MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ చైతన్య నుంచి సమంత భరణం తీసుకోవడం లేదా.. కారణాలు ఇవే ?

నాగ చైతన్య నుంచి సమంత భరణం తీసుకోవడం లేదా.. కారణాలు ఇవే ?

సెలెబ్రిటీలు విడిపోయినప్పుడు మాజీ భర్త నుంచి మహిళలు భారీ మొత్తంలో భరణం రూపంలో డబ్బు కానీ, ఆస్తులు కానీ పొందుతారు. 

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 08 2021, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దేశం మొత్తం సినీ ప్రియులందరినీ షాక్ కి గురిచేసిన సంఘటన నాగ చైతన్య, సమంత విడాకులు. ఎంతో అన్యోన్యంగా జీవించే వీరిద్దరూ ఎవరూ ఊహించని విధంగా విడిపోయారు. టాలీవుడ్ లో అందమైన జంటగా ఉన్న వీరిద్దరూ విడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. సమంత, నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చైతు సమంత విడిపోయినప్పటి నుంచి మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.  చై సామ్ విడిపోవడానికి గల కారణాలని విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారంలో సమంత స్టైలిష్ గా పనిచేసిన ప్రీతమ్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ప్రీతమ్, సమంత లది అక్కా తమ్ముడి బంధం అంటూ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ క్లారిటీ ఇచ్చింది. అక్కినేని కుటుంబం నుంచి సమంతకు కొన్ని నిబంధనల పేరుతో వేధింపులు ఎదురయ్యాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అసలైన కారణాలు మాత్రం ఎవరికీ తెలియదు. 

36

ఇదిలా ఉండగా సెలెబ్రిటీలు విడిపోయినప్పుడు మాజీ భర్త నుంచి మహిళలు భారీ మొత్తంలో భరణం రూపంలో డబ్బు కానీ, ఆస్తులు కానీ పొందుతారు. హాలీవుడ్, బాలీవుడ్ లో సెలెబ్రిటీలు తమ మాజీ భర్తల నుంచి భరణం పొందిన వార్తలు గతంలో చూశాం. ఇక Samantha కూడా నాగ చైతన్య నుంచి కోట్లలో భరణం పొందుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. 

46

అసలు సమంతకు భరణం పొందాల్సిన అవసరమే లేదని అంటున్నారు.అందుకు కారణంగా సమంత సంపాదనని తెరపైకి తీసుకువస్తున్నారు. సమంత సౌత్ లో ఎంతటి పాపులర్ హీరోయిన్ అనే విషయం అందరికి తెలిసిందే. సమంత ప్రతి చిత్రానికి రూ. 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. సమంత నెట్ వర్త్ విలువ రూ 80 కోట్ల వరకు ఉంటుందట. సినిమాలు కాకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా  సమంత నెలకు రూ 25 లక్షల వరకు పొందుతుందట. 

56

సినిమాలలో సమంతతో పోల్చుకుంటే Naga Chaitanya ఆదాయం తక్కువ. ఇటీవల చైతూకు కాస్త హిట్ చిత్రాలు పడుతున్నాయి. గతంలో చైతు వరుసగా పరాజయాలు చవిచూశాడు. చైతు మార్కెట్ రేంజ్ కూడా పరిమితం. ఇక కుటుంబ పరంగా చైతూకి బాగా ఆస్తులు ఉండొచ్చు. కానీ అవన్నీ తన తండ్రి నాగార్జున పేరునే ఉన్నట్లు టాక్. సో సమంత నాగ చైతన్య నుంచి భరణం ఆశించే అవకాశమే లేదని అంటున్నారు. 

66

ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించిన తర్వాత సమంత క్రేజ్ ఇండియా మొత్తం వ్యాపించింది. ప్రస్తుతం సమంత తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఒక చిత్రం, తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది. చైతు రీసెంట్ గా లవ్ స్టోరీ మూవీతో హిట్ అందుకున్నాడు. ఏ మాయ చేసావే చిత్రంతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి వివాహ బంధంతో ముడిపడింది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు  నిలవలేదు. 

Also Read: సమంత- ప్రీతమ్ మధ్య రిలేషన్ పై క్లారిటీ, తెలివి తెచ్చుకోండి.. హాట్ టాపిక్ గా మారిన ఆ పోస్ట్

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt: ఫోన్‌లో రణ్‌బీర్ పేరును ఆలియా భట్ ఎలా సేవ్ చేసుకుందో తెలుసా? టాప్ సీక్రెట్
Recommended image2
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?
Recommended image3
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved