీత దర్శకుడిగా కూడా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్.. ఎల్లమ్మ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ ఎంత?
సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారని ఇండస్ట్రీ లో టాక్ ఉంది. అయితే ఎల్లమ్మ సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నాడు దేవిశ్రీ... ఈ కారణంగా ఈ సినిమాకు ఆయన 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఈ వార్త నిజమైతే, దేవిశ్రీ ప్రసాద్ మార్కెట్ రేంజ్ మరో స్థాయికి చేరినట్టే. ఈ సినిమాలో ఫస్ట్ లుక్ అదిరిపోయింది. పెయిర్ బాడీతో, జుంపాల జుట్టు, చేతిలో డప్పు, మాస్ లుక్ లో దేవిశ్రీ ప్రసాద్ అసలు గుర్తు పట్టుకుండా మారిపోయాడు.
హీరోగా సక్సెస్ సాధ్యమేనా...?
తమిళ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, విజయ్ ఆంటోనీ, తెలుగులో గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి, ఆర్పీ పట్నాయక్, కూడా ఇదే తరహాలో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ కూడా నటుడిగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ లో కొంత మంది నటులుగా హీరోగా పెద్ద సక్సెస్ అవ్వలేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రం బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కెరీర్ ఎలా ఉండబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొంది. గ్లింప్స్‌లో ఆయన లుక్‌ను చూసిన అభిమానులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎల్లమ్మను మిస్ అయిన హీరోలు..
ఈ సినిమాను మొదట నాని తో చేయాలనే ఆలోచన వచ్చిందని, ఆ తర్వాత నితిన్ వద్దకు వెళ్లి.. వాళ్లు రిజెక్ట్ చేయడంతో.. చివరికి దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చినట్టు సమాచారం. ఇక మరోవైపు, దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘దేఖ్లేంగే సాలా’ రీసెంట్ గా ఇటీవల విడుదలై పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, దేవిశ్రీ ప్రసాద్ గత సినిమాల స్థాయిలో మ్యూజిక్ వర్కౌట్ అవ్వడంలేదన్న విమర్శలు ఉన్నాయి. మరి ఈ సినిమాకు సంగతి ఎలలా ఉంటుదో చూడాలి.

