వ్యాధి సోకి ఏడాది.. సమంత ఎమోషనల్ పోస్ట్.. ఎన్నో పోరాటాలు చూశానంటూ భావోద్వేగం..
సమంత.. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుని మామూలు స్థితికి చేరుకుంది. అయితే తనకు వ్యాధి నిర్థారణ అయి ఏడాది అవుతుందట. తాజాగా దాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ అవుతుంది.

సమంత.. తన అనారోగ్యం టైమ్‌లో ఎదుర్కొన్న సవాళ్లని, ఆమె మదన పడ్డ భావాలను, ఎంత స్ట్రగుల్ అయ్యిందనే విషయాన్ని తాజాగా వెల్లడించింది. తనకు వ్యాధి నిర్థారణ అయి నేటి(జూన్ 15)తో ఏడాది అవుతుందని, దీంతో ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సమంత. తన సంఘర్షణని బయటపెట్టింది. ఈ ఏడాదిలో తాను ఎన్ని చూసిందో చెప్పింది. తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.
ఇందులో సమంత చెబుతూ, `వ్యాధి నిర్థారణ అయి ఏడాది అయ్యింది. ఎంతో ఫోర్స్ డ్‌గా కొత్తగా సాధారణ జీవితానికి వచ్చాను. ఈ ఏడాదిలో నా శరీరంలో ఎన్నో పోరాటాలున్నాయి. ఉప్పు, చక్కెర ధాన్యులు మెయిన్ కోర్స్ కోసం కాక్ టెయిల్ తో కూడిన మందులు, బలవంతంగా ముంగించడం, బలవంతంగా మళ్లీ ప్రారంభించడం, అర్థం, ప్రతిబింబం, ఆత్మ పరిశీలన కోరుకునే సంవత్సరంగా ఈ ఏడాది నిలుస్తుంది. వృతి పరమైన వైఫల్యాలు కూడా, విషయాలను మరింత ఆసక్తికరంగా మార్చడానికి.
ప్రార్థనలు,పూజల సంవత్సరం కూడా, ఎందుకంటే ఆశీర్వాదాలు, బహుమతుల కోసం ప్రార్థించడం కాదు, బలాన్నీ, శాంతిని పాందాలని ప్రార్థిస్తున్నాను. అన్ని వేళలా అన్నీ నీ మార్గంలో జరగవని నాకు నేర్పిన సంవత్సరం. మరీ ముఖ్యంగా అది లేనప్పుడు నేను నియంత్రించదగిన వాటిని నియంత్రించాలి, మిగిలిన వాటిని వదిలేయాలి, ఒక సమయంలో ఒక అడుగు ముందుకు వేస్తూ ఉండాలి, కొన్నిసార్లు అది గొప్ప విజయాల గురించి ఆదు, కానీ ముందుకు సాగడం అనేది విజయానికి మెట్టు.
Samantha
విజయాలు మళ్లీ పరిపూర్ణం కావడానికి నేను ఎదురుచూస్తూ కూర్చోకూడదు, గతం గురించి ఆలోచిస్తూ ఉండకూడదు, నేను ప్రేమని, నేను ఇష్టపడేవారిని పట్టుకోవాలి, నన్ను ప్రభావితం చేసే శక్తిని ద్వేషించకూడదు, మీలో చాలా మంది కష్టతరమైన యుద్ధాలు చేస్తూ ఉంటారు, నేను మీకోసం కూడా ప్రార్థిస్తున్నాను, దేవతలు ఆలస్యంగా చేయవచ్చు, కానీ వారు ఎప్పుడూ తిరస్కరించరు,శాంతి, ప్రేమ, ఆనందం, శక్తిని కోరుకునే వారిని దేవతలు ఎప్పుడూ నిరాకరించరు` అని పేర్కొంది సమంత. ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సమంత ప్రస్తుతం సెర్బీయాలో విహరిస్తుంది. అక్కడ సెయింట్ సేవ చర్చ్ లో ప్రార్థనల్లో పాల్గొంది.ఈ సందర్భంగా ఆమె ఈ భావోద్వేగ పూరితమైన పోస్ట్ పెట్టడం విశేషం. ఇది వైరల్ అవుతుంది. సమంత గతేడాది జూన్ తర్వాత నుంచి కనిపించలేదు. అమెరికా వెళ్లిందన్నారు. అనారోగ్యం అని, ట్రీట్ మెంట్ తీసుకుంటుందన్నారు, ఈ క్రమంలో అనేక ఆమె అనారోగ్యంపై అనేక పుకార్లు వచ్చాయి. రెండు మూడు నెలల సస్పెన్స్ లో పెట్టిన సమంత..`యశోద` సినిమా రిలీజ్ టైమ్‌లో తన వ్యాధి గురించి వివరించింది.
దాన్నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం రెగ్యూలర్ లైఫ్‌ని లీడ్ చేస్తుంది. సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతుంది. ఆమె ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తుంది. దీంతోపాటు నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుందట. మరోవైపు హిందీలో `సిటాడెల్` వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఇందులో షాహిద్ కపూర్‌తో కలిసి నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది.