- Home
- Entertainment
- ఆ పాటలో నటించవద్దని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు.. వారికి వ్యతిరేకంగా ఎందుకు చేశానంటే, సమంత కామెంట్స్
ఆ పాటలో నటించవద్దని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు.. వారికి వ్యతిరేకంగా ఎందుకు చేశానంటే, సమంత కామెంట్స్
సామ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఏమాయ చేసావో చిత్రతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పుడు ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న నటి.

samantha
సామ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఏమాయ చేసావో చిత్రతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పుడు ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న నటి. సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉంది. తెలుగులో ఆమె ఎలాంటి చిత్రానికి సైన్ చేయలేదు. ఖుషి తర్వాత సామ్ ని వెండి తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Samantha
నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి. విడాకుల డిప్రెషన్ లో ఉండగా మయో సైటిస్ వ్యాధి మరింతగా సమంతని కుంగదీసింది. సమంత చైతు విడిపోవడానికి అనేక కారణాలు వినిపించాయి. స్పష్టమైన కారణం ఏంటో వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు.
Samantha
అయితే స్వేచ్ఛ విషయంలో విభేదాలు వచ్చాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై సమంత ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా కామెంట్స్ చేసింది. చైతుతో విడాకుల తర్వాత సమంత పుష్ప చిత్రంలో ఓ అంటావా మావ ఐటెం సాంగ్ చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
దీనిపై సమంత ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయట పెట్టింది. విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నా సమయంలో పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట. కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఇలాంటి పాట చేస్తే విమర్శలు ఎక్కువవుతాయని.. వద్దని చెప్పారట.
కానీ ఐటెం సాంగ్ చేయకుండా ఉండేందుకు నాకు ఎలాంటి కారణం కనిపించలేదు. అలాంటప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి. నేను ఎలాంటి తప్పు చేయడం లేదు. నా మ్యారేజ్ లైఫ్ లో కూడా నేను నిజాయతీగానే ఉన్నా అని సమంత పేర్కొంది.
గత మూడేళ్ళలో సమంత యశోద, ఖుషి, శాకుంతలం ఇలా మూడు చిత్రాలు మాత్రమే చేసింది. ఇప్పుడు మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడంతో సమంత తన కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది.