- Home
- Entertainment
- Samantha Struggling Days: డబ్బుల్లేక చదువు మానేశా.. ఆ పనిచేస్తే 500 ఇచ్చారంటూ సమంత ఎమోషనల్
Samantha Struggling Days: డబ్బుల్లేక చదువు మానేశా.. ఆ పనిచేస్తే 500 ఇచ్చారంటూ సమంత ఎమోషనల్
సమంత ఇప్పుడు సౌత్‌లోనే టాప్ స్టార్. హీరోయిన్లలో ఆమె నెంబర్ వన్ పొజిషియన్‌లో ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ హీరోయిన్ కాకముందు అనేక స్ట్రగుల్స్ ఎదుర్కొందట. తాజాగా ఈ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యింది సమంత.

సమంత `ఏం మాయ చేసావె` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. అంతకు ముందు మోడలింగ్ చేసిన ఆమె నాగచైతన్యతో కలిసి సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైంది. తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. క్యూట్ అందాలతో అమాయకమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఫ్రెష్ లుక్‌లో సమంత చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అదే ఇంపాక్ట్ ఆమె కెరీర్‌పై ఉండింది. ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత... తన జీవితంలో నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోతుంది. పాన్ ఇండియా అంటే హీరోలకే అనే నానుదిని బ్రేక్ చేస్తూ హీరోయిన్లు కూడా పాన్ ఇండియా స్టార్స్ ఉంటారనే విషయాన్ని చాటుకుంటోంది సమంత. ఆమె తెలుగు, తమిళం, హిందీ నుంచి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ల్లోనూ నటిస్తూ తన సత్తాని చాటుంది. తన చుట్టూ ఉన్న కట్టుబాట్లని, కంచెని తొలగించుకుని ఇప్పుడు స్వేచ్చగా ఎగురుతుంది.
అయితే ఆమె జీవితంలో బ్యాడ్ డేస్ కూడా ఉన్నాయి. అనేక స్ట్రగులింగ్ డేస్ కూడా ఉన్నాయి. మోడలింగ్‌లోకి అడుగుపెట్టడానికి ముందు ఆమె జీవితంలో చాలా కష్టాలు పడిందట. డబ్బుల్లేక చదువు మానేసిందట. తాజాగా ఈ కార్యక్రమంలో ఈ విషయాలను బయటపెట్టింది సమంత. డబ్బుల్లేకి చాలా ఇబ్బందులు పడినట్టు తెలిపింది. చదువుల్లో టాపర్‌గా ఉండే తను డబ్బుల్లేక ఉన్నత చదువులు చదవలేదని, స్టడీస్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని తెలిపింది సమంత.
అయితే మనీ కోసం చిన్న చిన్న పార్ట్ టైమ్ జాబులు చేసేదట. అందులో భాగంగా కొన్ని రోజులు పెద్ద పెద్ద ఫంక్షన్లకి వెల్‌కమ్ గర్ల్స్ గానూ చేసిందట. ఫంక్షన్లకి వచ్చే అతిథులకుస్వాగతం పలికే అమ్మాయిగా పనిచేశానని తెలిపింది. అందుకు రోజుకు రూ. ఐదు వందలు ఇచ్చేవారట. ఇలా తన ఖర్చులకు తానే డబ్బు సమకూర్చుకునేదట.
అంతేకాదు చాలా రోజులు డబ్బుల్లేక ఒక్క పూట భోజనం చేసినట్టు పేర్కొంది. దాదాపు రెండు నెలలు ఇలా ఒక్క పూజ భోజనంతోనే గడిపినట్టు చెబుతూ ఎమోషనల్ అయ్యింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు అడుగులు వేసినట్టు తెలిపింది. అయితే తాను మోడలింగ్ వైపు వెళ్తున్న సమయంలో ఫ్యామిలీ రిలేటివ్స్ కొంత మంది వ్యతిరేకించారని, నీకిది అవసరమా అంటూ విమర్శించేవారని తెలిపింది. కానీ తన పేరెంట్స్ ప్రోత్సాహంతో ముందుకు సాగినట్టు చెప్పింది సమంత.
పన్నేండేళ్ల సినీ జీవితంలో సమంత అనేక సంచలనాలు సృష్టించింది. ఎవరూ ఊహించనంత ఎత్తుకి ఎదిగింది. ప్రేమలో అనేక చేదు జ్ఞాపకాలను చవిచూసింది. ఫైనల్‌గా హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017 అక్టోబర్ 6న వీరి వివాహం జరిగింది. పెద్దల అంగీకారంతో ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం, అటు క్రిస్టియన్ ట్రెడిషన్‌లోనూ సమంత వివాహం జరిగింది. అయితే నాలుగేళ్ల దాంపత్య జీవితం అనంతరం గతేడాది అక్టోబర్ 2న చైతూ, సమంత విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి బయటపడ్డ సమంత ఇప్పుడు కెరీర్ పరంగా దూసుకుపోతుంది.