- Home
- Entertainment
- సమంత దూకుడు మామూలుగా లేదుగా.. ఆమెని బీట్ చేయడం రష్మిక, పూజా, కాజల్, రకుల్, తమన్నాలకు ఇప్పట్లో సాధ్యం కాదు..
సమంత దూకుడు మామూలుగా లేదుగా.. ఆమెని బీట్ చేయడం రష్మిక, పూజా, కాజల్, రకుల్, తమన్నాలకు ఇప్పట్లో సాధ్యం కాదు..
సమంత స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఆమె క్రేజ్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు, ఇంకా మరింత పెరిగింది. అందుకు సోషల్ మీడియానే సాక్ష్యం.

సమంత(Samantha) ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటి. ఒక్కో మెట్టు ఎక్కుతూ, తన ఇమేజ్‌ని పెంచుకుంటూ, మార్కెట్‌ని పెంచుకుంటూ ఇప్పుడు తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. ఓవర్ నైట్‌లో ఆమెకి ఏదీ రాలేదు. అంతా ఆమె కష్టపడి సంపాదించుకున్నదే, అందుకోసం ఎంతో స్ట్రగుల్ అయ్యింది. ఆటుపోట్లు ఎదుర్కొంది. ఇక నటిగా, వ్యక్తిగతంగా తిరుగులేదనుకునే సమయంలో పెద్ద బాంబ్ లాంటి వార్త ఆమెని వెంటాడింది.
సమంత లైఫ్ హ్యాపీగా సాగుతున్న సమయంలో భర్త నాగచైతన్యతో విడాకుల వివాదం ఆమెని కుంగదీసింది. ఒంటరిని చేసింది. అయినా బలమైన వ్యక్తిత్వంతో, స్ట్రాంగ్ విల్ పవర్‌తో దాన్ని అధిగమించింది. ఆ బాధ నుంచి త్వరగానే కోలుకుంది. తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు టాలీవుడ్‌లోనే తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. గ్లామర్ హీరోయిన్లుగా కమర్షియల్ ఫార్మూలాతో దూసుకెళ్తూ నెంబర్ వన్ స్టార్లు గా రాణిస్తున్న పూజా హెగ్డే, రష్మికలను కూడా వెనక్కి నెట్టి దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో తన దూకుడు ప్రదర్శిస్తుంది.
సమంత ఫాలోయింగ్‌కి నిదర్శనంగా నిలుస్తుంది ట్విట్టర్. అందులో సమంత ఇప్పుడు నెంబర్ వన్‌గా రాణిస్తుంది. పది మిలియన్స్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ స్థానంలో ఉంది సమంత. క్రేజీ బ్యూటీస్ పూజా హెగ్డే(Pooja Hegde), రష్మిక(Rashmika), కాజల్(kajal), తమన్నా(Tamanna), రకుల్(Rakul) వంటి ఇతర స్టార్ హీరోయిన్లని మించి దూసుకెళ్లింది. ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాని మైల్ స్టోన్‌కి చేరుకుంది. పది మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ పొజీషియన్‌లో ఉంది సమంత. Tollywood Heroines.
సమంతకి ట్విట్టర్ లో కోటీ మంది ఫాలోవర్స్ ని చేరుకుంది. ట్విట్టర్‌లో ఈ స్థాయిలో ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. అది నిజంగానే అరుదైన విషయమనే చెప్పాలి.ఈ విషయంలో ఇతర హీరోయిన్లు సగానికి పరిమితం కావడం విశేషం. సమంత తర్వాత తమన్నా 5.5 మిలియన్స్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉంది.
అందాల చందమామ మూడో స్థానానికే పరిమితమయ్యింది. ఆమెకి 5.4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత రకుల్ 5.1 మిలియన్స్ తో నాల్గో స్థానంలో, ఐదు మిలియన్లతో కీర్తిసురేష్ ఐదో స్థానంలో ఉండగా, 4.7తో ఆరో స్థానంలో పూజా, 4 మిలియన్స్ తో రష్మిక ఏడో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ ఇద్దరు క్రేజీ బ్యూటీస్ ట్విట్టర్‌లో వెనకబడి పోయారని చెప్పొచ్చు.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతది రెండో స్థానం. 33 మిలియన్ల ఫాలోవర్స్ తో నేషనల్ క్రష్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, 24.2 మిలియన్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో సమంత నిలిచింది. ఇన్‌స్టాలో రష్మిక దూకుడు మామూలుగా లేదని చెప్పొచ్చు. ఇక 23.5 మిలియన్ ఫాలోవర్స్ తో కాజల్ మూడో స్థౠనంలో, 22.3 మిలియన్ ఫాలోవర్స్ తో రకుల్ నాల్గో స్థానంలో, 21.3 మిలియన్ ఫాలోవర్స్ తో పూజా ఐదో స్థానంలో నిలవగా, తమన్నా 17.6మిలియన్ ఫాలోవర్స్ తో ఆరో స్థానంలో, 13.5 మిలియన్ ఫాలోవర్స్ తో కీర్తి ఏడో స్థానానికి పరిమితమయ్యింది.
సమంత నటిగా ఫుల్ బిజీగా ఉంది. డిఫరెంట్ మూవీస్ చేస్తూ దూసుకుపోతుంది. అన్నీ పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తుండటం విశేషం. అందులో `యశోద`, `శాకుంతలం`, `ఖుషీ` చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. ఓ అంతర్జాతీయ మూవీతోపాటు మూడు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసిందని సమాచారం. చైతూతో విడాకుల తర్వాతే ఆమె కెరీర్ మరింతగా పరుగులు పెడుతుండటం గమనార్హం.