Samantha: ప్రెగ్నెన్సీపై సమంత కామెంట్స్... పాత పోస్ట్ ను వైరల్ చేస్తూ బాధపడుతున్న ఫ్యాన్స్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కెరీర్ లో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్.. హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది సామ్. డివోర్స్ తరురవాత ఇంకా బిజీ అయిపోయింది సమంత.
samantha
సమంత (Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగా చేతిలో పెట్టుకుని ఫుల్ బిజీగా మారిపోయింది సామ్. వరుసగా షూటింగ్ లు.. ఖాళీ టైమ్ లో ఫ్రెండ్స్ తో టూర్లు.. వీటితోనే గడిపేస్తుంది సమంత. తన లైఫ్ ను తాను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తుంది.
డివోర్స్ తరువాత సమంత(Samantha) ఇంకా బిజీ అయిపోయింది. టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా కమిట్ అవుతోంది. గత ఏడాది అక్టోబర్ 2 టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) తో విడిపోతున్నట్టు ప్రకటిచింది బ్యూటీ. అప్పటి నుంచి మూవీ కెరీర్ పై దృష్టి పెట్టింది.
కెరీర్ బిగినింగ్ లోనే చైతూ(Naga Chaitanya) తో ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్ పెళ్ళి చేసుకుని నాలుగేళ్లు హ్యాపీగా ఉంది. టాలీవుడ్ లోనే మంచి జంటగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య ,సమంత(Samantha) జంట విడిపోవడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. తరువాత అయినా వీరిద్దరు మళ్ళీ కలవకపోతారా అని ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఫ్యాస్స్ సమంత పాత పోస్ట్ లను వైరల్ చేస్తున్నారు. 2019 లో సమంత (Samantha) ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ చార్ట్ చేసింది. అందులో మీరు ఎప్పుడు పిల్లల్ని కంటారు.అన్న ప్రశ్నకు 2022 అగస్ట్ 7న ఉదయం 7 గంటలకు బిడ్డకు జన్మనిస్తాను టూ సమంత క్లియర్ గా చెప్పింది. దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు.
ఇప్పుడు సమంత (Samantha) అన్ని పోస్ట్ లతో పాటు ఈ కామెంట్స్ ను కూడా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతా బాగుండి ఉంటే.. ఈ పాటికి సమంత ప్రెగ్నెంట్ అయ్యి ఉండేది కదా అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. మంచి జంటగా పేరు తెచ్చుకున్న ఈ కపుల్ విడిపోకుండా ఉంటే ఎంత బాగుండేదో అంటూ ఫీల్ అవుతున్నారు.
ఏం మాయ చేశావే సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆతరువాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటిసినిమాలతో సందడి చేశారు. ముఖ్యంగా పెళ్లి తరువాత నటించిన మజిలీ సినిమాలో భార్య భర్తలుగా వీరి పర్ఫామెన్స్ అందరిని ఆకట్టుకుంది.
నాగచైతన్య(Naga Chaitanya) – సమంత(Samantha) ఏం మాయ చేశావే టైమ్ లోనే ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్లు సీక్రేట్ గా ప్రేమింకున్న ఈజంట 2017 లో పెళ్ళి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా అదే కెమిస్ట్రీ మెయింటేన్ చేసిన జంట తమ షికార్ల అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ వచ్చారు. సడెన్ గా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో విడాకులు ప్రకటించారు ఈ జంట.
డివోర్స్ ప్రకటన తరువాత సమంత(Samantha) చాలా డిస్ట్రబ్ అయ్యింది సోషల్ మీడియాలో పోస్ట్ లతో ఆమె పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. తో పాటు ఫ్రెండ్స్ తో టూర్లకు వెళ్తూ.. ఆ బాధనుండి బయటపడటానికి ప్రయత్నించింది. తరువాత షూటింగ్స్ తో బిజీ అయిపోయింది సామ్.