- Home
- Entertainment
- సమంత పారితోషికం హాట్ టాపిక్.. ఆ వెబ్ సిరీస్ కోసం ఎంత తీసుకుంటుందో తెలిస్తే ఫ్యూజులు ఔట్
సమంత పారితోషికం హాట్ టాపిక్.. ఆ వెబ్ సిరీస్ కోసం ఎంత తీసుకుంటుందో తెలిస్తే ఫ్యూజులు ఔట్
స్టార్ హీరోయిన్ సమంత అనేక స్ట్రగుల్స్ ని అదిగమించి హీరోయిన్‌గా నిలబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని స్వీకరించి హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తుంది.

సమంత వ్యక్తిగత జీవితంలో అనేక స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నా, కెరీర్‌పై మాత్రం ఆ ప్రభావం పడకుండా చూసుకుంటోంది. చాలా జాగ్రత్తగా కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చిన సినిమా పరంగా వెనక్కి తగ్గేదెలే అంటోంది. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని హీరోయిన్‌గా రాణిస్తుంది. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
సమంత ఇటీవల తాను నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. `యశోద` ఫర్వాలేదనిపించింది. కానీ `శాకుంతలం` అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. కానీ సమంత దాన్ని దాటుకుని, ఆ బాధని అధిగమించి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. భారీ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతూ రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `ఖుషీ` చిత్రం చేస్తుంది. హిందీలో హాలీవుడ్ రీమేక్ `సిటాడెల్` లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్‌తో జోడీ కట్టింది సమంత.
Samantha
అయితే ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నందుకు సమంత అందుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇదొక సంచలనంగా చెప్పొచ్చు. ఎంతో తెలిస్తే మాత్రం ఫ్యూజులెగిరిపోవాల్సిందే. ఈ వెబ్ సిరీస్‌కిగానూ సమంత ఏకంగా పది కోట్ల పారితోషికం అందుకుంటుందట. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అంత భారీ మొత్తం కాబట్టే సమంత ఇందులో నటించేందుకు ఒప్పుకుందట. అంతేకాదు ఇందులో యాక్షన్ చేయడంతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటించేందుకు సిద్ధపడిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇది ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశం అవుతుంది. ఇదే నిజమైతే సౌత్‌లో ఇంతటి పారితోషికం మరే నటి అందుకోవడం లేదని చెప్పొచ్చు.
సమంత ఇప్పటికే `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో నటించింది. ఇందులో రాజీ పాత్రలో ఇరగదీసింది. యాక్షన్ చేసి వాహ్ అనిపించింది. బోల్డ్ సీన్లలోనూ నటించింది. ఈ వెబ్ సిరీస్‌తోనే నార్త్ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఇప్పుడు ఆమెకి నార్త్ నుంచి, హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయంటే ఈ వెబ్ సిరీస్ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. త్వరలోనే ఆమె ఓ హాలీవుడ్ మూవీ చేయబోతుందని సమాచారం.
ఇదిలా ఉంటే సమంత జీవితం గత రెండేళ్లుగా అనేక ఒడిదుడుకులతో సాగుతుంది. ఒక సమస్య తర్వాత మరో సమస్య ఆమెని వెంటాడుతుంది. ఒక్కో బాధని మించిన మరో బాధ ఆమెని దెబ్బతీస్తున్నాయి. మొదటగా తన భర్త నాగచైతన్య విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇది సమంత లైఫ్‌లో అతి పెద్ద విషాదమని చెప్పొచ్చు. గుండె పగిలే విషయం, దాన్ని భరించే క్రమంలో డిప్రెషన్‌కి గురయ్యింది. ఆ బాధ నుంచి బయటపడే సమయంలోనే మయోసైటిస్ వ్యాధి సోకింది. చావు చివరి అంచు వరకు వెళ్లి కోలుకుంది. ఇప్పుడు మామూలు స్థితికి చేరుకుంది. దీనికితోడు ఆమె నటించిన `శాకుంతలం` పెద్ద డిజాస్టర్ కావడంతో సమంతకి దెబ్బ మీద దెబ్బ లాంటి వార్త అని చెప్పొచ్చు. అయినా వాటిని అంతే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతుంది. వరు సినిమాలతో బిజీగా ఉంది.